telugudanam.com

      telugudanam.com

   

మీరు-మీపాదాలు

పాదాలు

మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి. శరీరంలో ఇతర అంగాలలాగే పాదాలకు అన్ని నిర్మాణం సక్రమంగా లేకపోతే మోకాళ్ళు, నడుము, వీపు, మెడ అన్నీ దెబ్బతింటాయి. వాటి పనులు అవి సరిగా నిర్వర్తించవు. మీ పాదాలను ఎంత జాగ్రత్తగా సంరక్షించుకుంటే అంత భద్రత, ఎక్కువ లాభం మీకు దక్కుతుంది.మీ అవసరానికి తగినట్లుగా మీ పాదాలకు పాదరక్షలు, బూట్లు ఉపయోగించండి. వాటివల్ల సౌకర్యం కలగాలే గాని ఇతర బాధలు కలుగకూడదు. షూలు కోనేటప్పుడు అవి సులభంగా వంగే సౌలభ్యత తేలుస్తుంది. వంగకుండా చాలా గట్టిగా ఉంటే వదిలేయండి. వేరే తీసుకోండి. దళసరిగా క్రింది రబ్బరు ఉంటే పాదానికి గట్టిదెబ్బలు తగలవు, మంచి రక్షణనిస్తాయి.

వంకీలు తీరి ముడతలు ముడతలుగా ఉంటే దెబ్బను బాగా తట్టుకుంటాయి. నడిచేటప్పుడు మంచి నట్టు ఇస్తుంది. మడమ వదులుగా ఉంటే హీల్ లైనర్ అమర్చండి. సాదారణంగా రబ్బరు, ప్లాస్టిక్ జోళ్ళు కంటే చర్మం, కాన్వాసు బూట్లు ఉత్తమమైనవి. పాదాలకు 4వ వంతు లీటరుదాకా చమట పడుతుంది. ఈ తడి అంతా షూ పై భాగం సూక్ష్మరంధ్రాలలోకి పోయి ఆరిపోవాలి. కాకపోతే సాక్సు చమ్మని పీల్చుకోవాలి. సాదారణంగా చర్మపు షూలు, కాన్వాసు షూలు అయితే పాదాలకు బాగా గాలి తగలడానికి అవకాశం ఉంటుంది. పాదాలకు తగిన సాధన అవసరం. నడవడం పాదాలకు మంచి సాధన.వ ట్టి కాళ్ళతో నడవడం ఎంతో మేలు. పరుగెత్తడం కూడా మంచిదే. కాళ్ళకు ప్రత్యేకంగా రన్నింగ్ షుస్ ీసుకోండి. టెన్నిస్ షూలు మాత్రం వేసుకోవద్దు. మాములుగా మెత్తని రోడ్ల మీద, గడ్డి మైదానాలలోను పరుగెత్తడం చాల ఆరోగ్యకరం. పాదాలకు, మడమలకు, కీళ్ళకు దెబ్బలు తగలడానికి ఆస్కారం ఉండదు. పక్క మీద పడుకోని, పడక కుర్చీలో, కారులో, విమానంలో కూర్చున్నప్పుడు అవలంబించవలసిన మరో అభ్యాసం. కాళ్ళు కదపకుండా ఉన్నచొటునే ఉంచి పాదాలను నాలుగువైపుల తిప్పండి. ఆ తరువాతా పాదాలను సడలించుకోండి. బిగిసిన కండరాలను సడలించుకోడానికి పాదాలను త్వరత్వరగా ఆడించండి.

ఎధ్లట్స్ ఫుట్ సాధారణంగా పాదాలకు కలిగే గొప్ప ఉపద్రవం -వ్రేళ్ళుమద్య దురద, పొక్కులు, చర్మం పగిలిపొవడం, చర్మం పొరలు దేరటం మొదలైనవి. దీనికి ఒకటే చికిత్స. కాలి వ్రేళ్ళు మధ్య భాగా కడిగి చర్మాన్ని శుభ్రంగా పొడిగా ఉంచాలి. ఎక్కువ గాలి, వెలుతురు పాదాలకు తగులుతుంటే పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫంగస్ చేరదు. పాసిపోవు. వట్టి పాదాలతో సంచరించడం చాలా మంచిది. అవసరమైనప్పుడు పలచటి ఆకు చెప్పులు వాడవచ్చు. దీనికి లొంగనప్పుడు పాదాలు పాసిపోకుండా ఉండే ఆంటీఫంగస్ ఆయింట్ మెంట్ వాడండి. ఎధ్లట్స్ ఫుట్ పూర్తిగా పోవడానికి, పాదాలకు పట్టే చెమట బాగా ఆరిపోవడానికి, వీలుగా ఉంటే షూలు ధరించండి. పాదం వేళ్ళు మధ్య ఎప్పుడు చెమ్మలేకుండా పోడిగా ఉంచుకోవాలి. కాలి బొటన వ్రేళ్ళు అవతల ప్రక్కకు వంగిపోవడం సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. సన్నగా ఉంటే షూలను ధరించాలి. బిగుతుగా కాలికి పట్టి వేయకుడదు.

చమట కాళ్ళు పాదలకు విస్తారంగా చమట పోస్తుంది. నీళ్ళు కారతాయి. దీన్ని 'హైపర్ ' డ్రోసిస్ ' అంటారు. ఇది 'బ్రొమిద్రాసిస్ ' అనే మరో రోగాన్ని కూడా కలిగిస్తుంది వీటిని నివారించుకోడానికి పాదాలు ఎప్పట్టికికప్పుడు శుభ్రంగా కడుగుకోవాలి. సాక్సు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. టాల్కం పౌడరు పాదాలమీద చల్లాలి. గాలి, వెలుతురు ప్రసరించేటట్టు వదులుగా ఉండే పాదరక్షలు ధరించాలి. 'కార్నస్ ' అంటే ఆనెకాయలు మాములుగా పాదాలలో బయలు దేరుతుంటాయి. చర్మం గట్టిపడిపోయి లోపల కాయలు బయలుదేరి నడవలేక రణంగా బిగుతైన షూలు, జోళ్ళు వేసు కోవడం మానుకోవాలి. వీటికి స్వంత వైద్యం చేసుకోడం మొదలుపెట్టవద్దు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయిపోతుంది. వైద్యుని సలహా తీసుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. 'ప్లాంటర్స్ వార్ట్ ' - ఇది కూడ అరికాళ్ళలో సూక్ష్మజీవులవల్ల ఏర్పడుతుంది. దీనికి కూడా సకాలంలో వైధ్యుని సంప్రదించించాలి.

ఎప్పుడు మీ పాదాలను ఆరోగ్యంగా, సౌఖ్యంగా ఉంచుకుంటే జీవితాంతం మీ పాదాలు మీకు సహాయపడతాయి!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: