telugudanam.com

      telugudanam.com

   

గోవా

గుంపులు గుంపులుగా నల్లని మబ్బులు... రోజంతా మసక మసకగా... ముసురు కమ్మిన వాతావరణం... కాసేపు జోరువాన... కాసేపు వెచ్చని ఎండ... ఎటు చూసినా చిత్తడి నేలలూ... చుట్టూ పరుచుకున్న పచ్చదనం... మంద్రంగా వినిపించే సముద్ర హోరు... ఏ సీజన్‌లోనైనా గోవాలో వుండే వాతావరణం ఇదే. అసలైన గోవాని వానాకాలంలోనే చూడాలి. మామూలుగా వింటర్‌ సీజన్‌లో విదేశీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటుంది గోవా... హోటల్‌ గదులు ఖాళీలుండవు. బీచ్‌లన్నీ జనంతో నిండిపోయి, అర్ధరాత్రి వేళ వరకూ సాగే మ్యూజిక్‌ పార్టీలతో, జల్సాగా... బుసబుస పొంగే బీరులా ఉంటుంది గోవా. మాన్‌సూన్‌ సీజన్‌లో మాత్రం స్తబ్దుగా... షాంపైన్‌లా అనిపిస్తుంది.


గోవా చేరుకోవాలంటే...

గోవా

బస్‌ సర్వీస్‌ ద్వారా అయితే హైదరాబాద్‌ నుంచి గోవాకి నేరుగా ఎపి టూరిజమ్‌(ఎపిటిడిసి) వారి 5-డే టూర్‌ ప్యాకేజెస్‌ అందుబాటులో ఉన్నాయి.
రైలు ప్రయాణం ద్వారా అయితే హైదరాబాద్‌ నుంచి కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9:15 గంటలకు. మార్‌గోవా స్టేషన్‌కు 1:40 గంటలకు, వాస్కోడిగామా స్టేషన్‌కు 2:50 గంటలకు చేరుకుంటుంది. విజయవాడ స్టేషన్‌ నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌(హౌరా - వాస్కోడిగామా) సోమ, మంగళ, గురు, శని వారాల్లో మాత్రమే నడుస్తుంది. సాయంత్రం 6:45 గంటలకు బయల్దేరి మార్‌గోవా మధ్యాహ్నం 1:40, వాస్కోడిగామా స్టేషన్‌కు 2:50 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలోనే దూద్‌సాగర్‌ వాటర్‌ ఫాల్స్‌ని చూడొచ్చు.స్టేషన్‌కి దాదాపు 5 లేదా 6 కిలోమీటర్ల దూరంలో గోవా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ నిర్వహించే రెసిడెన్సీలు పనాజి రెసిడెన్సీ, మార్‌గోవా రెసిడెన్సీ, మపుసా రెసిడెన్సీ, వాస్కో రెసిడెన్సీ, ఇంకా బీచ్‌ ఎకామడేషన్‌ కావాలంటే కలన్‌గుటే రెసిడెన్సీ, మిరామర్‌ రెసిడెన్సీ, కోల్వా రెసిడెన్సీ వుంటాయి. బీచ్‌ పక్కనే వుండటం వల్ల ఇక్కడి నుంచి సీ వ్యూ అద్భుతంగా వుంటుంది. బీచ్‌లో వాటర్‌ స్కూటర్‌, బనానా రైడ్‌, డాల్ఫిన్‌ వ్యూ... వంటి వాటర్‌ స్పోర్ట్స్‌ మస్త్‌ మజా ఇస్తాయి. ఇంకా షాక్స్‌(బెవరేజెస్‌, రిఫ్రెష్‌మెంట్స్‌ స్టాల్స్‌)లో బాగా ఎంజాయ్‌ చెయ్యొచ్చు. సీఫుడ్‌ ఇష్టమైన వారు గోవాలో అన్ని రెస్టారెంట్స్‌లో చాలా వెరైటీస్‌ని టేస్ట్‌ చేయొచ్చు.

గోవా గోవా మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. నార్త్‌ గోవా, సౌత్‌ గోవా. నార్త్‌ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు నార్వాలో వెయ్యి సంవత్సరాల సప్తకోటేశ్వర ఆలయం, మేయమ్‌ లేక్‌, మపుసా టౌన్‌ గుండా వగాటోర్‌, అంజున, కలన్‌గుటే, అగౌడా ఫోర్ట్‌, పాంజిమ్‌ హాండీక్రాఫ్ట్స్‌ ఎంపోరియమ్‌. సౌత్‌ గోవాలో లేదా ఓల్డ్‌ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు పోర్చ్‌గీస్‌ శైలి చర్చ్‌లు, బోమ్‌ జీసెస్‌ బాసిలికా, సె కేధిడ్రిల్‌, వాక్స్‌ వరల్డ్‌ మ్యూజియం, క్రిస్టియన్‌ ఆర్ట్‌ మ్యూజియం, మంగేశ్‌ టెంపుల్‌, శాంతాదుర్గ టెంపుల్‌, పురాతన గోవా మ్యూజియం, మార్‌గోవా, కోల్వా బీచ్‌, డోనా పౌలా బే, మిరామర్‌ బీచ్‌లు.

గోవా గోవాలో ఫెన్నీ అని జీడి పండ్లతో, కొబ్బరితో చేసిన డ్రింక్‌ చాలా ఫేమస్‌. అక్కడికి దగ్గరలో బిగ్‌ఫుట్‌ అనే ప్రదేశంలో ఓ సాధువు ఒంటికాలితో తపస్సు చేశాడట. ఆ ప్రదేశంలో మనం కూడా కాలు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని అంటారు. మంగేశ్‌ టెంపుల్‌లో శివలింగం బదులు శివుని విగ్రహానికి చేస్తుంటారు. ప్రఖ్యాత గాయని లతా మంగేశ్వర్‌ ఈ ఆలయాన్ని డెవలప్‌ చేశారట. సెయింట్‌ జేవియర్‌ చర్చ్‌లో 400 ఏళ్ళ కిందటి జేవియర్‌ మమ్మీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సమాధి స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా పోర్చుగీస్‌ స్టయిల్‌లో కట్టిన ఆ చర్చ్‌ కూడా చాలా పెద్దది, పురాతనమైనది. తర్వాత డోనా పౌలా బీచ్‌ ఒక అద్భుతమైన సీనిక్‌ వ్యూ. నైట్‌ రివర్‌ క్రూయిజ్‌ షిప్‌ మీద మండోవి నదిలో వెన్నెల విహారం, షిప్ డెక్ మీద డాన్సులూ, గానా భజానా... పెద్దలూ, పిల్లలూ, జంటలూ అందరూ కలిసి ఆహ్లాదంగా గడపొచ్చు. మిరమర్‌ బీచ్‌కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంబోలా బీచ్‌ మారుమూల ప్రాంతం కావడం వల్ల విజిటర్స్‌ తక్కువ. ఎక్కువ మంది ఫారినర్స్‌ సన్‌బాత్‌ చేస్తూ కనిపిస్తారు. తర్వాత చూడాల్సింది చపోరా కోట. సముద్రం పక్కన కొండాపై నిర్మించిన ఆ కోట ఒక విజువల్‌ ట్రీట్‌. హిందీ సినిమా ' దిల్‌ చాహతా హై 'లో ఒక పాటను ఇక్కడే షూట్‌ చేశారు. గోవాలో చాలా ఫేమస్‌ అయినది కలన్‌గుటే బీచ్‌. దీన్ని క్వీన్‌ ఆఫ్‌ బీచ్స్‌ అంటారు. ఇది చాలా రద్దీగా వుంటుంది. పారాసైలింగ్‌ లాంటి వాటర్‌ స్పోర్ట్స్‌ ఇంట్రస్ట్‌ ఉంటే ఇక్కడ చక్కని కాలక్షేపం. తర్వాత 'బగ బీచ్‌' నైట్‌ లైఫ్‌కి చాలా ఫేమస్‌. ఇక్కడ కొన్ని పబ్స్‌ రాత్రి 11 గంటల తర్వాతే ప్రారంభమయ్యేవి కూడా ఉన్నాయి. కాని వాటిల్లో కపుల్స్‌కు మాత్రమే ప్రవేశం.

మూలం: 30-Aug-2009, ఆదివారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: