telugudanam.com

      telugudanam.com

   

బృహదీశ్వరాలయం

తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఆ దేవాలయాల్లో బృహదీశ్వరాలయం పెద్దది, ప్రముఖమైనది. ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు (క్రీ.శ985-1014) నిర్మించాడు. ఈ ఆలయం దక్షిణాదిన దేఎవాలయ విమాన నిర్మాణానికి, తమిళ శిల్ప కళా నైపుణ్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ద్రవిడుల నిర్మాణాల విమానాల్లో అతి పెద్దది. అప్పట్లో ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుని పేరున రాజరాజేశ్వరాలయంగా పిలిచేవారు. కాలక్రమాన తరువాతి రాజుల పాలన కాలంలో పలు మార్పులు చెంది నేడు బృహదీశ్వరాలయంగా పేరుగాంచింది. వాస్తు, శిల్ప, చిత్రలేఖన తదితర కళలన్నీ అద్భుతంగా అలరారుతున్న ఉత్తమ సంగమ ప్రాంతం ఈ ఆలయ ప్రాంగణం.

విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం (ప్రవేశ ద్వారం) కేరళాంతకన్, రెండవ ద్వారం రాజరాజన్ తిరువనల్, మూడో ద్వారం తిరువానుక్కన్ తిరువనల్. ఇది మన రాష్ట్రంలోని లేపాక్షి బసవన్న తరువాత అంత భారీ విగ్రహం. ఈ నంది మండపాన్ని చోళ రాజుల తర్వార పరిపాలించిన నాయక రాజులు, మరాఠాలు అందమైన నగిషీలతో చింత్రించిన చిత్రాలను అద్భుత రీతిలో మలిచారు. ఈ మహానందికి ఎదురుగా ప్రధాన ఆలయం ఉంది. ఈ ఆలయం పై భాగం మహాముఖ మండపాలతోఅ నాలుగు అంతస్తులతో ఉంది. ఆలయ ప్రధాన ద్వారం తూర్పుకు ఉండగా పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ద్వారాలున్నాయి. గర్భ గుడిలో చలా పీద్ద లింగ పీఠమూ, దాని మీద అతిపెద్ద లింగమూ ఉన్నాయి. ఇంత అందమైన, పెద్దదిగా ఉన్న లింగము దేశంలో ఇక్కడే చూస్తాము. రెండు గోడల మధ్య రెండు అంతస్తులలో ప్రదక్షిణ మార్గం ఉంది. నాలుగువైపుల ద్వారాలున్న ఈ ఆలయం చతుర్ముఖం లేక సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు శిల్పులు.

ఆలయ బయటి ద్వారాల ప్రక్కల ఎత్తైన ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. బయటి గోడల నిలువు గూళ్ళపైనా, రెండవ స్తంభాల గోడలపైనా పెద్ద శాల ఉంది. మధ్య ఉన్న నిలువి గూళ్ళపైన పంజరాలున్నాయి. ద్వారానికి అటు, ఇటు వైపున ఉన్న నిలువు గూళ్ళను దేవకోస్టాలుగా తీర్చిదిద్ది వాటితో అందంగా చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించారు. ఈ దేవతా మూర్తుల అవతార గాధలను శిల్పాలుగా సూక్ష్మరూపంలో చెక్కి అక్కడ ఉంచడం ఈ దేవాలయం ప్రత్యేకత. క్రింద గర్భాలయం గోడలో దక్షిణాన కూర్చున్న శివుడు, పడమతివైపున నటరాజు, ఉత్తరాన దేవీమూర్తులు ఉన్నారు. అంతేకాక ప్రదక్షిన్ళ మార్గం లోపలి గోడ మీద, కుడ్య స్తంభాల మీద వర్ణచిత్రాలను అద్భుతంగా చిత్రించారు. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడిని సంహరించిన కథ, నటరాజుని పూజిస్తున్న రాజు, ఇంకా పక్షులు, అందమైన లతలు, నాట్య భంగిమలతో ఉన్న నాట్యకతెలువంటి పలుచిత్రాలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఈవిధంగా సర్వకళాశోభితమై, సంస్కృత, తమిళ శాసనాలున్న చారిత్రాత్మక ప్రసిద్ధ దేవాలయంగా అలరరుతోందీ బృహదీశ్వరాలయం. ఇదే ప్రాకారం లోపల మహానందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. దక్షిణ దిక్కునున్న ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరమూ, ఎదురుగా మండపాలున్నాయి. అక్కడే అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఆ పక్కనే దక్షిణాముఖుడై నటరాజ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంది. ప్రధానాలయం బృహదీశ్వరాలయానికి ఆగ్నేయాన వినాయకుడి గుడి, వాయువ్య దిశన సుబ్రహ్మణ్య ఆలయం, తూర్పుముఖంగా ఉన్నాయి. ఈ ఆలయాన్ని మొదటి రాజరాజచోళుడు ప్రారంభించినా తరువాత వచ్చిన వివిధ పాలకులు, రాజులు అభివృద్ధిపరిచారు. ఈ ఆలయానికి ఏ దేవాలయానికీ లేని ఒక ప్రత్యేకత ఉంది. కుల, మత, వర్గ భేదం లేకుండా అందరూ ఈ ఆలయాన్ని దర్శించాచ్చని ఇక్కడ ఒక ప్రకటన కూడా ఉంది. విదేశీఉలు కూడా ఈ ఆలయాన్ని దర్శించవ్చ్చు. ప్రధానాలయం ఉత్తర దిశలో పైభాగాన స్వమి అభిషేక జలం బయతికి వచ్చే నాళం ఉంది. దాని ఉదిట శివుని మూల భృత్యుడైన చండికేశ్వరుడి ఆలయం ఉంది. ఈ స్థానంలో చండికేస్వరుని ఉంచడం అనేది ఇక్కడినుండే ప్రారంభం అయినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

తంజావూరులో పెద్ద ఆలయం తర్వాత చూడతగ్గ ప్రదేశాలున్నాయి. వాటిలో సరస్వతీ మహల్ గ్రంధాలయం ముఖ్యమైనది. ఈ గ్రంధాలయంలో పురాతన తాళపత్ర గ్రంధాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వేలాది రాతప్రతులు, భారత, యూరోపియన్ భాషలకు సంబంధించిన గ్రంధాలు, అముద్రిత గ్రంధాలునాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంధాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయనకారులకు, విజ్ఞాన పిపాసులకు ఈ గ్రంధాలయం ఒక వరం.

తంజావూరులో తరువాత చూడతగ్గది అద్బుతమైన పెద్ద కోట ప్యాలెస్. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్ ను ఒకరితర్వాత మరొకరు గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో ఈ ప్యాలెస్ విస్తరించి ఉంది. పర రాజుల దాడులలో రక్షణకు ఉపయోగించే రహస్య భూమార్గాలు, లోపల అనేక టన్నెల్స్ ఇక్కడ ఉన్నాయి. ప్యాలెస్ పై భాగంలో రాజులు ఆనాడు యుద్ధాల్లో వాడిన కృపాణాలు, కత్తులు, బాకులు, ఇంకా గృహోపకరణాలతో నిండిన మ్యూజియం ఉన్నాయి.

తంజావూరుకు 11 కి.మీ. దూరంలో తిరువాయుర్ అనే గ్రామం ఉంది. సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారు నివశించిన గ్రామం ఇదే. ఇక్కడే కావేరి నది పారుతుంది. ఈ నదీ తీరాన ఈ గ్రామంలోనే త్యాగరాజస్వామి సమాధి ఉంది. ఈ సమాధి ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం ఆయన ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతారు.

తంజావూరు వెళ్ళడానికి చెన్నై నుండి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: