telugudanam.com

      telugudanam.com

   

మంచి ఆహారం

శాకాహారంప్రాచీన కాలంలో మానవులు ఆచార వ్యవహారాలతోపాటు ఆహార నియమాలకూ అధిక ప్రాధాన్యమిచ్చేవారు. కాబట్టే వారు జీవించినంత కాలం ఎంతో ఉల్లాసంగా జీవించేవారు. వృద్ధాప్యం వారిని ఎంతమాత్రమూ బాధించేది కాదు. పైగా వృద్ధాప్యంలోనూ ఎంతో ఉత్సాహంగా పని చేసేవారు. ఆరోగ్యకరమైన పర్యావరణం అందుకు కొంత దోహదపడితే ఆహారం తీసుకునే విషయంలో వారు చూపించిన శ్రద్ధ కూడా వారికి ఎంతగానో దోహదపడింది. సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో కూడా వారు వారు ఏ ఆహారం దేహానికి ఎంతగా ఉపయోగపడుతుందో గ్రహించడం ఓ అద్భుతం. ఇది వారి మానసిక పరిణితికి అర్ధంపట్టడమే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తుంది. ఆరోగ్యంపట్ల ప్రత్యే శ్రద్ధ వహిస్తూ తేలిగ్గా ఉండే ఆహారం తీసుకునేవారు. తేలికపాటి ఆహారమంటే శాకాహారమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. శాకాహారానికి అత్యంత ప్రాధాన్యమివ్వడమే కాక వాటితో ఔషధాలు కూడా తయారుచేసేవారు. కాలంతోపాటు మానవుడి ప్రవృత్తిలో కూడా వస్తున్న మార్పులు వారు తీసుకునే ఆహారంలో కూడా నేడు కనిపిస్తోంది.

శాకాహారం కంటే కూడా మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అధిక శక్తి కలుగుతుందనే భావన ఏర్పడ్డంతో నేటి తరం మాంసాహారంపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కాని ఇది వాస్తవం కాదు. వైజ్ఞానికంగా కూడా మంచిది కాదని ఏనాడో ఋజువయ్యింది కూడా. ఒక జంతువు మరణించిన వెంటనే దానిలో శైధిల్యం ప్రారంభమవుతుంది. అప్పటికప్పుడే సూక్ష్మజీవులు దాని మీద ప్రభావం చూపడం, దాంతో ఆ మాంసం అతి శీఘ్రంగా కుళ్ళిపోవడం జరుగుతుంది. జంతువు చనిపోయిన 15 నిముషాల్లోనే సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో పుట్టుకొస్తాయి. ఆ ఆహారాన్ని భుజిస్తే అది ఆరోగ్యం మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఇట్టే అర్ధమవుతుంది.

మాంసాహారం తరచుగా ఉత్పత్తి చేసే యూరిక్ యాసిడ్‌కు సులభంగా జీర్ణమయ్యే లక్షణం లేకపోవడంతో ఇది ఎంతో అపాయకారంగా పరిణమిస్తుంది. మాంసాహారంలో శాకాహారంకంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ దానిలో ఉన్న ఇతర లోఅపాల వలన ప్రోటీన్లు తీసుకోవడం ఒక్కటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. పప్పు దినుసులు మాత్రమే అధిక పోషణ కలిగిస్తాయి. పప్పులలో ఉండే 60 శాతం కార్బోహైడ్రేట్లు మరియు 5 శాతం క్రొవ్వు, 2 శాతం ఖనిజ లవణాలు మానవ శరీర పోషణకు సమతూకంగా ఉండడం అందరూ తెలుసుకోవలసిన విషయం.

శాకాహారంఒక గ్రుడ్డు కంటే కూడా ఐదారు ఖర్జూరపు పళ్ళు లేక 50 గ్రాముల బెల్లం ఎక్కువ శక్తిని ఇస్తాయి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. ఆ నానుడి వేరే సందర్భంలో ప్రయోగించబడినా పెరట్లో అతి తేలిగ్గా పెరిగే తోటకూర, గోంగూర, బచ్చలి వంతి ఆకు కూరలు, టొమటో, చిక్కుళ్ళు, మునగ వంటివి అత్యుత్తమ పోషక విలువలున్న శాకాహారం. పిల్లాణ్ణి చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు పెరట్లో పెంచగలిగే శకహారం ఉండగా పోషకాహారం కోసమంటూ మాంసాహారం కోసం ప్రాకులాడడం వివేకవంతుల లక్షణం కాదు. అందుచేత నేడే శాకాహారంపట్ల దృష్టి సారించి దృష్టి దోషాన్ని రాకుండా కాపాడే శాకాహారాన్ని తీసుకోవడం మంచిది. దృష్టి కోసమే కాకుండా శరీరానికి పుష్టిని సమృద్ధిగా కలగజేసే శాకాహారమే ఉత్తమం అని గ్రహిస్తే ఒంటికీ, దేశానికీ మంచిది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: