telugudanam.com

      telugudanam.com

   

దంత రక్షణే దేహ రక్షణ

దంత రక్షణే దేహ రక్షణ సాధారణంగా ప్రతి మానవుడు తన ఆరోగ్యంపట్ల కాస్తో కూస్తో శ్రద్ధ వహిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సౌందర్య పోషణకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. శరీరంలోని ప్రతి భాగంపట్ల ఎంతో జాగ్రత్తలుపడుతుంటాడు. శిరోజాలకూ అంతే ప్రాధాన్యమిస్తాడు. అయితే మన దేహ అంతర్భాగాలు ఆరోగ్యం ఉండాలంటే వాటికి మించిన పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన దంతాలపట్ల మాత్రం పెద్దగా శ్రద్ధ చూపడు. ఇది దాదాపు ప్రతి మనవుడి నైజం. దంత పరిరక్షణ లేకపోతే జీర్ణవ్యవస్థ పరిశుభ్రంగా ఉండదన్న కనీస జ్ఞాన్ని విస్మరిస్తుంటాడు. దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాడు. గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలని తెలిపేందుకే ఈ వ్యాసం.

దంత రక్షణే దేహ రక్షణదంతాలు ఆరోగ్యంగా ఉండడాఇకి నిరోధక చర్యలు తీసుకోవడం చిగుళ్ళలో కాల్షియం చేరే సమయం నుంచే ఆరంభం కావాలి. పాల పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు గర్భంలో ఉన్నప్పుడే ఆరంభం అవుతుంది. శాశ్వతమైన పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు జన్మించిన క్షణం నుంచి మొదలవుతుంది. అందుచేత పుట్టబోయే శిశువు దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి గర్భిణీ దశలో ఎక్కువ మాంసకృత్తులు, కాల్షియం, భాస్వరం, విటమిన్‌లు సరఫరా అయ్యేట్టు చూడాలి. అప్పుడే గర్భంలోని శిశువుకు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన పోషక పదార్ధాలన్నీ సక్రమంగా లభించగలవు. సాధారణంగా గర్భంలోని శిశువు తల్లి రక్తం నుంచి పోషక పదార్ధాలను గ్రహించే కాలంలోనే పాలపళ్ళు ఏర్పడుతాయి. తల్లికి పోషణ సరిగా జరగకపోతే, లేదా గర్భవతిగా ఉండగా ఆమెకు తీవ్రమైన సుస్తీ చేస్తే శిశువులో ఎనామిల్ లోపం ఏర్పడుతుంది. శరీరారోగ్యం సక్రమంగా లేకపోతే పళ్ళ నిర్మాణమూ దెబ్బతింటుంది. శిశువు ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే తల్లిపాలు ఇస్తూ ఉండడం చాలా అవసరం. తలి రొమ్ము చీకేటప్పుడు దౌడలకు లభించే వ్యాయామం దౌడలు సక్రమంగా రూపొందేందుకు తోడ్పడుతుంది. దౌడలు, పేలేట్ అడ్డంగా విస్తరించడానికి ఆ విధమైన వ్యాయామం చాలా అవసరం. ముఖ కవళికలు అందంగా రూపొందడానికి కూడా తల్లి రొమ్ము చీకడం తోడ్పడుతుంది. అంతే కాక ఊపిరితిత్తులు బలపడడానికీ దోహడపడుతుంది. శిశుప్రాయంలో వచ్చే చాలా జబ్బులను నిరోధించే రక్షక జీవ కణాలు తల్లి పాల ద్వారానే శిశువుకు లభిస్తాయి.

దంత రక్షణే దేహ రక్షణపాలపళ్ళలో మొదటి రెండు పళ్ళూ సాధారణంగా శిశువుకి 6 నెలల ప్రాయంలో వస్తాయి. 15 నెలల ప్రాయంలో పాల దంతాలూ, ఆ తరువాత కోరపళ్ళూ కనిపిస్తాయి. శాశ్వతమైన పళ్ళు మొలిచే ప్రక్రియ 6వ ఏడు మొదలై 18వ ఏడు వచ్చేదాకా కొనసాగుతుంది. చిన్నతనం నుంచే శిశువు పోషణ లరిగా జరగకపోతే మొట్టమొదట వచ్చే ఆ శాశ్వత దంతాలలోనే దంత క్షయం చోటు చేసుకుంటుంది. పాల పళ్ళు ఊడిపోవడం ఆరున్నర ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు వచ్చే లోగా ఆరంభం అవుతుంది. 18వ ఏడు తరువాతనే విజ్ఞాన దంతాలు వస్తాయి. అప్పటికిగానీ 32 పళ్ళూ పూర్తిగా ఏర్పడడం జరగదు.

దంత వ్యాధులలో తరచుగా కనిపించేవి దంత క్షయ వ్యాధులూ, చిగుళ్ళ వ్యాధులు. వ్యాధి కలిగించే సూక్ష్మ క్రిములు చేరడంవలన దంత క్షయం వస్తుంది. చిగుళ్ళ వ్యాధుల వలన దంతాలకు ఆధారభూతాలైన భాగాలు దెబ్బతింటాయి. పళ్ళలో ఏర్పడిన పగుళ్ళలోనూ,గుంటలలోనూ, పళ్ళ సందుల్లోనూ లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరుతాయి. ఆ సూక్ష్మ క్రిములను ప్లేక్స్ అంటారు. ప్రధానంగా సూక్ష్మ క్రిములు, ఆ క్రిములు ఉత్పత్తి చేస్దే పదార్ధాలూ, పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాల అవశేషాలు, లాలాజలంలోని నత్రజనితో కూడిన జిగురు పదార్ధం కలసి ఈ ప్లేక్స్ ఏర్పడుతాయి. సూక్షం క్రిములు పళ్ళలో ఇరుక్కున్న పిండిపదార్ధాలలో ప్రవేశించి వాటిని కుళ్ళబెట్టి పళ్ళ మీద ఎనామిల్‌ను హరించడానికి తగినంత లాక్టిక్ యాసిడ్‌ను తయారుచేస్తాయి. జరిగిన ప్రయోగాలన్నిటి వల్లా డెంటల్ ప్లేక్‌ళే దంత క్షయ వ్యాధికి ప్రధాన హేతువని స్పష్టంగా నిరూపించబడింది.

దంత రక్షణే దేహ రక్షణఆహారంలో తీసుకునే పిండిపదార్ధాల తాలూకు పరిమాణం కాక, వాటి స్వభావమే ఈ వ్యాధిని కలిగించడంలో ప్రాముఖ్యం వహిస్తుంది. భోజనానికీ, భోజనానికీ మధ్య సూక్రోజ్ ఉన్న చూయింగ్ గం చప్పరించే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఒక్కటే ఉంటే చాలదు. మ్రింగే ముందు బాగా నమలవలసిన అవసరాన్ని కలిగించే పీచు పదార్ధం కూడా ఆహారంలో ఎక్కువగా ఉండాలి. పచ్చి కేరట్ దుంపలను నమిలే అలవాటు వల్ల దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.రోజూ రెండుసార్లు పళ్ళను విధిగా శుభ్రపరుచుకునే అలవాటు చేసుకోవాలి. అందుకు ఫ్లోరైడ్ కలసిన టూత్ పేస్ట్ వాడవచ్చు. పిల్లలకు రోజుకు కనీసం రెండు కప్పుల పాలు ఇవ్వాలి. పాల నుంచి వచ్చే పెరుగు, జున్ను కూడా మంచివే. 10 లక్షల భాగాలకు 2 భాగాల చొప్పున ఫ్లోరైడ్ చేర్చిన మంచి నీరు త్రాగడం దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. చిన్న పిల్లలను అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించడం మంచిది. పెద్దలూ జాగ్రత్త పడడం అవసరం. లేదంటే పిప్పిపళ్ళ రూపంలో దంత క్షయం జరిగి అది ప్రాణాంతకం కూడా కావచ్చును. పాల పళ్ళ వయసు నుంచి పండు వయసు వరకు అత్యంత జాగ్రత్తగా చూసుకోవలసిన దంతాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం తగదు.


దంత సంరక్షణకు కొన్ని సూత్రాలు :

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: