telugudanam.com

      telugudanam.com

   

సామర్ధ్యాన్ని పెంచే సరైన ఆహారం

సరైన ఆహారం జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వల్ల గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ రోజుల్లో వంధ్యత్వ సమస్యలు తలెత్తుతున్నాయి.ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత, అండం విడుదలకు సంధించిన సమస్యలు,శరీర బరువులో తేడాలు, అధిక శారీరక శ్రమ, ఒత్తిడి, ధైరాయిడ్ వ్యాధులు సంతానలేమికి దారి తీస్తున్నాయి. మగవాళ్లలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం, ప్రత్యుత్పతి గ్రంధుల్లో సమస్యలు ఉండడం, వంధ్యత్వం వల్ల రక్తప్రసరణ అవయవాలకి సరిగ్గా చేరకపోవడం వంటి కారణాలు సంతానలేమికి గురిచేస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యానికి సమతులాహారం మూలాధారమనేది తెలిసిన విషయమే.వంధ్యత్వ నివారణకు తీసుకోవాల్సిన ఆహారం ఇది...సంతానలేమి సమస్య ఉన్న వాళ్లు ఫోలిక్ ఆమ్లం, విటమిన్-ఇ,బి12, విటమిన్-సి, సెలీనియం, ఐరన్, జింక్, లైకోపిన్ వంటి పోషకాలను తీసుకోవాలి. ఆకుకూరలు, బీన్స్, అరటిపండ్లు, గుడ్డుసొన, నట్స్‌లో ఫోలిక్ ఆమ్లం మెండుగా ఉంటుంది.

బి12 విటమిన్ కూడ వంధ్యత్వాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బి12, ఫోలిక్ యాసిడ్లు, ఐరన్‌తో కలిసి సంతాన సామర్ధ్యాన్ని పెంచుతాయి.ఇవి తగినంత ఉంటే మగవారిలో శుక్రకణాల సంఖ్య, వాటి చలనం పెరుగుతాయి. ఆడవాళ్లలో బి12, ఫోలిక్ఆమ్లం, అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తం బాగా పడుతుంది. సంతానలేమి దూరమవుతుంది. ఆడాళ్లలో రుతుస్రావానికి సంబంధించిన సమస్య కూడ వీటివల్ల తగ్గుతుంది. అయితే బి12ని శోషించుకునే శక్తిని పొట్ట కలిగి ఉండాలి. ఈ శక్తి తగ్గితే బి12 ఉన్న ఆహారం తీసుకున్నా శరీరానికి పట్టదు. అందుకే పొట్టకు సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి. కాలేయం, గుడ్లు, చేప, చీజ్, సోయా ఉత్పత్తులు, స్పైరులినాల్లో బి12 లభిస్తుంది. ఐరన్ కోసం కర్జూరాలు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు తినాలి. వీటితోపాటు పప్పుదినుసులు, మాంసాహారం కూడా తింటే మంచిది.

సెలినియం, విటమిన్-ఇ లు (ఆక్సిడేటివ్ డామేజ్ జరగకుండా) ప్రత్యుత్పత్తి అవయవాలని రక్షిస్తాయి. ఆడవారిలో గర్భస్రావం కాకుండా నిరోధిస్తాయి.మగవాళ్లలో శుక్రకణాల పనితీరుని మెరుగుపరుస్తాయి.అంటే మొత్తంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందన్నమాట.సెలీనియం గింజధాన్యాల్లో,విత్తనాల్లో,నట్స్లో బాగా దొరుకుతుంది.విటమిన్-ఇ కూడా ఆలివ్ ఆయిల్, నట్స్, గింజల్లో ఉంటుంది. విటమిన్ సి, రక్తప్రసరణని బాగా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.అన్ని పళ్లు, కూరగాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. లైకోపిన్ అనే కెరోటినాయిడ్ కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా మగవారిలో శుక్రకణాల సంఖ్యను, వాటి చలనాన్ని అభివృద్ధి చేస్తుంది. జామ, టొమాటో, పుచ్చకాయల్లో లైకోపిన్ దండిగా ఉంటుంది. కణవిభజనకి, అండం విడుదలకి జింక్ బాగా తోడ్పడుతుంది. మగవాళ్లలో శుక్రకణాల పెరుగుదలకి ఉపయోగపడుతుంది. బీన్స్, నట్స్, చికెన్, చేప మొదలైన వాటిలో జింక్ సమృద్ధిగా ఉంటుంది.


పైన చెప్పిన పోషకాలున్న ఒక ఫ్రూట్ సలాడ్ కింద ఇస్తున్నాము.

కావలసినవి:

ఒక కప్పు పుచ్చకాయ,ఒక జామకాయ, టొమాటో ముక్కలు,నానపెట్టిన బాదం గింజలు ఆరు,నానబెట్టిన వాల్‌నట్ గింజలు ఆరు,ఇంట్లో తయారుచేసుకున్న చీజ్ అర కప్పు లేదా మరగ కాచిన పాలు అరలీటరు, ఒక టీస్పూను ఆలివ్ నూనె, ఆరు కర్జూరాలు.


తయారీ:

పాలు కాగపెట్టేటప్పుడు ఒక చుక్క నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి.విరిగిన పాల ముద్ద,తాజా కర్జూరాలు,ఆలివ్ నూనెలను బాగా కలియపెట్టాలి.ఈ మిశ్రమంలో మిగిలిన పదార్థాలు వేసి ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచాలి.ఈ సలాడ్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.పుష్కలంగా పోషకాలను అందిస్తుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: