telugudanam.com

      telugudanam.com

   

పూరి

పూరి

పూరి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. విశాఖ పట్టణం నుండి కలకత్తా వైపు వెళ్ళే రైలు మార్గంలో కుర్దారోడ్‌ అనే స్టేషన్‌ వుంది. కుర్దారోడ్‌ నుండి 45 కి.మీ. దూరంలో ఉన్న పూరి వరకూ మరొక బ్రాంచి రైల్వే లైను ఉంది. పూరిలో చూడదగ్గవి జగన్నాధస్వామి ఆలయం. కుర్దా రోడ్‌ నుండి మరొక 25 కి.మీ దూరంలో ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ వుంది. భువనేశ్వర్‌కు పూరికి మధ్యగా కోణార్క్‌ ఉంది. పూరి నుంచి కోణార్క్‌ 40 కి.మీ. పూరి, కోణార్క్‌ రెండూ సముద్రపు ఒడ్డున వున్న ఊళ్ళు. కోణార్క్‌ నుంచి భువనేశ్వర్‌ 40 కి.మీ. పూరి, కోణార్క్‌, భువనేశ్వర్‌ మూడు ఊళ్ళు ముక్కోణంగా ఉంటాయి. అందువల్ల ఈ మూడు ఊళ్ళను కలిపి 'స్వర్ణ త్రిభుజం' (గోల్డెన్‌ ట్రయాంగిల్‌) అని పిలుస్తారు. కోణార్క్‌లో సూర్యదేవాలయం ప్రసిద్ధి చెందిన యాత్రాస్థలం.


జగన్నాధుడు

భువనేశ్వర్‌లో చాలా ఆలయాలున్నాయి. ఇందులో బాగా ప్రసిద్ధి పొందినది లింగరాజు ఆలయం కాగా ముక్తేశ్వర్‌ ఆలయం, రాజారాణి ఆలయం మొదలైనవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ భువనేశ్వర్‌కు ఒక చివరన వున్నాయి. నగరానికి పూర్తిగా రెండవ చివర ఉదయగిరి, ఖండగిరి అనే క్రీస్తు పూర్వంనాటి బౌద్ధ, జైన గుహలు ఉన్నాయి. భువనేశ్వర్‌ నుండి కోణార్క్‌ వచ్చే దారిలో 'ధాళి' అనే చోట అశోకుడు నిర్మించిన చిన్న బౌద్ధ స్థూపం ఉంది. పూరి నుండి ఉదయమే బయలుదేరి కోణార్క్‌, భువనేశ్వర్‌ చూపించి సాయంత్రానికి తిరిగి తీసుకువచ్చే ప్యాకేజీ టూరులు ఉన్నాయి. ఇలాంటి ప్యాకేజీలే భువనేశ్వర్‌లోనూ ఉన్నాయి. కుర్దా నుండి పూరి వెళ్ళే రైలు మార్గంలో 'సాక్షి గోపాల్‌' అనే స్టేషన్‌ ఉంది. ఆ వూరిలో ఉన్న సాక్షి గోపాల్‌ ఆలయంలో నిలువెత్తువున్న శ్రీకృష్ణ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది.


మూలం: 22-May-2009, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: