telugudanam.com

      telugudanam.com

   

తింటే... మనసు మారిపోతుంది!

ఆహారం శరీరం పనిచేయడానికి అవసరమైన పోషకతత్వాలను అందించడమే కాకుండా ఆకలిని, మూడ్‌ని మార్చగలుగుతుంది. న్యూరోట్రాన్స్ మీటర్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. మూడ్‌ని మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి. తరువాత అధికమొత్తాల్లో విడుదలవుతుంటాయి.


మెదడు చురుకుదనాన్ని పెంచే మాంసకృత్తులు

నమిలేక్రమంలో ఆహారంలోని మాంసకృత్తులు శరీరనిర్మాణానికి అవసరమైన ఎమైనోయాసిడ్ల్ గా విచ్చిన్నమవుతాయి. వీటిద్వారా విడుదలైన న్యూరోట్రాన్స్ మీటర్లు మెదడు చురుకుదనాన్ని, మనసు కేంద్రీకరణ శక్తిని పెంచుతాయి. శారీరక శక్తిని పెంపొందిస్తాయి.


మానసిక ఒత్తిడిని తగ్గించే పిండిపదార్దాలు

పిండిపదార్దాలు వల్ల ఇన్సులిన్ హార్మోను రక్తంలోకి విడుదలవుతుంది. పిండిపదార్దాలు తీసుకోవడం వల్ల మెదడులో తయారైన సెరటోనిన్ నొప్పిని, ఆకలిని తగ్గించి, మనసును స్తిమితంగా ఉంచుతుంది. నిద్రను కలగజేస్తుంది. సెరటోనిన్ తగిన మొత్తాల్లో ఉన్నపుడు ఆకులు నియంత్రణలో ఉండటమే కాకుండా ఆహరం మీద వాంఛలు సమసిపోతాయి. మనసు రిలాక్స్ అవుతుంది. సాధ్యమైనంత వరకు మాంసకృత్తులను, పిండి పదార్దాలను విడివిడిగా తీసుకోవడం మంచిది. ముందుగా ప్రొటిన్లు లేదా మాంసకృత్తులను తిని ఆ తరువాత పిండి పదార్దాలను తింటే మనసు లగ్నం చేయటం ఆ తరువాత విశ్రాంతి తీసుకోవటం తేలికవుతుంది. ఆహారంలోని తినే పదార్ధాల గుణధర్మాలను బట్టి తిరిగి ఎంతసేపటి తర్వాత తినాలి, ఎంత తినాలి వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్ధాలను అధికంగా తిన్నప్పుడు ఆకలి వెంటనే తీరటమే కాకుండా తరువాత తీసుకోబోయో ఆహారం మీద అంతగా మక్కువ ఉండదు.

పిండి పదార్దాలను తీసుకునేటప్పుడు పీచు పదార్ధాలను కలిపితీసుకుంటే మూడ్ బాగుండటమే కాకుండా మానసిక ప్రశాంతత అలవడుతుంది. జల్లించిన పిండితో చేసిన బ్రెడ్, పొట్టుతో సహా ఉడికించిన బంగాళదుంపలు, ముడిబియ్యం, పండ్లు, కాయగూరలు వంటివాటిల్లో పిండిపదార్దాలతోపాటు పీచు పదార్ధాలు కూడా ఉంటాయి. అర్దరాత్రిపూట మెళకువ వచి ఆకలిగా అనిపిస్తే పిండిపదార్దాలతో తయారైన స్నాక్స్‌నే తినాలి.

ఎక్కువగా మెదడుతో పనిచేయాల్సి వచ్చినప్పుడు మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం మంచిది. పగలు మెదడును ఉపయోగించిపనులు చేసేవారు అధికంగా మాంసకృత్తులు కలిగిన మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవాలి. ఇలాంటి ఆహరం వల్ల మనసును కేంద్రీకరించే శక్తి పెరుగుతుంది. రాత్రిపూట ఉద్యోగాలు చేసే వ్యక్తులు, రాత్రిపూట మెల్కోని చదివే విద్యార్దులు రాత్రి పూట అధికమొత్తాల్లో మంసకృత్తులను తీసుకోవటం మంచిది. కొవ్వుతీసేసిన మాంసం, చర్మం తొలగించిన కోడి మాంసం, చేపలు, చిక్కుళ్లు, వెన్నలేని పెరుగు, పాలు పన్నీర్ వంటివి తీసుకుంటే మాంసకృత్తులు అందుతాయి.


డిప్రెషన్ తగ్గించే కెఫిన్

కాఫీ, చాక్లెట్లు, కూల్ డ్రింకుల వంటి వాటిల్లో కెఫిన్ ఉంటుంది. ఇది కుంగుబాటును తగ్గించే పదార్ధంగా, అంటే యాంటి డిప్రసెంట్ గా పనిచేస్తుందని నిరూపితమయ్యింది. పరిమిత మోతాదుల్లో కెఫిన్ కలిగిన పదార్ధాలను తీసుకుంటే మూడీగా ఉన్నపుడు ఉత్సాహం తిరిగివచ్చేస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీవల్ల ఎటువంటి దుష్పలితాలు కలగవని అధ్యయనాల్లో తేలింది.


కుంగుబాటుకు విరుగుడు ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల మెదడులో సెరతోనిన్ విడుదల తగ్గిపోతుంది. ఈ కారణంగానే మానసిక రోగులలో ఇతరులతో పోలిస్తే ఫోలిక్ యాసిడ్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బచ్చలికూర, చుక్కకూర, తోటకూర వంటి ఉడికించిన ఆకుకూరల్లోను, కమలాపండ్లరసంలోనూ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. శారీరక అవసరాలకు రోజుకు 200 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. ఇది ఒక కప్పు ఆకులోనూ, గ్లాసు కమలాపండ్లరసంలోనూ లభిస్తుంది.


మూడ్ ని తగ్గించే సెలీనియం లోపం

సెలీనియం అనే పదార్ధం తగ్గడంవల్ల ఆందోళన, చిరాకు, విరోధభావాలు, కుంగుబాటు వంటివి ఏర్పడతాయని అధ్యయనాల్లో తేలింది. పొద్దుతిరుగుడు గింజలు, గింజధాన్యం వంటివాటిల్లో సెలీనియం ఉంటుంది.


జ్ఞాపకశక్తిని, మనకు కేంద్రీకరణశక్తిని పెంచే గుడ్లు

కొలెస్టరాల్ ఆహారాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో కోలిన్ లోపం ఏర్పడుతుంది. కోలిన్ అనేది బి-కాంప్లెక్స్ తరగతికి చెందిన విటమిన్. గుడ్లు, లివర్ వంటి ఆహారపదార్దలలో ఇది అధికమొత్తాల్లో ఉంటుంది. కోలిన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది, అంతేకాకుండా మనసు నిలకడగా ఉండదు. కేంద్రీకరణ సాధ్యంకాదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: