telugudanam.com

      telugudanam.com

   

ఎందుకు, ఏమిటి, ఎలా ...

చాటింగ్

సాయంకాలాలు ఏమీ ఉబుసుపోక పల్లె జనాలంతా వేపచెట్టు కిందకు చేరినట్లు, నెట్ పక్షులన్నీ చాట్‌రూమ్‌ల్లోకి చేరతాయి. దేశవిదేశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను పంచుకోవడానికి వీలు కల్పించే మెసెంజర్‌లు ఎంత మంచివో అంత చెడ్డవి. దూరమైపోయిన ఒకనాటి స్నేహితుడు/స్నేహితురాలితో కాస్త ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాటింగ్ కంటే అనుకూలమైనది ఏదీ లేదు. కానీ చాట్‌రూంల రూటే వేరు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ పరిచయాలు కొంతమందికి తమ కెరీర్‌ను మలుచుకోవడానికి పనికివచ్చాయి. మరికొంతమందికి టైంవేస్ట్ మాత్రమే చేశాయి. ఇంకొంతమందికి చేదు అనుభవాలు మిగిల్చాయి. సేఫ్‌గా చాటింగ్ చేయడానికి ఎంఎస్ఎన్, యాహూ సర్వీసుల వాళ్లు ఈ కింది టిప్స్ చెబుతున్నారు...అవే కాకుండా - 'వన్నా చాట్ విత్ మీ అంటూ అడగకుండానే ముందుకొచ్చి, పదేపదే బజ్ చేస్తూ విసిగించే వారిని ఎక్కువగా ఎంటర్‌టెయిన్ చేయకండి. చాట్ రూముల్లో జరిగే చర్చల్లో నధింగ్‌లు, నాన్సెన్స్‌లే ఎక్కువ. మీ కెరీర్‌కి ఉపయోగపడే చాట్‌రూమ్‌ను ఎంపిక చేసుకోవడంలో శ్రద్ధ వహించండి. అన్నింటినీ మించి ఆఫీసులో చాటింగ్ చేయకండి. బహుశా మీరు ఎవరెవరితో చాట్ చేస్తున్నారో మీ బాస్ కనిపెట్టేస్తు ఉండి ఉంటాడు.


పట్టు బట్టల కధ

అందరం సుబ్బారావు కూతురు పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అంటే వేరే చెప్పాలా? ఆడవాళ్ళు అందరూ రంగురంగుల పట్టుచీరెలు కట్టుకుని వచ్చారు. అందరూ సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారు. పట్టుబట్టలకు మనదేశంలో వున్నంత గిరాకీ యింక ఏ దేశంలోనూ లేదు. అసలు ఈ పట్టు విశేషాలు ఏమిటో చూద్దాం.


పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి?

పట్టు దారంతో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.


పట్టు - పరిశ్రమగా ఎలా ఎదిగింది?

మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.

ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది.


పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుంది?

పట్టు పురుగు గుడ్డు చీల్చుకుని బయటికి వస్తుంది. ఇది తన చుట్టూ గూడు అల్లడం మొదలుపెడుతుంది.

ఇది ఎంత చిక్కగా గూడు అల్లితే అంత మంచి దారం తయారు అవుతుంది. గూడు పూర్తి కాకుండానే చాలా పురుగులు చచ్చిపోతాయి. ఈ గూళ్ళు కూడా అంత మంచివి కాకపోవచ్చు. ఇరవై కిలోల గూళ్ళ నుండి ఒక కిలో దారం మాత్రం వస్తుంది. పట్టులో చాలా రకాలు వున్నాయి.


మూగా అనే పట్టుదారం మనదేశంలోనే దొరుకుతుంది. 'ఈరి' అనే పట్టుదారం తయారుచేయడంలో మన దేశం ముందు వుంది. టస్సర్ పట్టుదారం తయారీలో మనది 2వ స్ధానం. మల్బరీ తయారీలో 5స్ధానం.

పట్టు పరిశ్రమ బాగోగులు చూడాలి గదా! దీని కోసం 1949 సంవత్సరంలో 'కేంద్ర పట్టు బోర్డు' ను పెట్టారు. బర్హంపూర్ అనే వూరిలో 'పట్టు పరిశోధనా కేంద్రం' వుంది.


కొత్త రకం పట్టు పురుగులు:

విదేశీ పట్టు పురుగులను మన వాటితో కలిపారు. సంకర జాతి పట్టు పురుగులు పుట్టాయి. నాణ్యత బాగా పెరిగింది. విదేశీ పట్టు పురుగుల్ని యిక్కడే పెంచుతున్నారు. దీని వల్ల నాణ్యత పెరిగింది. పట్టు తయారీ 15 వేల టన్నులు పెరిగింది. పట్టు పురుగుల్ని చక్కగా పెంచడం ఒక పద్ధతి.

పట్టు పురుగుల్ని జాగ్రత్తగా పెంచాలి. వాటికి రోగాలు రాకుండా చూసుకోవాలి. గూడు మధ్యలో చనిపోకుండా చూడాలి. సరి అయిన ఆహరం అందించి గూడు ఒత్తుగా పెట్టేలా చూడాలి. ఈ జాగ్రత్తలన్నీ ' జాతీయ పట్టు పధకం ' వివరంగా చెబుతుంది.


మల్బరీ తోటలపెంపకం:

పట్టు పురుగులు మల్బరీ చెట్ల ఆకులు తింటాయి. వీటికి మంచి ఆహారాన్ని అందించాలి. అప్పుడే చిక్కని గూడు కడుతుంది. అందువల్ల మల్బరీ తోటలను బాగా ఎక్కువ సంఖ్యలో పుట్టించాలి. మల్బరీ ఆకులు ఏపుగా ఆరోగ్యంగా వుండాలి. ఈ ఆకులను కత్తిరించి వీటికి ఆహారంగా వేస్తారు. ఇలాంటి ఆకులు తిని పట్టు పురుగులు బాగా పెరుగుతాయి. మంచి గూళ్ళు కడతాయి.

ఎలాంటి నేలలో అయినా మల్బరీ తోటల పెంపకం మొదలు పెట్టవచ్చు. ఈ తోటలకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడితే మంచిది. రసాయనిక ఎరువులను కూడా కొంత వాడవచ్చును.

మల్బరీ ఆకులలో తేమ, బాగా ఉండాలి. తోటలో కొంత భాగాన్ని చాకీ తోటగా పెంచుకోవాలి. అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి.

ఒక ఎకరానికి 12 నుండి 14 టన్నుల మల్బరీ ఆకు తయారు అవుతుంది. వీటిల్లో ఎక్కువ తేమ వుండే ఆకు మంచిది. ఇప్పుడు ఎకరానికి 22 - 28 టన్నుల ఆకును పండిస్తున్నారు. ఇందుకు తగిన విత్తనాలు కూడా వచ్చాయి. వీటి కొమ్మలు నిటారుగా వుండి పొడవుగా వుంటాయి. ఈ మల్బరీలో చాలా రకాలు వున్నాయి. ఎస్-36, ఎస్-13, వి-1 అనేవి ముఖ్యమైనవి.

ఎస్.బి-4, బి-2 అనబడే పట్టు వంగడం మంచిది. దీని గుడ్ల సంఖ్య 50. పట్టు పురుగు ఎదిగే సమయం 26 రోజులు. కిలోకి 560 పట్టు కాయలు వస్తాయి.

కాయకు దారానికి నిష్పత్తి 19 : 10. దీనినే కచ్యా నిష్పత్తి అంటారు. ఈ పట్టుకాయలు కిలోకి సుమారు 192 రూ. ధర పలుకుతుంది. ఇతర పట్టు వంగడాలు కూడా వున్నాయి. అవి ఎస్. బి-18, సి.ఎస్.ఆర్-2.

టస్సర్ రకం పట్టు పురుగులకు తెల్ల మద్ది తోటలు అనువుగా వుంటాయి.


మన రాష్ట్రంలో పట్టు పరిశ్రమలు ఎక్కడ వున్నాయి?

తెలుగు నెలలో మొదటి పట్టు కేంద్రం పలమనేరులో మొదలయ్యింది. ఇది చిత్తూరు జిల్లాలో వుంది. ఇక్కడ ఎక్కువగా విదేశీ పట్టు పురుగులు పెంచుతున్నారు.

లేపాక్షిలో మరో కేంద్రం పెట్టారు. భద్రాచలం, చింతలపూడిలలో ఈ కేంద్రాలు వున్నాయి. అంతే కాకుండా చింతపల్లిలో కూడా పట్టు పరిశ్రమలు వున్నాయి. మల్బరీ తోటలను అనంతపురం, చిత్తూరులలో పెంచుతున్నారు.

మనకు రాష్ట్ర పట్టు సమాఖ్య వుంది. ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాల్లో మల్బరీ తోటలు వున్నాయి. ఏడాదికి 28 వేల టన్నుల పట్టు గూళ్ళు తయారు అవుతాయి.

కుప్పం, మదనపల్లి, హిందుపూర్‌లలో కూడా పట్టు పురుగులు బాగా పెరుగుతున్నాయి. అక్కడ నాణ్యమైన విదేశీ పట్టు పురుగు వుంది. దాని పేరు బైవోల్బిన్. దానిని యిక్కడ పెంచవచ్చు.

ఈ పరిశ్రమ మన రాష్ట్రంలో బాగా నిలదొక్కుకున్నది. చాలామందికి ఉపాధి కల్పిస్తున్నది.


ఓవెన్ పని తీరు తెలుసుకుందాం! ( మైక్రో వేవ్ )

వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి.

మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్‌ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్‌లో 700 వాట్‌ల ఓవెన్‌ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్‌లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్‌తో ఓవెన్‌ను ఎంపికచేసుకోవచ్చు. 700 వాట్ మీద వంట చేయటం వల్ల వంట త్వరగా పూర్తవుతుంది. అంతే కాదు ఎక్కువ వేడి మీద కూడా పూర్తవుతుంది.

అలాగే ఓవెన్‌లో రెండవ ప్రధాన అంశం కంట్రోల్ పానెల్. చాలా మంది కంట్రోల్ పానెల్ కన్నా డయల్స్ ఉన్న ఓవెన్‌ను కొంటారు. డయల్స్‌తోనే వారికి అలవాటైపోతుంది కాబట్టి. అయితే టచ్‌పానెల్‌తో ఓవెన్‌ను కొనుక్కుంటే అది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పది నంబర్లతో కూడిన టచ్‌పానెల్ సౌకర్యం ఓవెన్‌కు ఉంటే మరింత బాగుంటుంది. ఒక్కో పానెల్ లో కనీసం మూడు పవర్ లెవల్స్ ఉండేలా చూసుకోవాలి. అన్ని ఓవెన్‌లు పదార్ధాలను 100 శాతం ఉడుకిస్తాయి. అయితే కొన్ని పదార్ధాలను వంట చేసే ముందు డీఫారెస్ట్ చేయాలంటే 30 శాతం అదనంగా పవర్ లెవల్ ఉండాలి. క్యాబినెట్ కింద ఉండే మోడల్ సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ టేబుల్ మీద పెట్టుకోవడానికి వీలయ్యే, ఓవెన్‌లతో ఉపయుక్తంగా ఉంటుంది. అంటే వంటకాన్ని భద్రంగా ఓవెన్‌లోనే వదిలేయవచ్చు. దానిలో మరిన్ని దినుసులు వేసి కలుపుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్‌లో వంట చేసేటప్పుడు వంటతో పాటు సమయం మీద కూడా ధ్యాస పెట్టాలి. దేనిని ఎన్ని నిముషాలకు వేడి చేయాలనే నియమాలు అందులో ముందుగానే నిర్ధారితంగా ఉంటాయి.


మైక్రొవేవ్ ఓవెన్ ఎందుకో ఇప్పుడు చూద్దాం...

మామూలు ఓవెన్‌‌లో వంట చేసే సమయంలో నాలుగింట ఒక వంతు సమయాన్ని మాత్రమే మైక్రోవేవ్ ఓవెన్‌లు తీసుకుంటాయి. వేడి ఓవెన్‌కు పరిమితమైది. కాబట్టి మీ వంట గదిలో వేడి ఉండదు. వంట మరింత రుచికరంగా ఉంటుంది. దినుసుల్లో సహజరుచి ఏమాత్రం మారదు. తక్కువ సమయంలోనే వంట చేయడం వల్ల అందులోని మూలకాలు, విటమిన్లు, ఇతర పోషకవిలువలు అలానే ఉంటాయి.


మైక్రోవేవ్‌ను కొంటే కనుక...

అవసరాన్ని బట్టి కొనాల్సిన వస్తువు ఇది. వాటితో పాటు వంటింట్లో ఉన్న స్థలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. స్థూలంగా మైక్రోవేవ్‌లు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి - తిండిని వేడి చేయడానికి పనికొస్తుంది. రెండు - కేకుల్లాంటివి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మూడు - టిక్కా లాంటి గ్రిల్లింగ్ అవసరమున్న వంటకాలు చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. మీరు ఎంత మొత్తంలో వండుకుంటారో దాన్ని బట్టి సైజును ఎంచుకోవాలి. ఎక్కువమంది ఉన్నప్పుడు పెద్దది తీసుకోవడమే మేలు. చిన్నది తీసుకుంటే వంటకాన్ని విభజించి రెండుమూడుసార్లుగా చేసుకోవాల్సి ఉంటుంది. అదే వంటకు కాకుండా కేవలం వండిన దాన్ని వేడిచేసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళయితే పెద్ద కుటుంబమైనా సరే చిన్న మైక్రోవేవ్ ఒవెన్ కొనుక్కుంటే సరిపోతుంది.


వాడేటప్పుడు...

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: