telugudanam.com

      telugudanam.com

   

నాజూగ్గా ఉండడంకోసం

బాపు బొమ్మలాంటి సన్నని నడుము, తీరైన అవయవ సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.


తప్పనిసరిగా తినాలి...

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది. ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు. కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.

మీల్స్ చార్ట్

బ్రేక్ ఫాస్ట్

లేచిన రెండు లేదా మూడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. రాత్రి భోజనానికి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య ఎనిమిది నుంచి పది గంటల వ్యవధి మాత్రమే వుండాలి. అంతకు మించి వ్యవధి వుంటే అల్సరు వచ్చే ప్రమాదం పొంచి వుంది. సహజంగా బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఇడ్లీ, ఉప్మా, పూరీ, వడ వంటివే ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా కింద ఇచ్చిన వాటిని తీసుకుంటే ఎంత తిన్నా ప్రమాదం లేదు. ఉడికించిన గుడ్డుతోపాటు గోధుమ లేదా జొన్న రొట్టెను ఆకుకూరతో తీసుకోవాలి. కాఫీ, టీల కన్నా వెన్న తీసిన మజ్జిగ లేదా పాలు, యాపిల్ పండు లేదా గుప్పెడు ద్రాక్షా పండ్లు తీసుకోవాలి. గుడ్డు తినడం ఇష్టపడని వారు దానిని కాకుండా మిగతావి తీసుకోవచ్చు. నెయ్యి లేదా నూనె లేకుండా తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్, వెన్న ఏ మాత్రం లేని కప్పు పెరుగు, ఒక ఆరెంజ్. టమోటాలతో తయారు చేసిన శాండ్ విచ్, ఒక అరటి పండు.


లంచ్

మధ్యాహ్నం చేసే భోజనంలో కూడా సమతుల్యం పాటించాలి. రెండు లేదా మూడు చిన్న పుల్కాలు, కప్పు అన్నంలో ఆకు కూరతో చేసిన కూర లేదా పప్పు, రసం, వెన్న లేని పెరుగు తీసుకోవాలి. వీటితో పాటు సలాడ్స్ అధికంగా వుండే విధంగా చూసుకోవాలి.


టీ టైం

మధ్యాహ్నం లంచ్‌కి, రాత్రి డిన్నర్‌కి చాలా తేడా వుంటుంది. అందువల్ల సాయంత్రం నాలుగు లేదా ఐదుగంటల సమయంలో తేలిక పాటి స్నాక్స్ తీసుకోవాలి. ఫ్యాట్ లేని బిస్కెట్లు, లేదా ద్రాక్షా, ఆపిల్, ఆరెంజ్ పండ్లు తీసుకోవాలి.


డిన్నర్

లంచ్‌కి తీసుకున్నట్లయితే చపాతీలు, కూరలతోపాటు మాంసాహారులు ఆవిరి మీద ఉడికించిన మాంసం తీసుకోవచ్చు. రాత్రి భోజనం ముగించిన వెంటనే పండ్లు తింటే ఆహారం తొందరగా అరుగుతుంది.

పై ఆహారపు అలవాట్లను కొనసాగిస్తూనే బరువును ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలి. వ్యాయామం చేస్తున్నా బరువు పెరుగుతుంటే నిపుణుల సలహా సంప్రదింపులతో డైట్ చార్ట్ లో మార్పులు చేసుకోవచ్చు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: