telugudanam.com

      telugudanam.com

   

బ్రహ్మకపాలం

బ్రహ్మకపాలం బదరీనాధ్‌లో వుంది. బ్రహ్మ దేవుడికి మొదట అయిదు తలలు ఉండేవట. ఒక తడవ శివుడికి ఎందుకో బ్రహ్మదేవుని మీద కోపం వచ్చి ఒక తల నరికి వేశాడట. అది బ్రహ్మ హత్యాదోషం కాబట్టి ఆ తల అలాగే శివుని చేతికి అతుక్కుని ఉండిపోయిందట. ఆయన దానిని వదిలించుకోవడానికి అనేక క్షేత్రాలు తిరుగుతూ ఉండగా, చివరకు ఈ బదరీనాధ్‌ వచ్చేటప్పటికి ఊదిపోయిందట. బదరీనాధ్‌లోని ఆలయం అలకనంద అనeేనది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే, పొడవుగా ఉన్న మెట్లమీదుగా నడుచుకుంటు సుమారు ఏభై గజాలు వెళితే, అక్కడ నదిఒడ్డు పైన సుమారు పది అడుగుల పొడుగు, ఆరు అడుగుల ఎత్తు. నాలుగు అడుగుల మందం ఉన్న ఒక బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం. ఆ బ్రహ్మకపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అక్కడే ఒక రేకుల షెడ్డు ఉంది. పితృకర్మ చేయదలచుకున్నవారిని అక్కడ ఉండే పురోహితులు, ఆ షెడ్డులో కూర్చొపెట్టి చేయించి, వారి దగ్గరి నుంచి సుమారు మూడువందల రూపాయలు తీసుకుంటారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: