telugudanam.co.in

      telugudanam.co.in

   

స్వాగతం! సుస్వాగతం!!

తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది.

తెలుగు ప్రజలకోసం ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న శుభ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల తెలుగువారి కోసం ఈ "తెలుగుదనం.కో.ఇన్ [ telugudanam.co.in ]" అనే వెబ్ సైట్‌ను, 1 నవంబర్ 2006న, ఆవిష్కరించాం. [ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ]

తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".

ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".

తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".

'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికీ "తెలుగుదనం".

వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం".

తెలుగువారి కాలక్షేపం కోసం మేము చేస్తున్న చిరు ప్రయత్నమిది. కోటికి ఒక తెలుగు సైటు కూడా లేని ఈ పరిస్థితిలో మన ఈ "తెలుగుదనం" అందరికీ ఎంతో కొంత వుపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ "తెలుగుదనం"కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల పట్టణమునుండి మేము ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాము. క్రమం తప్పకుండా క్రొత్త క్రొత్త విషయాలను చేరుస్తూ మన ఈ "తెలుగుదనం"ను ఎప్పుడూ తాజాగా ఉంచుతూ, అలానే పెరుగుతూపోయే సమాచార స్రవళితో దీనిని ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా, ఎనలేని తెలుగు భాషా నిధిగా తీర్చి దిద్దాలనేది మా ఆకాంక్ష. మీలా ఎందరో మహానుభావుల సూచనలు, సలహాలు అవసరం. తీసుకుంటున్నాము, గర్వము చేరనీయకుండా తీసుకుంటాము. తెలుగు భాషకు, తెలుగు తల్లికి, సాటి తెలుగువారందరికోసం చేస్తున్న ఈ కృషిలో ఏమైనా పొరపాట్లుంటే సహృదయంతో తెలియజేయమని అభ్యర్దిస్తున్నాము. ఇక్కడ పొందుపరచిన విషయాలేమైనా ఎవరికైనా అభ్యంతరమైనయెడల మాకు తెలియజేయండి. తగు చర్యలు చేపడతాము.

మా ఈ "తెలుగుదనం" సందర్శించినందుకు ధన్యవాదములు.



ఇట్లు,

సహచరులతో కలిసి

మురళీ కృష్ణ వలివేటి

____________________________________________________________________________________________________

గీతా బృందం

గీతా లోగో
ప్రధాన కార్యాలయము

13-5-15, వి.యం.గాంధీ బిల్డింగ్స్,

వీర రాఘవ పేట,

చీరాల - 523155,

ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

( (91) (8594) 220022.

ఈ మెయిల్:
editor@telugudanam.co.in, webmaster@telugudanam.co.in
       
మురళీకృష్ణ వలివేటి జయశ్రీ వలివేటి కృపాకిరణ్ నందమూడి సునీల్‌బాబు వాసె
మురళీకృష్ణ వలివేటి, ఎం.టెక్

(+91-98856-19996

murali.valiveti@geta.co.in
జయశ్రీ వలివేటి, బి.ఏ.

(+91-98856-04446

jayasri.valiveti@geta.co.in
కృపాకిరణ్ నందమూడి, బి.ఏ

(+91-99855-92223

kiran.nandamudi@geta.co.in
సునీల్‌బాబు వాసె, (బి.ఏ.)

(+91-90302-35885

sunil.vase@geta.co.in
మురళీకృష్ణ వలివేటి      
ప్రశాంతి కొత్త

(+91-92973-53230

prasanthi.kotha@gmail.com
     
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: