telugudanam.com

      telugudanam.com

   

కాన్‌కూన్‌

కాన్‌కూన్‌

అందమైన శిల్పాలు, షెల్‌ హ నేషనల్‌ పార్క్‌, సకల వర్ణాల చేపలు, స్వచ్చమైన నీళ్ళు, చల్లని గాలి అన్నీ కలిస్తే కాన్‌కూన్‌, ఒక అందమైన దీవి. అమెరికాలోని షికాగో నుంచి ఆరు గంటల ప్రయాణం చేస్తే కాన్‌కూన్‌ చేరచ్చు. బీచ్‌కు దగ్గరలో ఉండే విల్లా(రెసిడెన్సీ)లో బస చెయ్యొచ్చు. ప్రపంచంలోనే గొప్ప ఆర్కిలాజికల్‌ వండర్‌గా చెప్పబడే 'షిజెనిట్జా' కట్టడం ఇక్కడే వుంది. ఇది క్రీ.శ.490 నాటిది. పురాతనకాలపు 'మాయన్‌ సివిలైజేషన్‌'కు చెందిన షిజినెట్జా తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడి మ్యూజియంలో అందమైన శిల్పాలు, హస్తకళలు రమ్యంగా ఉంటాయి. షెల్‌ హ నేషనల్‌పార్క్‌ నేచురల్‌ ఎన్విరాల్‌మెంటల్‌ పార్క్‌. ఇక్కడి ఎక్వేరియంలో ఎన్నో రకాల రంగు రంగుల చేపలుంటాయి. ఇక్కడ జరిగే డాల్ఫిన్‌ షో చాలా ఫేమస్‌. హాయిగా ఐస్‌క్రీమ్స్‌ తింటూ, షో చూస్తూ ఎంజాయ్‌ చేయచ్చు.


కోజుమెల్ ‌దీవి

'కోజుమెల్‌' ఐలాండ్‌ మెక్సికోలోనే అతి పెద్ద దీవి. ఈ దీవిని స్క్యూబా డైవింగ్‌, స్నార్‌కెలింగ్‌లాంటి వాటర్‌స్పోర్ట్స్‌కి 'ప్యారడైజ్‌' అంటారు. ఇక్కడ షార్క్స్‌ చాలా దగ్గరనుండి చూడొచ్చు. ఐలాండ్‌ అంతా చుట్టి రావడానికి జీప్స్‌, బైక్స్‌ రెంట్‌కి దొరుకుతాయి. ఇక్కడ 'ఎక్స్‌క్యారెట్‌' అనే ఇకలాజికల్‌ థీమ్‌ పార్క్‌ ఉంది. పక్షులు, పూలచెట్లు, వందలకొద్దీ సీతాకోక చిలుకలు, చల్లగాలులు, సముద్రపుఅలలు లాంటి ప్రకృతి రమణీయం మాటల్లో చెప్పలేని అనుభూతి. కాన్‌కూన్‌ మొత్తంలో డాల్ఫిన్స్‌తో స్విమ్‌ చేయగలిగే అవకాశం ఎక్స్‌క్యారెట్‌లోనే. ట్రైన్డ్‌ డాల్ఫిన్స్‌ కావడం వల్ల ఇవి పర్యాటకులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సీ లెవల్‌ నుంచి 30 అడుగుల కింద నీళ్ళల్లో లక్షలాది చేపలు, రకరకాల సముద్ర జీవులను చూస్తూ అండర్‌ వాటర్‌ వాకింగ్‌ మర్చిపోలేని అనుభవం కలిగిస్తుంది.


కాన్‌కూన్‌

ఫిషింగ్‌ పట్ల ఆసక్తి ఉంటే ఫ్లై ఫిషింగ్‌, స్పోర్ట్‌ ఫిషింగ్‌, డీప్‌ ఫిషింగ్‌ లాంటి చాలారకాల ఫిషింగ్స్‌ చేయొచ్చు. కాన్‌కూన్‌లో తప్పకుండా ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సింది బోట్‌ సెయిలింగ్‌. మెక్సికో అంటే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వంటకాలు. మెక్సికన్‌ ఆహారం వివిధ రకాల మసాలాలతో నోరూరిస్తుంది. అలాగే ఈ ఆహారపదార్ధాలను అందంగా అలంకరించే పద్ధతులు, వాటి రుచి ఆహా... ఓహో అనిపిస్తాయి. బరీతోస్‌, ఫహిటాస్‌, సాల్సాలాంటి తినుబండారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు. సంవత్సరం పొడవునా పర్యాటకులు సందర్శించడానికి వీలున్న ప్రదేశం కాన్‌కూన్‌. ఏ కాలమైనా వెళ్ళొచ్చుగాని చలికాలమైతే బెస్ట్‌. ఇక్కడ చలికాలం డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఉంటుంది.

కాన్‌కూన్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ టిప్స్‌...


మూలం: 12-Jun-09, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: