telugudanam.com

      telugudanam.com

   

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ

ప్రయాగ

నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. ఉత్తమోత్తమ నదీమతల్లులైన గంగ, యమున, సరస్వతిలు కలిసే అక్కడి సంగమ ప్రదేశం భూతల స్వర్గం అనవచ్చు. సాధారణంగా "కుంభమేళ"అంటేనే 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో వారణాశి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలోని నదీతీర స్నానాల కోసం అశేషంగా జనం తరలి వెళుతుంటారు. ప్రతిరోజూ వేళ సంఖ్యలో దేశ,విదేశాల నుండి యాత్రికులు పుణ్యస్నానాలకు వస్తుంటారు. వారిలో మామూలు పర్యాటకుల నుండి మొదలుకొని యోగులు, సాధువులు వంటి వారంతా ఉన్నారు. దాని మధ్యలోనే ఆరేళ్ళ కాలానికి వచ్చే సమయాన్ని "అర్థకుంభమేళ"గా పిలుస్తున్నారు.

ప్రయాగ వేల సంవత్సరాల చరిత్ర గల అలహాబాద్ నగరాన్నే"ప్రయాగ"గా పిలుస్తున్నారు. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ ఒకటిగా కలుస్తాయి. ఇక్కడే అంతర్లీనంగా సరస్వతీ నది కూడా వచ్చి కలుస్తునదని వేలాది సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కనుకే ప్రతి పన్నేండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ త్రివేణి సంగమంలో "కుంభమేళ" ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారింది. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మానవులకు అంత్యంలో పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయన్న ప్రగాఢ నమ్మకం హిందువులలో ఉంది.

ప్రయాగ కుంభమేళ స్నానం కోసం అలహాబాద్‌కు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేస్తే పెద్దగా ఖర్చు ఉండదు.కాకపోతే అక్కడ ఒకరోజు నివాసం ఉండాలనుకునే వారిక మాత్రం కొంత వ్యయం తప్పదు.అక్కడి త్రివేణి రోడ్,జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డు (ఫోర్ట్ క్రాసింగ్ వద్ద) గల కుంభమేళ కాంపౌండ్‌లో సంగం టూరిస్టు కాటేజీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పరిచారు.స్విస్ కాటేజీలలో డబుల్ బెడ్‌రూం సౌకర్యం లభ్యమౌతుంది.కాకపోతే వీటిలో ఒకరోజు అద్దె సింగిల్ బెడ్‌రూంకు 1200 నుండి 1500 రూపాయల దాకా ఉండగా,డబుల్ బెడ్‌రూంకు 1500 నుండి 2500 రూపాయల వరకు ఉంది.అటు ఆధ్యాత్మిక స్ఫూర్తి - ఇటు చారిత్రక సంపద

అలహాబాద్‌లో ఆధ్యాత్మిక స్ఫూర్తితోపాటు వేల సంవత్సరాల విశేష చరిత్ర సంపద కూడా ఉంది. సంవత్సరం పొడుగునా యాత్రికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. అలహాబాద్ పేరు చెప్పగానే చాలామందికి చాచాజీ గుర్తుకు వస్తారు.పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన నివాసగృహం "ఆనంద్ భవన్", అక్బర్ 1853లో నిర్మించిన కోట వంటి అనేక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. కాగా,రామాయణ కాలం నాటి భరద్వాజ మహర్షికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే "అలహాబాద్ విశ్వ విధ్యాలయం" నెలకొంది.


ఎలా వెళ్ళాలి?

వారణాసికి పశ్చిమాన 135 కి.మీ.దూరంలో అలహాబాద్ ఉంది. వారణాసి నుండి రెగ్యులర్ బస్సు సర్వీసులు ఉంటాయి.అక్కడ్నించి సుమారు మూడ్న్నర గంటల ప్రయాణం.రోడ్డు మార్గంలో పైజాబాద్ నుండి నాలుగున్నర గంటలు,గోరఖ్‌పూర్ నుండి ఏడు గంటల ప్రయాణ సమయం పడుతుంది.అలహాబాద్ రైల్వే జంక్షన్ నగరం నడిబొడ్డులోనే ఉంది.దేశంలోని ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై వంటి ప్రదేశాల నుండి అక్కడికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అర్థ కుంభమేళ జరిగే సంగమ ప్రదేశం రైల్వే స్టేషన్ నుండి 5కి.మీ.దూరంలోనే ఉంటుంది. అక్కడికి ఆటో - సైకిల్ రిక్షాలపై రూ.15లకె వెళ్ళవచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: