telugudanam.com

      telugudanam.com

   

పెద్దల ఆటలు (కొన్ని)

పదంలో పదం

ఈ ఆటకి ముందుగా రడీ చేసుకోవాల్సిన అవసరం వున్నది. ఈ ఆట ఏమిటంటే మనం తెలుగులో రెండు ఇంగ్లీష్ పదాల అర్థాలు వచ్చేట్లు వాక్యం ఇస్తే ఆట ఆడేవారు రెండు ఇంగ్లీష్ పదాలను వ్రాయాలి. అది కూడా ఆట నిర్వహించేవారు ఇచ్చే వాక్యంలోని రెండు ఇంగ్లీష్ పదాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. అదే పదంలో పదం. ఉదాహరణకి ఇక్కడకొన్ని ఇస్తున్నాము. ఆట నిర్వహించేవారు పదాలను అదే విధంగా తయారు చేసుకొని కండెక్ట్ చేయాలి.

తెలుగు English
మందులో కంబళి - Drug- rug
గుండెలో కళ - Heart - art
అక్కడలో ఇక్కడ - There - here
కుర్చీలో జుట్టు - Chair - hair
వ్యక్తపరచడంలో ముద్రణ - Expression - press
అవసరంలో చీమ - Want - ant
జైల్‌లో కొడుకు - Prison - son
చల్లదనంలో ముసలితనం - Cold - old
మామిడి పండులో మనిషి - Mango - man
సంవత్సరంలో చెవి - Year - ear
కిరీటంలో కాకి - Crown - crow
రంగులో నొప్పి - Paint - pain
మరలాలో లాభం - Again - gain
పద్నాలుగులో నాలుగు - Fourteen - four
గడ్డంలో జంతువు - Beard - bear
గ్రహంలో వల - Planet - net

కాబట్టి ఆట నిర్వహించేవారు మాత్రం వాక్యాలను ముందుగా తయారుచేసుకొని ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చి పేపరు తయారు చేయాలి. వీటిని జిరాక్సు తీసి అందరికీ ఇచ్చి ఒక్కనిముషములో అందరినీ వ్రాయమని చెప్పాలి. మాములుగానే ఎవరు ఎక్కువ వ్రాయగలిగితే వారే గెలిచెనట్లు.


[ వెనుకకు ]


టీ ఆట

ఈ ఆటకి ఆట నిర్వహించేవారు ముందుగానే కొన్ని వాక్యములు క్రింది విధంగా తయారు చేసుకోవాలి. ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇస్తున్నాము. వ్రాయగలిగినవారు ఇంకా ఫ్రేం చేసుకోవచ్చు.

ఉదా:

అన్ని రంగాలలో ఉండే టీ - పోటీ
పండ్లరసంలో ఉండే టీ - ఫ్రూటీ
ఆఫీసులో ఉండే టీ - డ్యూటీ
అందమైన టీ - బ్యూటీ
పోలీసు వాడే టీ - లాటీ
మురుకిగా ఉండే టీ - డర్టీ
రాత్రిళ్ళు తినే టీ - రోటీ
ఏనుగును తోలే టీ - - మావటి
రాత్రిళ్ళు వేసుకొనే టీ - నైటీ
చల్లని ప్లేస్ ఉండే టీ - ఊటీ
హైదరాబాద్ ‌లో ఉండే టీ - కోటీ
దొంగలు చేసే టీ - లూటీ
డబ్బులు కట్టే టీ - చీటీ
అత్తలో ఉండే టీ - అంటీ
ఆఫీసు టైము అయిన తరువాత చేసే టీ - ఓటీ

పైన చెప్పిన విధంగా ఇంకా మీరు ఫ్రేం చేసుకొని అన్నింటిని వైట్ పేపర్లో వ్రాసి ఎదురుగా ఖాళీలు పెట్టి ఆ పేపర్ని మీ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరికీ జీరాక్స్ తీయించి ఇవ్వాలి. వారి పేరు పైన వ్రాసి వుంచమనాలి. టైం స్టార్ట్ చెప్పిన ఒక్క నిముషములో అన్నీ ఖాళీలను నింపాలి. సమాధానాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి సమయం అయిన తరువాత అన్నీ పేపర్స్ తీసుకొని కరెక్ట్ చేయాలి. టైం మాత్రం ఒక్కటి లేదా రెండు నిముషాలు పెట్టుకోవాలి. అది ఆట నిర్వహించేవారి ఇష్టం. అన్నీ కాగితములు తిసుకొన్న తరువాత ఎవరు ఎక్కువ సరి అయిన సమాధానాలు వ్రాస్తారో వారే గెలిచినట్లు.


[ వెనుకకు ]


Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: