telugudanam.com

      telugudanam.com

   

ఆంజనేయ నామమహిమ

ఆంజనేయుని జనన మెప్పుడు?

ఆంజనేయస్వామి వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!

పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||

ఆంజనేయులవారు వసంతఋతువు, వైశాఖ మాసంబు కృష్ణపక్షంలో దశమి తిధీ, శనివారము నాడూ, పూర్వాభాధ్రా నక్షత్రమున, వైధృతౌ మధ్యాహ్న కాలమున అంజనీదేవికి ఉదయించెను.

రామాయణ రసాత్మక కావ్యమునకు రమణీయ మంత్రం ఆంజనేయుడు. ఈతడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి, ఆంజనేయ నామమహిమ అనితరమైనది. అంజనాదేవి అనునామమున ఆద్యాంతా దక్షరములు గ్రహించిన 'ఆన" అగును. ఆన ప్రణనే అని సంస్కృతదాతవు. అనగా జీవింపచేయునది అని అర్ధం. ఆమె కుమారుడుగాన సదా జీవించువాడు -

మృత్యుంజయుడు, రుద్ర వీర్య సముధ్భవుడు యను నానార్ధములు గలవు. తండ్రి వాయుదేవుడు కూడా ప్రాణదాతయే, వాయువులేని యడల సమస్త జీవరాశులు అల్లకల్లులితమగును. లోకములు తల్లడిల్లును. జీవింపజేయు క్రియలు తల్లిదండ్రులకు గలవు గాన వారిపుత్రుడగు వారి పుత్రుడైన హనుమంతుని సేవించుట శ్రేయస్కరం. సీతా శోకనివారణుడు, లక్ష్మణ ప్రాణదాత - సుగ్రీవుడు, లక్ష్మణుడు, రాముని, సీతను, వివిధవిపత్కర సమయాల రక్షించాడు. గాన స్మరాణా భవేత్ సకలపాపహారం - అని ఆర్యోక్తి కలదు.


నాగవల్లి ప్రియుడెందుకైనాడు?

నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు - తమలపాకులు, ఇవి ఆయనకు ఎందుకిష్టమనగా దేవదానవులు క్షీరసాగర మధనం చేయువేళ కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమ్రుతము ఆపై నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినవట. ఆ ఆకులు సేవించటం ఆరోఘ్య భాఘ్యమునకు హేతువు. తమలములు తమ జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశావుండదని వేమనశతకంలో వివరించెను. జీర్ణ శక్తి, ఎముకలపుష్టి వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట,రగిలించుట, పైత్యం, అరుచి మొ|| ఔషదమిది తమలపాకులు దళార్చన చేయువారు మూలం క్రిందకుండునటుల, దళపై భాగం ముందునట్లుంచి పూజించవలెను. భక్తులు భగవంతునకు పత్రం, పుష్పం, ఫలం, ఉదకమైనా భక్తితో సమర్పించుట మంచిది. ఆంజనేయుని దేహము ఆకుపచ్చారంగులో నుండును - సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు అది రక్షణ కవచంగా కాపాడెను.


హనుమానుని స్థావరాలేవి?

అతనికిష్టమైన పురము కుండినపురము, శ్రీభధ్రము, కుశతర్పణం, పంపాతీరం, చంధ్ర కోణం, కాంభోజం, గంగమాధనము, బ్రహ్మవర్తపురము, బాహ్హ స్పత్యపురము, మహిహ్మితీ పురము, నైమిశారణ్యము, సుందర నగరము, శ్రీ హనుమత్పురము - ఈ స్థానములు వాయుపుత్రునకు పుణ్య స్థలములు. అచటనే ఆయన వశించు స్థావరములు. ఇహ, పర సాధనలు, హనుమంతుని ధ్యానం అవసరం.


ఏ ఏ పూలంటే ఇష్టం?

జానకీ శోక నాశనుడు ఆంజనేయుడు. ఆయనకు మొల్ల, పాటల, పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడూ, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం మొదలగు పుష్పాలు. పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలా మొదలగు ఆకులు ఇష్టం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: