telugudanam.com

      telugudanam.com

   

తిరువణ్ణామలై

తిరువణ్ణామలై

తమిళనాడులో ఉన్న అతి పెద్ద దేవాలయాలలో తిరువణ్ణామలై ఆలయం ఒకటి. అంతేకాదు, అద్భుతమైన శిల్పసౌందర్యం ఉన్న ఆలయాలలో కూడా ఇది ఒకటి. కాట్పాడి నుంచి విల్లిపురం వరకూ ఉన్న బ్రాంచి రైల్వే లైనులో సరిగా మధ్యగా తిరువణ్ణామలై ఉంది. అదిగాక అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి తిరువణ్ణామలైకి సరాసరి వెళ్ళే బస్సులు ఉన్నాయి. రైల్వేస్టేషను, బస్‌స్టాండ్‌ నుంచి ఆలయం సుమారు రెండు కి.మీ దూరంలో ఉంది. ఆలయం ఊరు మధ్యగా మెయిన్‌రోడ్డుకి దగ్గరగా ఉంది. ఆలయం ఎదురుగాఉన్న వీధిపొడవునా అందరికీ అందుబాటులో ఉండే లాడ్జిలు చాలా ఉన్నాయి.

పంచభూత తత్వ లింగాలు ఉన్న క్షేత్రాల్లో ఈ తిరువణ్ణామలై ఒకటి. శివుడు పంచధాతువులలో ఒకటైన తేజో(అగ్ని) రూపంగా ఇక్కడ వెలసి ఉన్నాడని స్థల పురాణం వివరిస్తుంది. ఆలయాన్ని ఆనుకుని వెనకాలే ఒక మాదిరి ఎత్తు ఉన్న కొండ ఉంది. శివుడు వెలసినది ఆ కొండ మీదే. ఆ కొండ మొత్తం శివుని తేజోస్వరూపము. అందువల్ల ఆ కొండకు అరుణాచలమని, స్వామికి అరుణాచలేశ్వరుడని పేరు. విశ్వాసం ఉన్నవారు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.


మూలం: 06-Feb-2009, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: