telugudanam.com

      telugudanam.com

   

వైభవంగా తెలుగుదనం ప్రధమ వార్షికోత్సవం

మన సాటి తెలుగు వ్యక్తి తెలుగులో కాకుండా ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు మనం తెలుగులో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందనీ ప్రముఖ రచయిత వడలి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక గీత ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో జరిగిన తెలుగుదనం వెబ్ సైట్ ప్రధమ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈవిధంగా అన్నారు. 1985 నుంచి తెలుగు భాషపట్ల ప్రజల్లో మమకారం తగ్గుతూ వస్తుందనీ, ఈ రోజుల్లో ఇంగ్లీషులో మాట్లాడడం ఒక ఫేషన్ అయ్యిందనీ, తెలుగువాడైవుండికూడా ఎల్లప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడే వ్యక్తి చేత తెలుగులో మాట్లాడించాలంటే అతడు మాట్లాడిన ప్రతిసారీ తెలుగులోనే సమాధానం చెబితే కొన్నాళ్ళకైనా అతడు తప్పకుండా మనతో తెలుగులోనే మాట్లాడి తీరతాడనీ, తెలుగు భాషను ఆవిధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనీ ఆయన అన్నారు. సభా కార్యక్రమానికి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికై అసువులు బాసిన పొట్టి శ్రీరాములు స్మృతికి ఒక నిముషం అందరూ మౌనం పాటించిన అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు.

తెలుగు వారికి వెలుగు తెచ్చిన మహనియులకు పుష్పాంజలి తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు
       
తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు తెలుగు ధనం.కొ.ఇన్ వార్షికోత్సవ వెడుకలు

ప్రముఖ సాహిత్యాభిమాన,'తెనుగు లెంకా తుమ్మల శిష్యులైన కాకరపర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, చరిత్రపట్ల అభిమానాం తగ్గిపోతోందనే ఆందోళన వెలిబుచ్చారు. ప్రాధమిక విద్యా రంగంలో మార్పులు తీసుకురావడం ద్వారా తెలుగును ప్రోత్సహించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషాభిమాని దాశరధి మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం ఇకనైనా నడుంకట్టాలనీ, నిరుద్యోగ యువతకు భాషాపరంగా ఉద్యోగాలను ప్రభుత్వం కల్పిస్తే తెలుగును ప్రోత్సహించినట్లేనని అన్నారు. క్రొత్త పదాలను కనిపెట్టడం ద్వారా భాషా సౌలభ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తెలుగు భాషా వికాసానికి అహర్నిశలు కృషి చేస్తున్న గంగాధర రావు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలుగు భాషా నిరోధకాలుగా తయారయ్యాయనీ, అందువల్ల తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఆయా కళాశాలలకు ఉందని ఉద్ఘాటించారు. పాలనా రంగం మీద ఒత్తిడి తెచ్చి తెలుగు భాషకు ప్రోత్సాహమిచ్చే దిశగా అందరూ కదలాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రముఖ కవి పరవస్తు వెంకయ్య సూరి తెలుగు ప్రజలు ఏనాటికీ తెలుగుదనాన్ని పోగొట్టుకోకూడదనీ, కాన్వెంట్లలో తెలుగు భాషను చిన్నచూపు చూడడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. తెలుదుదనం సైట్ ద్వారా ప్రపంచ దేశాల్లోని తెలుగు ప్రజలకు తెలుగు భాషను అభ్యసించే అతి సులువైన విధానాన్నీ, తెలుగు సంస్కృతినీ, సంప్రదాయాలనూ, సాహిత్యాన్నితెలుగుదనం వెబ్ సైట్ ద్వారా అందిస్తున్న గీతా సంస్థ అధినేత వలివేటి మురలీకృష్ణను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా మురళీ కృష్ణ మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి తోడ్పడేందుకే తెలుగుదనం వెబ్ సైట్‌ను గత ఏడాది నవంబర్ 1వ తేదీన స్థాపించడం జరిగిందనీ ప్రస్తుతం 60 దేశాలలోని తెలుగు ప్రజలు ప్రతి రోజూ ఈ సైటును దర్శిస్తున్నారనీ, వారికోసం ఇప్పటికే పండుగలు చేసుకునే విధానాలు, మహిళలకు వంటలు తదితర అంశాలు, చిన్న పిల్ల కోసం అనేక నీతి శతకాలు, ఇంకా అందరికోసం ఉపయోగపడే పలు వినోద, విజ్ఞానాత్మక సాహిత్యాన్ని ఇందులో పొందుపరిచామనీ లాప్‌టాప్ కంప్యూటర్ ద్వారా ప్రదర్శించి చూపారు. అంతేకాకుండా తెలుగు భాష పునర్వైభవానికి తమ వంతు కృషి చేస్తామని సభాముఖంగా చాటారు. అనంతరం అతిధులను జ్ఞాపికలతో సత్కరించారు.


మరిన్ని వివరాలకు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: