telugudanam.com

      telugudanam.com

   

ఆరోగ్యానికి మేలుచేసే బాక్టీరియా

ప్రోబయోటిక్స్ అంటే

మనిషి ఆరోగ్యాన్నిచ్చే సజీవ బాక్టీరియాలో సాక్రోమైటిక్స్ అని ఎఫ్ఎఒ నిర్వచనం చెప్పింది. ఈ కోవకు చెందిన బాక్టీరియాలో సాక్రోమైసస్ బౌలార్డ్, లాక్టో బాసిల్లన్ లేదా బైఫిడో బాక్టీరియం వగైరాలున్నాయి.


వీటి ఉపయోగం


ప్రొబయోటిక్స్ లభించేవి.

మనశరీరంలో ప్రతి గ్రాము పెద్ద పేగుకి 10 బాక్టీరియా ఉంటుంది. అంటే మన శరీరంలో సహజంగానే బాక్టీరియా ఉంటుందన్నమాట. అయితే కాలుష్యం, ఆహరలోపం, యాంటిబయాటిక్‌లు వాడడం వల్ల బాక్టీరియా నశించిపోతుంటుంది. దీనిని మనం వృద్దిచేసుకోవాలంటే ప్రతిరోజూ పెరుగు తినాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండు వంటి ఆహరం ప్రొబయోటిక్‌ని వృద్ది చేస్తుంది. గోళీలు, మాత్రలు, పొడి రూపంలో కూడా ప్రొబయోటిక్ బాక్టీరియా లభిస్తుంది. డాక్టర్‌ని సంప్రదించి మోతాదుని సరిచేసుకుంటూ ఉండాలి. ఇడ్లీ, దోశె, బ్రెడ్, థోక్లా వంటి పులియబెట్టిన ఉత్పత్తులలో కూడా ప్రొబయోటిక్ యాక్టివిటీ ఉంటుంది.


తినే ఆహరంలో

బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశె, ఈస్ట్ కలిపిన చపాతి,పెరుగు, బ్రెడ్ వంటి పులియబెట్టిన ఆహరం తినాలి. మద్యహ్నం భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోవడం తప్పనిసరి. రెండు వెల్లుల్లి రెబ్బలు కలుపుకుంటే మరీ మంచిది. రాత్రి భోజనంలో రెండు చపాతీలను ఒక కప్పు రైతాతో తీసుకోవాలి. రైతాలో ఉల్లిపాయ ముక్కలు తప్పనిసరి. గోధుమ పిండిలో అరటి పండి కలిపి శ్రీఖండ్‌లా తినొచ్చు. మిల్క్ షేక్‌లో అరటిపండు కలిపి తినాలి. దీనిలో కొద్దిగా పెరుగు కలిపితే మరీ మంచిది. అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్న వారు, వయసు మీద పడిన వారు ఇలాంటి ఆహరం తీసుకోవడం మంచిది. ఇన్ ఫెక్షన్లు సోకకుండా లేదా ఇన్ ఫెక్షన్లు రాకుండా ప్రొబయోటిక్స్ వాడితే సహజ ఆరోగ్యం సొంతమవుతుంది.


వడ్డించేటప్పుడు, తయారుచేసేటప్పుడు


మనం తీసుకునే ఆహారంలో ఆహార పోషకాలు నష్టపోకుండా వంట ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం

మనదేశంలో రెండు రకాల పద్దతుల్లో వంట చేస్తాము. నీటిని ఉపయోగించే తడి పద్దతి మొదటిది. ఉడకబెట్టడం, నీటి ఆవిరితో ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించడం దీనిలో ప్రధాన అంశం. తడిలేకుండా అధిక ఉష్ణోగ్రతలో వేయించడం (వేపుడూ), మాడ్చడం, బేకింగ్ వంటివి చేయడం రెండవ పద్దతి. వంటలో పోషక తత్వాలు నష్టం చెందటమనేది ఉష్ణోగ్రత, వంటకొనసాగే సమయం, వంటకు వాడే పదార్ధాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణమైన వంట విధానాలతో మాంసాహారాల్లోని ప్రొటీన్లుగాని (మాంసకృత్తులు), గింజధాన్యంలోని కార్బోహైడ్రేట్లు గాని (పిండి పదార్ధాలు), నూనెల్లోని ఫ్యాట్స్‌గాని (కొవ్వు పదార్ధాలు) ఏమంత ఎక్కువగా నష్టం చెందవు. అయితే కూరగాయల్లోని మాంసకృత్తులు కాయగూరలను ఉప్పు చేర్చిన నీళ్ళలో ఉడికించి ఆ నీళ్ళను పారబోయటం వల్ల సోడియం, పొటాషియం, కాల్షియం, వంటి పదార్ధాలు శరీరానికి అందకుండా పోతాయి. దీనికి పరిష్కారంగా కాయగూరలను ఉడికించేటప్పుడు తక్కువ నీళ్ళను వాడటంగాని లేదా ఉడికించడానికి ఉపయోగించిన నీళ్ళను పారబోయకుండా సూప్స్, గ్రేవీలు వంటివి తయారుచేయడానికి గాని ఉపయోగించాలి.

దుంపకూరలను వండేటప్పుడు వాటిలోని పోషకతత్వాలు నష్టపోయే అవకాశం తక్కువ. వాటిపైనుండే తోలు దుంపల లోపలికి పోషతత్వాలను నీటిలో కలవనివ్వకుండా నిరోధిస్తుంది. దుంపలను వేయించడం వల్ల కూడా పోషకతత్వాలు అంతగా నాశనం చెందవు. కాబట్టి దుంపకూరలను వాటిపై నుండే తోలుతోనూ, చెక్కుతోనూ కలిపి వండటం, ఉడికించటం, వేయించటం చేయాలి. వీటిని తోలు తొలగించి ఉడికించకూడదు. వండబోయే ముందు కాయగూరలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వాటిని ఎక్కువ సేపు గాలి తగిలేలా వదిలేయటం వల్ల విటమిన్లు నష్టం చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సి విటమిన్ గాలి తగలటం వల్ల హరించుకుపోతుంది. కాబట్టి కాయగూరలను వంటచేయబోయే ముందు మాత్రమే తరిగి వెంటనే మరిగే నీళ్ళలో కొద్దిగా ఉడికిన వెంటనే దించేయాలి. కాయగూరలను తరిగేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా మాత్రమే తరగాలని గుర్తుంచుకోవాలి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో ఆవిరిమీద ఉడికించటం వల్ల పోషకతత్వాలు ఆవిరైపోకుండా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ కాయ గూరలను ఆవిరిమీదే ఉడికించాలి.

బియ్యాన్ని వండేటప్పుడు పోషకతత్వాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఉదాహరణకు విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మ పదార్ధాలు బియ్యాన్ని ఉడికించేటప్పుడు ఎక్కువగా నష్టం చెందుతుంది. అసలే బియ్యంలో పోషకతత్వాలు తక్కువగా ఉంటాయి. వండేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి పూర్తిగా పోతాయి. వరిబియ్యం మన ప్రధాన ఆహారం కనుక బియ్యంలోని పోషకతత్వాలను వంట ప్రక్రియలో నష్టపోకుండా కాపాడటం చాలా ముఖ్యం. బియ్యాన్ని ఉడికించబోయే ముందు నీళ్ళతో కడగటం ఆనవాయితీ. అయితే ఇలా కడిగేటప్పుడూ అనేక రకాలైన విటమిన్లు, ఇతరపదార్ధాలు నీళ్ళతో సహా పోయే అవకాశం ఉంటుంది. అందుకే బియ్యాన్ని మరీ ఎక్కువ నీళ్ళతో కడగకూడదు. బియ్యాన్ని కడగటం వల్ల థయామిన్, నికోటిన్‌యాసిడ్స్ అనేవి దాదాపు 40 శాతం నష్టం చెందే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత తక్కువ అవసరానికి మించి నీళ్ళను వాడటం, మిగిలిపోయిన నీళ్ళను లేదా గంజిని పంపేయడం వల్ల కూడా పోషకతత్వాలు నష్టం చెందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే, బియ్యాన్ని కడిగేటప్పుడు వెళ్ళిపోయే పోషకతత్వాల నష్టం తక్కువ. అందుకే బియాన్ని తక్కువ నీళ్ళతో కడిగి, బియ్యం ఉడకడానికి అవసరమైనంతమేరా మాత్రమే నీటిని వాడాలి. అన్నాన్ని వండేటప్పుడు గంజిని వార్చటం మంచి పద్దతి కాదు. గంజి మెతుకుల్లో ఇంకిపోయేలా ఇగర్చాలి. మామూలు బియ్యంతో పోలిస్తే ఉప్పుడు బియ్యం (బాయిల్ రైస్) ఆరోగ్యరీత్యా మంచివి. ఉప్పుడు బియ్యం తయారీలో పోషకతత్వాలు బియ్యంగింజల లోనికి ఇంకుతాయి. పైగా, ఈ విధానంలో ఒక జిగురు వంటి పదార్ధం తయారై గింజలమీద రక్షక కవచంలా పనిచేస్తుంది. ఇది పోషకతత్వాలు బయటకు వెళ్ళిపోకుండా కాపాడుతుంది. మామూలు సందర్బాల్లో కోడిగుడ్లను ఉడికించేటప్పుడు వాటి నుండి పెద్దగా పోషకతత్వాలు నష్టం చెందవు. కోడిగుడ్లలో బయోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం. అయితే, కోడిగుడ్లలో ఉండే ఎవిడిన్ అనే మరో పదార్థం దీనిని తటస్థ పరిచి శరీరానికి అందనివ్వకుండా చేస్తుంది. కోడిగుడ్లను ఉడికిస్తే ఈ ఎవిడిన్ నాశనమవుతుంది. దీనితో బయోటిన్ శరీరానికి నిరాటకంగా చేరుతుంది.

కొవ్వు పదార్థాలను పదే పదే వేడి చేయడం వల్ల విషతుల్యంగా మారే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా వేడి చేయటం వల్ల (డీప్ ప్రైయింగ్) పెరాక్సిడేషన్, ర్యాన్సిడిటి వంటి చర్యలు జరిగి ఇతర విషతుల్యంగా మారుతుంది. అందుకే నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలను సాధ్యమైనంత తక్కువ మొత్తాల్లో వాడాలి. అలాగే, ఒకసారి వాడిన నూనెలను వాడకూడదు. మాంసకృత్తులను అందకుండా పొయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటిని పిండిపదార్థాల సమక్షంలో అధికంగా వేడిచేస్తే కార్బోహైడ్రేట్ తో కలసి పోయి లైసిన్ అనే ఎమైనోయాసిడ్ కార్బోహైడ్రేట్‌తో కలసి పోయి లైసిన్‌ను శరీరానికి అందనివ్వకుండా చేస్తుంది. కొంతమంది పాలను బాగా వేడిచేస్తుంటారు. ఇదీ అంత మంచిది కాదు. దీనివల్ల పాల లోని మాంసకృత్తుల స్వభావం దెబ్బతింటుంది. అలాగే, పాల పదార్థాలను ఎక్కువసేపు నిల్వ చేయడం కూడా మంచిది కాదు. పాడైపోవటం మాట అలా ఉంచితే, పాలను వేడిచేయటం, నిల్వచేయటం వల్ల రంగు మారి గోధుమరంగులో కనిపించే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని వండి తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఉదాహరణకు ఉడికించడం వల్ల ఆహారం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రుచి, రంగు, వాసనల వంటివి పెంపొదుతాయి. ఉడికించటం వల్ల ఆహారంలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఆహారపదార్ధాలు తేలికగా అరుగుతాయి. ముఖ్యంగా ఆహారపదార్ధాలను వేడిచేయటం వల్ల వటిలోనొఇ స్టార్చ్ బాగా జీర్ణం అవుతుంది. ఉడికించేటప్పుడూ స్టార్చ్ ఉబ్బుతుంది. ఆహారపదార్ధాలలోని కాణాల గోడలు చిద్రమై, అన్నరసాలలోని ఎంజైములు తేలికగా లోపలికి చొచ్చుకు వెళ్ళి స్టార్చ్‌ని జీర్ణం చేస్తాయి.

కొన్నిరకాల చిక్కుళ్ళకు చెందిన కూరగాయల్లో ట్రిప్సిన్‌ను నిరోధించే ఇన్‌హిబిటర్స్ ఉంతాయి. ముఖ్యంగా సోయా చికుళ్ళలో ట్రిప్సిన్ ఇన్‌హిబిటర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల చిక్కుళ్ళలో ఉండే ప్రొటీన్లు శరీరానికి ఉపయోగపడకుండా పోతాయి. అంటే, ప్రొటీన్ల అరుగుదల తగ్గిపోతుందన్నమాట. చిక్కుళ్ళను వేడిచేయటం వల్ల ట్రిప్సిన్ ఇన్‌హిబిటర్స్ నాశనమవుతాయి. ఫలితంగా ప్రొటీన్ హెచ్చుగా శరీరానికి లభ్యమవుతుంది. బాతుగుడ్లలో కూడా ఇదే మాదిరి ట్రిప్సిన్ ఇన్‌హిబిటర్స్ ఉంటాయి. ఆహారాలను వేడిచేయటం, ఉడికించటం, ప్రాసెస్ చేయటం ఇవన్నీ మనం నాగరికతతో పాటు నేర్చుకున్న పద్దతులు. వీటిలో ఉపయోగాలూ ఉన్నాయి. సరైన పద్దతులను తెలుసుకొని ఉపయోగిస్తే ఈ పద్దతుల పూర్తి శక్తిని ఉపయోగించుకోవచ్చు.


హిమోగ్లోబిన్ పెరగాలంటే!

హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.

హిమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి ప్రధాన కారణాలు

ఆహార లోపం, ఆహారంలోని పోషకాల్ని శరీరం శోషించుకోలేకపోవడం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, పొట్టలో పురుగులు ఊండడం, ఎముకల మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు :


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: