telugudanam.com

      telugudanam.com

   

దివ్య ప్రార్థన

జీసస్ నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను. ఈ భూగోళము పాపంతో భారమైనను ఇంకనూ వేడితో దహించకుండా ఉండడానికి పరిశుద్దుల ప్రార్థనలే కారణం. ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత,ఆయుధం,శక్తి,మార్గం. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. అబ్రహాం, మోషే, ఏలియా, హన్నా, ఏస్తేరు మన ప్రభుయేసు ప్రార్థనలు పరిస్థితులనే మార్చాయి. పశ్చాత్తాప ప్రార్థన రక్షించును. స్వస్థపరుచును. యుద్దములు మాన్‌పును, సువార్త ద్వారములు తెరుచును.ప్రసవ వేదనతో కూడిన కన్నీటి మొర త్వరగా పరము చేర్చును. ఆత్మ ద్వారం తెరిచేది ప్రార్థనయే.డి.యల్.మూడి "గొప్ప బోధకుని కంటే మెరుగ్గా నేను ప్రార్థన చేయగలగాలి. ఎందుకనగా యేసుక్రీస్తు తన శిష్యులకు బోధింప నేర్పలేదు కానీ, ప్రార్థింప నేర్పారు."ప్రార్థించు హృదయం దగ్గర దేవుడు తన చేతులు వెచ్చబెట్టుకుంటారు, అని జాన్ మాన్ ఫీల్డ్ అన్నారు.ఆత్మలో వెనుకబడిన వారి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడని రావన్ హిల్ తెలిపారు.

పాపి ప్రార్థన ప్రభుని చేరదు. ఎవరి దోషాలు వారి ప్రార్థనామార్గానికి అడ్డు. కొన్నిసార్లు బిచ్చగాళ్ళకు వలే మొరలకు జవాబులు వస్తాయి. మనము దేవుని కుమారులమా, బిచ్చగాళ్ళమా? నిర్ధోష హృదయం, శుద్ద మనస్సాక్షి, నిష్కపట విశ్వాసం, విరిగిన మనసు ఆత్మ నడిపించు ప్రార్థన ప్రవచన-ప్రతిఫల ప్రార్థనలకు దారితీయును. దేవునికి ప్రేమతో చేసే ప్రార్థనకు ఎల్లలుండవు. "నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుకొనుట వలన యెహోవాకు విరోధముగా పాపము చసిన వాడనగుదును"(1సము-12:23).అలె ఆల్‌ఫ్రెడ్ టెనిసన్ "ప్రపంచం కలలో కూడా ఊహించని రీతిగా ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు సాధింపబడును"అనెను.సాతాను బైబిలు చదవనిస్తాడు, బోధించనిస్తాడు, సంఘ కార్యకలాపములో ముమ్మర పరుస్తాడు,కాని ప్రార్థనలో ఆటంకపరుస్తాడు.ఎందుకు? యేసు నామమున విశ్వాసముంచి చిన్న బిడ్డ విశ్వాసంతో ఆయనను ప్రార్థిస్తే సాతాను వణుకుతాడు. ప్రార్థన చేయని వారిని వణికించగలడు. మన కొరకు యేసు తండ్రి కుడి పార్శ్యమున విజ్ఞాపన చేస్తుండగా,మనము మన కోసం, తప్పి పోయిన మన బిడ్డలకోసం, బార్యా భర్తల కోసం, పొరుగువారి కోసం, చదువు, జ్ఞానం, ఆరోగ్యం,ఆర్థిక సామర్థ్యం,ఆత్మల ఎదుగుదల కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం ప్రార్థన చేయలేమా?!నవీన యుగంలో ధనార్జన,ప్రాపంచిక ఆశలతో మనుష్యులను నింపి, ప్రార్థన ఆచరించే వారి గుండెల్లో సాతాను కూర్చున్నాడు. అందుకే గృహాలలో పాటల పోరే గాని ప్రార్థనారావం వినిపించడం లేదు.

విచారమేమిటంటే, ప్రార్థన గురించి బోధించేవారు , రాసేవారు, గ్రహించేవారు కూడా ప్రార్థనాహీనులు కాగలరు.ప్రార్థనాహీనత పతనమునకు హేతువు.ప్రార్థనతో నూతన భలం చేకూరును. దురాత్ములు, దుష్టపాలకులు బంధించబడి సువార్త నలుదిశలా సాగాలంటే ప్రార్థనే సాధనం. యు.ఎస్.సెనెట్ చాప్లెన్ "నీవు సెనెటర్ల కొరకు ప్రార్థిస్తావా?" అని ఎడ్వర్డ్ ఇవెట్ హేల్‌తో అనగా ఆయన లేదు,నేను సెనెటర్లను చూచి దేశం కొరకు ప్రార్థిస్తాను"అన్నాడు. బైబిల్ సర్వం ప్రార్థనాపరులైన స్త్రీపురుషులతో నిండియున్నది. ప్రార్థనా ఫలితాలు అనంతరం. ప్రార్థనాపీఠంపై విజ్ఞాపములు ధూపంతో సమంగా దేవునికి ఇంపు అనిపించే సువాసన. "రాజాధిరాజా! సిలువపై తండ్రిని మాకై స్వరక్తంతో క్షమవేడిన కరుణామయా! నీ ఘన నామమును ప్రార్థించ మేమెట్లు తగుదుము.మము నిరాపరింపక ఎల్లవేళలా నిస్సహాయ నిర్భాగ్య దీన మొరలు ఆలకించుము తండ్రీ! ప్రార్థనలతో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ప్రపంచాన్ని జయించిన గొప్ప దైవజనుల రహస్యం ఏమిటంటే వారు ప్రతి రోజూ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. డీఎల్‌మూడీ ఒకసారి "నేను అర్జంట్‌గా ప్రార్థించాలి. లేకపోతే సాతాను నన్ను జయిస్తాడు"అన్నాడు. ప్రతిరోజూ ఆయన ఉదయకాలం మూడుగంటల పాటు ప్రార్థనలో గడిపిన తర్వాతనే తన దినచర్యను ప్రార్థించేవారు. ప్రార్థనలతో ఎన్నో ఘనకార్యాలను చేశారు. వారు అందించిన పరిచర్యను ఈతరం విశ్వాసులు వాడుకుంటున్నారు. ప్రార్థించడం అంటే ఆయనను పూర్ణమనస్సుతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించేవారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు.

ప్రార్థనకు ఉండే ప్రాధాన్యతను గమనించిన క్రైస్తవ సంఘాలు ఈనాడు ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాయి. ప్రపంచమంతా ఒక్కటై అన్ని దేశాల్లో శాంతి, ప్రేమ, ఐక్యమత్యం, అభివృద్ది వంటి వాటిలో వృద్ది చెందాలని కాంక్షిస్తూ ప్రార్ధనలు చేస్తున్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: