telugudanam.com

      telugudanam.com

   

"భక్తులను సదా రక్షించే శ్రీ సాయినాధుడు"

ఈ భూమిపై ధర్మాచరణకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, ఆధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ, ధర్మసంస్థాపనలను తన సంకల్పంగా చేసుకొని ప్రతీయుగంలోను అవతరిస్తానని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆప్రకారంగానే వివిధ యుగాలలో, వివిధ అవతారాలలో, రూపాలలో ఆ పరమాత్మ దివి నుండి భువికి తిరిగివచ్చి తన అవతార కార్యం చేసాడు. అట్లా అవతరించిన పుణ్యపురుషులు, సాధుసత్పురుషులలోకెల్లా అగ్రగణ్యుడు, మహిమాన్విత శక్తివంతుడు, రాజాధిరాజా, యోగులందరికీ సామ్రాట్ వంటివారు. మన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులు. ఈ పవిత్ర భారతావనిలో పంతొమ్మిదవ శతాబ్ధంలో అవతరించి, ఒక పాడుబడిన మశీదును తన నివాసంగా చేసుకోని అనేక లీలలను గావించి, లక్షలాది మందికి జ్ఞానమార్గం చూపించి వారికి చివరికంతా తోడు నీడగా నిలిచిన పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం శ్రీసాయి. మనసా, వాచా, కర్మణా తనకు సర్వస్వం శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి వారికి ఇహపరాలను ప్రసాదించిన విశిష్ట గురుదేవులు శ్రీసాయినాధులు. అటువంటి శ్రీసాయి చేసిన కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం!

ఒకనాడు శ్రీసాయినాధుని ముఖ్య భక్తుడైనా మాధవరావు దేశ్‌పాండే (శ్యామా)కు ఒక భయంకరమైన విషసర్పం కరిచింది. మొదట శరీరంలోనికి విషం అతివేగంతో వ్యాపించడం ప్రారంభించింది. బాధ క్షణక్షణానికే తీవ్రమవసాగింది అంతలోనే శ్యామ శరీరం కూడా నెమ్మదిగా నీలిరంగులోనికి మారసాగింది. ఇక తనకు మరణం తప్పదని శ్యామా ధృవీకరించుకున్నాడు. అతని స్నేహితులు విఠోచా గుడికి శ్యామ్‌ను తీసుకు వెళ్లదలిచారు అందుకారణం అత్యంత ప్రమాదకరమైన పాముకాట్లు సైతం అక్కడ బాగవుతుండేవి. కాని శ్యామా అందుకు ఒప్పకొనక తన గురుదేవులైన శ్రీసాయి వద్దకు పరుగులు తీశాడు. మశీదు మెట్లెక్కుతున్న శ్యామాను చూసినంతనే శ్రీసాయి కోపంతో శతకాను వదిలిస్తు బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. "ఓరి పిరికి పురోహితుడా! పైకి ఎక్కవద్దు ఎక్కినావో ఇక ఏమౌతుందో చూడు! అని బెదిరిస్తూ ఆ తర్వాత పో! వెదలిపో! దిగువకు పో! అంటూ గర్జించారు. బాబా అట్లా ఆకశంతో తనను తిట్టడంతో శ్యామా మానృడి పోయాడు. శ్రీసాయియే తనదేవమని, మశీదుకు తనకు ఆశ్రమమని, తన జీవితమంతటినీ శ్రీసాయి పాదాల వద్దే గడపాలని తనింత కాలం తలచాడు. తన జీవితం ప్రమాదంలో పడినప్పుడు శ్రీసాయి వద్దకు రక్షణ కోసం వస్తే చాలా తనను కసురుకుంటున్నారు. ఇప్పుడూ తనెక్కడికి వెళ్లగలడు? ప్రాణాల మీద ఆశవదులుకొని మశీదు మెట్ల మీదే శ్యామా కూలబడ్డాడు. కొంత సేపటికి శ్రీసాయి శాంతించి శ్యామా వద్దకు పోయి ఇట్లు ఊరడించారు." భయపడవద్దు, ఏమాత్రం చింతించవద్దు. దయామయుడైన ఈపకీరు ఇక్కడ ఉండగా నీప్రాణాలకు ఏం భయంలేదు. ఇంటికి పోయి విశ్రాంతి తీసుకొ! భయపడవద్దు" అని చల్లని మాటలు చెప్పి శ్యామ్‌ను ఇంటికి పంపించిలేసారు. ఆతర్వాత శ్రీసాయి లాల్సీ కొట్‌పాటిల్ నానాసాహెబ్ దీక్షితులను పిలిచి "మీరు కూడా శ్యామా ఇంటికి వెళ్లండి! శ్యామా తనకు ఇష్టం వచ్చినట్లు తినవచ్చు, ఇంటిలోనే తిరగవచ్చు, కాని పడుకొనవలదు!" అని తగుసూచనలు ఇచ్చి పంపించారు. బాబా పలుకులను యధాతధంగా పాటించిన శ్యామా కొద్ది గంటలలోనే బాగుపడ్డాడు. తన జీవితాన్ని రక్షించి తన దైవం, గురుదేవులు శ్రీసాయికి అనేక వేల సార్లు కృతజ్ఞతలర్పించాడు. ఈవిధంగా శ్రీసాయి ఏమందులు అవసరం లేకుండానే శ్యామా యొక్క ప్రాణాలను కాపాడారు. అంతేకాక శ్రీసాయి పలికిన "పో! వెదలిపో! దిగువకు పో! అన్న మాటలు శ్యామాను కాక శ్యామశరీరంలో వ్యాపిస్తున్న విషాన్ని ఆజ్ఞాపించిన మాటలు! ఈసృష్టికే కర్త, స్థితి లయకరుడైన శ్రీసాయి మాటలకు హడలి పోయి ఆవిషం క్షణాలలో తెగిపోయింది! తన భక్తుని రక్షించడంలో శ్రీసాయి చూపిన పద్ధతి అత్యంత విశిష్టమైనది.

మరొక సందర్భంలో బాపూసాహెబ్ బూటీ అనే ఒక ధనవంతుడైన సాయి భక్తుడు షిరిడీ లో ఉండగా, అక్కడికి నానాసాహెబ్ డెంగలీ అనే గొప్ప జ్యోతిష్కుడు వచ్చి బూటీ జాతకం పరీక్షించి ''ఈరోజు నీకు అశుభం ఈరోజున నీకు ప్రాణగండముంది కావున ఇల్లు విడిచి పోవలదు!" అని చెప్పాడు. ఆ మాటలను విన్న బూటి భయకంపితుడై పరుగులు తీసి మశీదుకు వెళ్లి శ్రీసాయి కాళ్లపై పడి కళ్లనీళ్ల పర్యంతరమై ప్రార్ధించాడు. బూటీని చూసి బాబా చిరునవ్వుతో" ఆపనికిమాలిన జ్యోతిష్కుడు ఏమన్నాడు? నీకు ప్రాణగండముందనా! అయితే నామాటలను విశ్వసించు మృత్యువు నీదరిదాపులకు కూడా రాదు! ఈ విషయాన్ని ఆజ్యోతిష్కుడికి చెప్పిరా! అని అన్నారు. బాబా అభయంతో బూటీ మనస్సు కాస్తకుదుట పడింది. ఆరోజు సాయంత్రం బూటీ వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఎక్కడినుండో ఒక విషసర్పంవచ్చి బూటీ ఎదుట నిలిచి బుసలు కొట్టసాగింది. బూటీ ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది భయంతో శరీరమంతా కంపించసాగింది. చెమట విపరీతంగా పట్టింది. అయినాసరే ఎక్కడలేని ధైర్యాన్ని కూడా తీసుకొని సాయి నామ జపం చేయసాగాడు. క్షణాలలో ఆ పాము బరబరా పాక్కుంటూ ఎక్కడికో వెళ్లిపోయింది! తనప్రాణాలనుకాపాడిన శ్రీసాయికు మనస్సులోనే అంజలి ఘటించాడు బూటీ వాస్తవానికి జాతకం ప్రకారం ఆరోజు బూటీకి ప్రాణగండముంది కాని తనను సంపూర్ణ భక్తితో సర్పశ్య శరణాగతి బొనరించిన భక్తుని తన శక్తితో రక్షించి గృహల స్థితిగతులను మార్చి వేసారు శ్రీసాయి. శ్రీసాయికి సంపూర్ణ శరణాగతి చేసి భక్తితో ప్రార్ధిస్తే జాతకాలను సైతం తయారు చేసి రక్షించే అద్భుత అసామాన్య గురుదేవులు శ్రీషిరిడీ సాయినాధులు.

సర్వం శ్రీసాయినాధ పాదార విందార్పణమస్తు!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: