telugudanam.com

      telugudanam.com

   

అమ్మ లాంటి నిమ్మ

లభించే విటమిన్లు

కాల్షియం - 10.7 మి.గ్రా.
పొటాషియం - 16.3 మి.గ్రా.
సోడియం - 6.5 మి.గ్రా.
మెగ్నీషియం - 11.6 మి.గ్రా.
భాస్వరం - 20.7 మి.గ్రా
రాగి - 0.26 మి.గ్రా.
విటమిన్ - సి - 63 మి.గ్రా.
నియోసిన్ - 0.2 మి.గ్రా.
క్లోరిన్ - 5.1 మి.గ్రా.
ఫోలిక్‌యాసిడ్ - 7 మి.గ్రా.
పిండిపదార్ధాలు - 9.మి.గ్రా.
మాంసకృత్తులు - 1.5 మి.గ్రా.

పై వాటితో అతి స్వల్పంగా విటమిన్-ఎ, విటమిన్-బి, బి-6 వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. 100 గ్రాముల నిమ్మపండులో 40 కాలరీల శక్తి లభిస్తుంది. ఇతర ఆహార పదార్ధాలతో పోలిస్తే నిమ్మలోని పోషకవిలువలు అధికం. ఈ పోషక విలువలన్నీ ప్రతి మనిషికీ అవసరమైనవే! మెదడు చురుగా పని చేయలంటే పొటాషియం, దంతాలు, ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి నిమ్మ ఎంతగానో సహకరిస్తుంది.


నిమ్మకాయ రసం

"నిమ్మ చేయు మేలు అమ్మ కూడా చేయదు" అన్నది ఒక తెలుగు లోకోక్తి. ఈ ఉక్తి ద్వారా నిమ్మకాయలోని గొప్పదనం తెలుస్తున్నది. అమ్మ ప్రేమ-మమత-వాత్సల్యాలను ఇవ్వగలదే కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కదా! నిమ్మ ఆ కొరతను తీరుస్తుందని వైద్యుల అభిప్రాయం. నిమ్మరసం వల్ల అనేక వ్యాధులు నివారింపబడతాయి.

ఇన్ని సుగుణాలున్నవి కాబట్టి నిమ్మచెట్టును ప్రతి ఇంటిలోనూ పెంచుకోవటం మంచిది. నిమ్మచెట్టును పెంచి, దాని ద్వారా లాభం పొందాలి.


నిమ్మరసాన్ని తయారుచేయుట

నిమ్మరసం అంటే చక్కని చిక్కని రసం కాదు. ఆ రసం చాలా తీక్షణత గల్గి ఉంటుంది. బండమీద పడితే, బండ తెల్లగా పొంగటం అందరికీ తెలుసు. అలాంటి నిమ్మరసం నేరుగా స్వీకరిస్తే, మృదువైన జీర్ణాశయం రంధ్రాలు పడి, చెడిపోతుంది. కాబట్టి నిమ్మరసాన్ని అలాగే పుచ్చుకోకూడదు. ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ కోయాలి. కాయ పెద్దదయితే ఒక ముక్కను ఆ గ్లాసు నీటిలో పిండాలి. కాయ చిన్నగా ఉంటే రెండు ముక్కలను పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం తయారవుతుంది. ఈ నిమ్మరసానికి రెండు చెంచాల స్వచ్చమైన తేనెను కలిపితే బాగుంటుంది. తేనె లేకపోతే, కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. లేదా ఏమీ వేసుకోకుండా అలాగే త్రాగవచ్చు. ఇలా తయారు చేసిన నిమ్మరసాన్ని రోగికి ఉందయం 7 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అవసరమైతే రాత్రి పడుకునే ముందు ఇవ్వాలి. ఈ నిమ్మరసం సేవించే కాలంలో రోగి ఉపవాసం చేస్తూ ఉండాలి. "లంఖనం పరమ ఔషధం" అన్నారు కదా! ఉపవాసకాలంలో జీర్ణాశయానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని రోగ పదార్ధాలు సులువుగా మల-మూత్ర-స్వేధాల ద్వారా విసర్జింపబడుతుంటాయి. మల దోషాలు నివారింపబడతాయి. మూత్రదోషాలు తగ్గుతాయి. శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. కొంతకాలం నిమ్మరసం సేవించటంతో, తిరిగి నిజమైన ఆకలి వేస్త్తుంది. అప్పుడు ఉపవాసం చాలించవచ్చు. రోగికి ఆరోగ్యం చేకూరి, మామూలు మనిషి ఔతాడు. నిమ్మరసం ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి నిమ్మరసాన్ని సేవిస్తూ, దాని ప్రయోజనాలను పొందుతూ ఉండాలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: