telugudanam.com

      telugudanam.com


రాబోవు కార్యక్రమాలు
     
సామెత: రౌతుకొద్దీ గుర్రం.

మంచిమాట: సలహా ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం తీసుకోవడమే కష్టం.

నీతి కథ : ఒంటికన్ను దుప్పి [ వివరాలకు... ]

మహనీయ వ్యక్తి: లాల్ బహదూర్ శాస్త్రి [ వివరాలకు... ]

ఆట : బొంగరాలు [ వివరాలకు... ]

తెలుగు సైటు: తెలుగు వెబ్ సైట్ [ వివరాలకు... ]
తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

గాంధీ పుట్టిన దేశమా ఇది

శాతవాహనుల్ వంశాన పుట్టినవాడు
గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా || గాంధీ ||
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదులు జీవజలాలు ఉపు సమురాల పాలు
యువకుల శక్తిని భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు || గాంధీ ||
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ
అధికారంకై తగవులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం ఏమవుతుంది దేశం || గాంధీ ||
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలను లైసెన్సు
అర్హతలేని ఉద్యోగాలు లంచం యిస్తే ఓయస్
సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు
ప్రేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లదే భోజ్యం || గాంధీ ||
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: