telugudanam.com

      telugudanam.com

   

వరాహావతారం

వరాహవతారం

శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు. ఒకసారి మనువు వినయంతో చేతులు జోడించి పితృదేవులైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. "ఓ పితృవర్యా! సమస్త ప్రాణుల సృష్టికర్త మీరే, మేము ఏపనులు చేసి మిమ్ములను సేవించగలమో సెలవీయండి" అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "కుమారా! నీకు శుభమగుగాక! నీమాటలతో సంతృప్తి చెందాను నీవు నాఆఙ్ఞతో ఆత్మసమర్పణం చేసుకున్నావు. పుత్రులు తండ్రిని ఈవిధంగా పూజించాలి. వారు తమ తండ్రి ఆఙ్ఞను ఎంతో గౌరవంతో పాటించాలి. నీవు భూమిని ధర్మమార్గాన్ని అనుసరించి పాలించు. యఙ్ఞ యాగాదుల ద్వారా శ్రీహరిని సేవించు. ప్రజలను పాలించడం ద్వారా నన్ను నీవు సేవించగలవు" అన్నారు. అప్పుడు మనువు "నేను మీ ఆఙ్ఞను శిరసావహించి సమస్త జీవులకు ఆధారమైన ఈ భూమిన ిపరిపాలిస్తాను. కానీ ఇప్పుడు భూమి జలప్రళయంలో మునిగి ఉన్నది. కాబట్టి నేను ఈ భూమిని ఎలా పాలించగలను?" అన్నాడు. భూమి పరిస్థిని గ్రహించిన బ్రహ్మదేవుడు వెనువెంటనే శ్రీ మహావిష్ణువును ప్రార్ధించాడు. ఆ ప్రార్ధన ఫలంగా శ్రీహరి వరాహభగవానునిగా ప్రత్యక్షమైనాడు. భూమిని ఉధ్ధరించడానికై వరాహస్వామి నీటిలోకి దిగాడు. నీటిలో మునిగి ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి రసాతలమునుండి పైకి వచ్చాడు. మార్గమద్యంలో విఘ్నాలు కలిగించడానికై ఆ నీటిలో పరాక్రమ శాలైన హిరణ్యాక్ష్క్షుడు గదతో యుధ్ధం చేయనారంభించాడు. దానితో ఆగ్రహం చెందిన వరాహస్వామి సింహం, ఏనుగును చంపినట్టుగా అతనిని సంహరించాడు.

నీటిలోనుండి బయటకు వచ్చిన వరాహావతార భగవానుని చూసి బ్రహ్మాది దేవతలు చేతులు జోడించి స్తుతించారు. సంతృప్తిచెందిన వరాహ భగవానుడు తన గిట్టలతో జలాన్ని అడ్డుకొని దానిపైన భూమిని స్థాపించాడు. ఈ సమస్త భూమండలాన్ని జలప్రళయం నుండి కాపాడిన వరాహ భగవానుడికి విశ్వమంతా విశ్వాసంతో ఉండటం, పూజించటం తగిన సంస్కారం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: