telugudanam.com

      telugudanam.com

   

చిరపుంజి

అక్కడి వారు దీనిని చిరాపుంజి అంటారు. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మేఘాలయ రాష్ట్రం మొత్తం కాశీ, గారో అనే కొండలమీద పరుచుకుని ఉంది. ఈ రాష్ట్రం మొత్తంలో కనీసం ఒక్క అంగుళం కూడా చదునుగా ఉన్న మైదాన ప్రదేశం కనిపించదు. అందువల్ల ఈ రాష్ట్రం మొత్తమూ కొండల మీద వున్న రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవలసిందే. మెఘాలయ రాజధాని షిల్లాంగ్‌. అస్సాంలోని గౌహితి నుంచి షిల్లాంగుకు వంద కిలోమీటర్ల బస్సు ప్రయాణం. షిల్లాంగ్‌ నుంచి చిరాపుంజికి మరొక ఏబై కిలోమీటేల దూరం బస్సులో వెళ్లాలి. చిరాపుంజిని ఆనుకునే భారత - బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దు వుంది. మొదట నైఋతి ఋతుపవనాలు, ఆ వెంటనే ఈశాన్య ఋతుపవనాలు ప్రయాణించే మార్గంలోనే చిరాపుంజి ఉంది. అందువల్ల ఈ చిరాపుంజిలో ప్రపంచం మొత్తం మీద అత్యధిక వర్షపాతం ఉంటుందని అంటారు. సాధారణంగా వర్షాలు ఎక్కువగా కురిసే చోటంతా దట్టమైనా అడవులు నిండి ఉంటాయని అందరకూ తెలిసిన విషయం. కాని చిరాపుంజిలోనేగాక, ఈ చుట్టుప్రక్కల కూడా ఒక్క చెట్టు కనిపించదు. ఇక్కడ ఉన్నవన్నీ బోడి కొండలు. చిరాపుంజికి దగ్గరలోనే మాసిన్రామ్‌ అనే మరొక ప్రదేశం ఉంది. ఈ మధ్యన చిరాపుంజి కంటే మాసిన్రామ్‌లోనే ఎక్కువ వర్షపాతం ఉంటోందట. అయితే మాసిన్రామ్‌ అనే ప్రదేశం దట్టమైన అడవి ఉంది. చిరాపుంజిలో ప్రత్యేకంగా చెప్పుకొనదగిన గొప్ప అంశాలు ఏమీలేవు. కొండల మీద నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు, దూరం నుంచి చూడాల్సిన రెండు జలపాతాలు అంతే. చిరాపుంజి వెళ్లే మార్గంలో మన అరకులోయలోని బొర్రా గుహలు మాదిరిగా వుండే ఒక చిన్న గుహవుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: