telugudanam.com

      telugudanam.com

   

పెద్దల ఆటలు (కొన్ని)

దాడి

ఈ ఆటను ఇద్దరు ఆడతారు. ఒకరు 11 చింతపిక్కలు, మరొకరు 11 చిన్న గులకరాళ్ళు లేదా పుల్లతో ఈ ఆట ఆడాలి. ఎలాగైనా 3 జంక్క్షన్లలో గులకరాళ్ళు గానీ చింతపిక్కెలుగానీ పెట్టగలిగితే అతనికి ఒక 'దాడీ అవుతుంది. ఎదుటఆటగాడికి చెందిన పిక్కలను ఇతను తీసేయవచ్చు. ఇలా ఎన్ని 'దాడీ లైతే వారికి ఎడ్వాంటేజ్ ఉంటుంది'. జంట దాడిలు కనక పెట్టుకోగలిగితే అవతల ఆటగాడు తన పిక్కలను కోల్పోయినట్టే.

దాడి
[ వెనుకకు ]


బెలూన్ పగలగొట్టే ఆట

ఈ ఆట చాలా సరదాగా ఉంటుంది. దీనికి కావలసిందల్లా బూరలు, దారం మాత్రమే.

పాల్గొనే వారందర్నీ రెండు గ్రూపులుగా విడదీయాలి. ఇప్పుడు మొదటి గ్రూపువారికి బూరని ఊది గట్టిగా ముడివేసి ఒక మూర దారం వదిలి తెంపి కాలిబొటనవేలికి కట్టుకోమనండి. అలా మొదటి గ్రూపు వారందరూ చేసిన తరువాత హాలు మధ్యలో రౌండ్ గీయండి. గీసిన రౌండ్ లో బూర కట్టుకొన్న వారిని ఒకరిని నుంచోమనండి. తరువాత రెండో గ్రూపు వారి నుంచి ఒకరిని వచ్చి నుంచోమనండి. ఆట ఏమిటంటే రౌండు లోనే ఇద్దరూ ఉండాలి. బూరకట్టుకొని ఉన్నవారు బెలూనును కింద ఆనించి తీస్తూ ఉండాలి. ఆనించినప్పుడు అవతలివారు చాలా షార్ప్ గా బెలూన్ ని పగలగొట్టాలి. ఇది ఒక్కనిముషంలో జరగాలి. పగలగొడితే మార్కులు లేదా జీరో, ఇలా ఇద్దరిద్దరి చేత పగలగొట్టించాలి. అందరూ అయిపోయిన తరువాత ఇదే పద్దతిలో రెండో గ్రూపువారి చేత ఆడించాలి. అందరూ అయిపోయిన తరువాత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ గ్రూపు గెలిసినట్లు.


[ వెనుకకు ]


మాచింగ్ అవుట్

ఈ ఆటలో ముందుగా చిన్న చిన్న కాగితాల మీద జనరల్ గా ఆడవారు పెట్టుకొనే వస్తువుల పేర్లు వ్రాయాలి.

ఉదా:మట్టిగాజులు, స్టిక్కర్, తిలకం, కుంకుమ, నల్ల పూసలు, లిప్ స్టిక్, ముత్యాలదండ, పగడపు ఉంగరం, ముత్యపు ఉంగరం, మాటీలు, వెడల్పు గాజులు, సన్న గాజులు, లక్ష్మీదేవి ఉంగరము, చీరల రంగులు రాసుకోవచ్చు. ఇలాంటి కాగితం ముక్కలపైన రాసి మడత పెట్టి ఉంచాలి. ఆట ఏమిటంటే ఒక్కొక్కరి చేత ఆ పేపర్ స్లిప్ తీయించాలి. ఆ స్లిప్ లో రాసినది కనక వారు వేసుకొని వుంటే వారు అవుట్. అలా ఒక్కరు ‌మిగిలేంత వరకు తీయించి చివరగా మిగిలిన వారిని‌ విన్నర్స్ గా ప్రకటించటమే.

గమనిక:స్లిప్ చూసిన తరువాత మళ్ళీ ఆ స్లిప్ని మడత పెట్టి గిన్నెలో స్లిప్తో కలిపి మళ్ళీ తీయించాలి.


[ వెనుకకు ]


మూడుభాషల ఆట

ఈ ఆటలో పాల్గొనేవారందరినీ రౌండ్ గా కూర్చోమని చెప్పాలి.

ఆట ఏమిటంటే ఎవరో ఒక మెంబరు దగ్గర నుంచి మొదలు పెట్టి వారిని ఒకటి, తరువాత వారిని టు, మూడో వారిని తీన్ అని చెప్పుతూ 20 నెంబర్స్ చెప్పించి మళ్ళీ మొదటినుంచి నెంబర్స్ మొదలుపెట్టి కంటిన్యూ చేయమనాలి. ఈ విధంగా అందరి చేతా చెప్పించేటప్పుదు గనక ఎవరైనా అంకె తప్పు చెప్పినా, భాష తప్పు చెప్పినా వారు ఓడిపోయినట్లే అలా కంటిన్యూ చేసి చివరగా మిగిలిన వారిని గెలిచినట్లుగా ప్రకటించాలి.


[ వెనుకకు ]


వైకుంఠపాళి

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు
కావలసిన వస్తువులు : పరమపద సోపానం ఇది జనరల్ షాపులో లభిస్తుంది, చింతపిక్కలుగాని, గవ్వలుగాని

పరమపద సోపానం ఈ చార్టు నిండా గడులుంటాయి. పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆటగాళ్ళకు సంబంధించిన పిక్క పాము గళ్ళలోకి వేళ్తే చనిపోయి, ఆ పాములు ఏ గదిలోకి జారివుందో ఆ గడికి దిగిపోతుంది. అదే నిచ్చెన మొదలు ఉన్న గదికి చేరితే ఆ నిచ్చెన ఎన్ని పై గడులకు చేరిందో అక్కడకు ఎక్కి వెళ్ళిపోతుంది. ఇలా పాములను తప్పించుకుంటూ, నిచ్చెనల సహయంతో ముందు స్వర్గాన్ని చేరిన వారు విజేతలు.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: