telugudanam.com

      telugudanam.com

   

చక్కెర వ్యాధి - చేదు నిజాలు

ఎబెర్స్ పేపిరస్ (ఈజిప్టు, 1500 బి.సి.)లో చక్కెర వ్యాధి అనే మాట వాడబడింది. మన దేశపు సుప్రసిద్ధ వైద్యుడు శుశ్రుతుడు క్రీ.పూ. 400లో ఈ వ్యాధిని తేనె మూత్రంగా అభివర్ణించాడు. క్రీ.శ. ఆరంభమైన మొదటి శతాభ్దంలోనే ఈ వ్యాధి రోం, చైనా, జపాను భాషా గ్రంధాలలో నమోదై ఉంది. డయాబెటిస్ అన్న పదాన్ని తొలుత గ్రీకులు వాడారు. ఈ పదం నీళ్ళ ద్వారా విసర్జనం అన్న అర్ధాన్ని ఇస్తుంది. మూత్రాన్ని వేడిచేసి పరీక్షించి, ఆవిరి చేసి డాక్టర్ విల్లిస్ 1674లో అందులో జిగటలాంటి పదార్ధం ఉందని కనుగొన్నాడు. ఆ ఉన్న వస్తువు చక్కెరే. కానీ అప్పట్లో ఇంగ్లాండు వారికి చక్కెర విషయం తెలియదు. వారికి తెలిసిన తియ్యటి రుచిగల పదార్ధం తేనె మాత్రమే. ఆ కారణంగానే తేనె అనే అర్ధాన్నిచ్చే మెల్ అన్నమాట వాడుకలోకి రావడంతో ఈ వ్యాధి డయాబెటిస్ మెల్లిటస్ అని గుర్తించబడింది.


డయాబెటిస్ అంటే ఏమిటి?

ప్రాధమికంగా తినుబండారాలు మూడు రకాల (కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వు) పదార్ధాలతో ముడిపడివుంటాయి. అన్ని రకాల పిండి పదార్ధాలకు గ్లూకోజ్ ముఖ్య ఆధారం. ఇది మనకు గంజితో నిండిన (గోధుమ, ఉర్లగడ్డ, బియ్యం) అన్ని పదార్ధాల ద్వారా లభిస్తుంది. గ్లూకోజ్‌ను వాడే విధానం, నిల్వ ఉంచే విధానం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధానంలో ముఖ్యమైన విషయం హార్మోన్ ఇన్సులిన్. మన శరీర రక్తంలో పెరిగే చక్కెర స్థాయికి లేదా మనం సాధారణంగా భుజించే ఆహారానికి సరిపోయేలా పాంక్రియాస్ గ్రంధులలో ఇన్సులిన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ పరిమాణం తగ్గినప్పుడు ఎలా గ్లూకోజ్ రక్తంలో కలిసిపోయి చక్కెర స్థాయిని పెంచుతుందన్న విషయాన్ని మనం అర్ధం చేసుకోగలం. రక్తంలోని గ్లూకోజ్ స్థాయి ఒక నిర్ణీత స్థాయి (సాధారణంగా 180 మిల్లీగ్రాముల శాతం కంటే ఎక్కువ) కంటే ఎక్కువైనప్పుడు మూత్ర పిండం ఈ స్థాయిని రక్తంలో ఉంచుకోలేకపోతుంది. దాంతో అది రక్తం నుండి మూత్రంలోకి ఒలుకుతుంది. ఈ విధంగా మూత్రంలో చక్కెర కలిసిపోతుంది.


వ్యాధి రకాలు:

చిన్న వయసులోనే వచ్చే రకం : ఈ రకం వ్యాధి 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వస్తుంది. కారణం వారి పాంక్రియాస్ కావలసినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. ఈ కోవకు చెందిన వారికి ఇన్సులిన్ చికిత్స ఇవ్వవలసివుంటుంది. పక్వత చెందిన వయసులో వచ్చే రకం : ఈ రకం చక్కెర వ్యాధి సాధారణంగా 40 సంవత్సరాల వయసుకు మించిన వారిలో కనబడుతుంది. కావలసినంత ఇన్సులిన్ లేకపోవడమో లేక ఎక్కువ మోతాదులో ఉండడమో లేదా రెండిటి కలయిక దీనికి కారణం అవుతుంది. ఇటువంటి రకాలను సాధారణంగా ఇన్సులిన్ వాడకుండానే సరిచేయవచ్చును.


చక్కెర వ్యాధి వంశపారంపర్యమా?

చాలావరకు ఇదే కారణమవుతుంది. పెద్ద వయసులో ఈ వ్యాధి సోకిన వారి పిల్లలలో ఒకరు పెద్ద వయసులో ఈ వ్యాధికి గురయ్యే అవకాశం 40 శాతం దాకా ఉంది. కానీ చిన్న వయసులో ఈ వ్యాధికి వారి సంతానంలో ఒకరు గురయ్యే అవకాశం ఒక శాతం మాత్రమే ఉంటుంది.


ఈ వ్యాధికి పత్యం అవసరమా?

నిస్సందేహంగా పత్యం అవసరమే


నివారించాలంటే:


ఫుట్ అల్సర్లు:

మధుమేహ రోగుల్లో సాధారణంగా పాదాల సమస్యలు కనిపిస్తాయి. షుగర్ వల్ల రక్త ప్రసరణ, పాదాల్లో నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల కణజాలం దెబ్బతిని, నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల పాదాల్లో స్కిన్ ఇంఫెక్షన్ త్వరగా వస్తుంది. దీన్నే సెల్యులైటిస్ అంటారు. చిన్న చిన్న దెబ్బలు సైతం ఇంఫెక్షన్‌కు దారితీస్తాయి. డయాబెటిస్ పేషంట్లలో చాలామందికి పాదాలు పొడిబారిపోయి, పగుళ్ళిస్తాయి. స్నానం చేసిన తరువాత పాదాలను తడి లేకుండా శుభ్రంగా తుడిచి, మాయిస్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. పాదాలను నీళ్ళలో నాననివ్వకూడదు. షుగర్ వల్ల పాదాల్లో నరాలు దెబ్బతింటాయి. దీని వలన పాదాలలో నొప్పి తెలియదు. వేడైనా, అతి చల్లదనమైనా తెలియకుండా పోతుంది. ఫలితంగా పాదాలు, కాలివేళ్ళలో అవకరం ఏర్పడవచ్చు. ఇలాంటివారు మామూలు చెప్పులు ధరించడంకన్నా ప్రత్యేకమైన షూస్ ధరించడం మంచిది.


పాదాలను ఇలా కాపాడుకోవాలి :


ఈ వ్యాధికి గురై ఇన్సులిన్ చికిత్స తీసుకుంటున్నవారు మధుమేహాన్ని సూచించే బిళ్ళను లేదా గుర్తింపు కార్డును లేదా ఏదైనా లోహంతో తయారుచేయబడిన కడియాన్ని వేసుకోవాలి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి బాగా పడిపోయినప్పుడో లేదా ప్రమాదానికి గురై స్పృహ తప్పిపోయినప్పుడో చాలా ఉపయోగాలున్నాయి.


వివాహం:

చక్కెర వ్యాధి గురైన వారికి వివాహ వ్యవస్థ చాలా ఉత్తమమైనది. వివాహం క్రమశిక్షణాయుతమైన గృహ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు, వారికి కావలసిన మనస్తత్వ ప్రధానమైన శారీరక బలం భార్య/భర్త ద్వారా లభిస్తుంది. సర్వసాధారణమైన దాంపత్య జీవితాన్ని వీరు అనుభవించగలరు. చాలా అరుదుగా ఈ వ్యాధి వల్ల పురుష జననాంగాన్ని కలిపే నరం కారణంగా అతడు దాంపత్య జీవితాన్ని కోల్పోతాడు. ఈ వ్యాధితో బాధపడేవారు చురుకైన జీవితాన్ని అనుభవించగలరు. కావలసిందల్లా జీవిత విధానంలో కొన్ని మార్పులను గ్రహించగలగడమే. ముఖ్యంగా నడక, ప్రాణాయామం చక్కెరను అద్భుతంగా నియంత్రిస్తాయి కాబట్టి క్రమంతప్పకుండా ఈ రెండు వ్యాయామాలు చేయడం డయాబెటిక్ పేషెంట్‌కి అవసరం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: