telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

తాడాట

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు
కావలసిన వస్తువులు : తాడు

ఈ ఆటలో రెండు గ్రూపులుంటాయి. రెండుగ్రూపులు విడిపోయి మధ్యలో ఒక గీత గీస్తారు. ఒక పెద్ద తాడును తెచ్చి అటూ-ఇటూ పట్టుకోవాలి. మధ్యలో గీత ఉంటుంది. అటొక గ్రూపు, ఇటొక గ్రూపు చేతులతో బలాన్నిఉపయోగించి దాన్ని లాగాలి. ఎవరు ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే వారి వైపు తాడు వచ్చేస్తుంది. దాంతో పాటు అటువైపు ఉన్న గ్రూపు వాళ్ళు కూడా వచ్చేస్తారు.

తాడు లాగేటప్పుడు ఈ పాట పాడతారు.

"అ-హద్దిరిబన్న, అ-హైలేసా"

అ- హద్దిరిబన్న, అ- హైలేసా"

అంటూ తాడు లాగాలి.

చివరిదాక తీసుకెళ్ళి అక్కడ దించాలి. ఇప్పుడు రెండవ బాలుడు, తర్వాత మూడవ బాలుడు ఇలా వూరేగుతారు.


[ వెనుకకు ]

తెలుగు పదాల ఆట

ఎంతమంది ఆడవచ్చు : నలుగురు
ఆడే స్థలం : గదిలో
ఆటగాళ్ళ వయసు : 8 సంవత్సరాల పైన

ముందు పిల్లలంతా ఒక గదిలో కూర్చోవాలి. నిమిషం టైంలో ఒక్కొక్క అక్షరంతో తమకు తెలిసినన్ని పదాలు రాయాలి.

ఉదా: "అ" అక్షరం మీద పేర్లు రాయవలసిన బాలుడు/బాలిక ఇలా రాయాలి. అరవింద్, అక్క, అత్త, అమ్మ, అల .... ఈ విధంగా నిమిషం గడువులోగా సాధ్యమైనన్ని ఎక్కువ పేర్లు రాయాలి. ఒక రౌండ్లో తక్కువ పేర్లు రాసిన వారు ఔట్ అయిపోతారు. మరల ఆట ప్రారంభమవుతుంది. ఈసారి ఇంకో అక్షరంపై రాయాలి. ఇలా ప్రతి ఆటలోనూ ఒక పిల్లాడు బయటకు వచ్చేస్తాడు. చివరగా మిగిలిన బాలుడు / బాలిక విజేత.


గమనిక : పిల్లలు రాయవలసిన మొదటి అక్షరాన్ని ఓడిపోయిన వ్యక్తి చెబుతుండాలి. ఆ ప్రకారమే రాస్తుండాలి.


[ వెనుకకు ]

తొక్కుడు బిళ్ళ

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు.
కావలసిన వస్తువులు : చిన్న రాతి పలక బిళ్ళ.

ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు నిలుచోవాలి. ముందుగా ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండవ గడి, తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను దాటించాలి. జాగ్రత్త! ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల గీతలను తాకరాదు. గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి.అలాగే కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి. తరువాత తలపై పెట్టుకొని దాటాలి. తరువాత అర చేతిలో, ఆపై మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి. తరువాత బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది. మధ్యలో గీత తొక్కితే ఒకటి రెండు గడులు బాలికవి అవుతాయి. మిగతా బాలికలకు అప్పుడు ఆడటం కష్టమవుతుంది.


[ వెనుకకు ]

దాడీ ఆట

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు ఆడవచ్చు
కావలసిన వస్తువులు : 11 చింతపిక్కలు, 11 చిన్న గులకరాళ్ళు

ఒకరు 11 చింత పిక్కలను, మరొకరు 11 చిన్న గులక రాళ్ళు లేదా పుల్లలతో ఈ ఆట ఆడాలి. ఎలాగైనా 3 జంక్షన్లలో ఎదుట ఆటగాడికి చెందిన పిక్కలను ఇతను తీసివేయవచ్చు. ఇలా ఎన్ని "దాడి" లైతే వారికి అనుకూలంగా ఉంటుంది. జంట దాడిలు కనుక పెట్టుకోగలిగితే అవతల ఆటగాడు తన పిక్కలను కోల్పోయినట్టే.


[ వెనుకకు ]

ద్రాక్షాపండు తియ్యానా? పుల్లనా? నాకేం తెలుసు

ఎంతమందికావాలి : 10మంది.
ఆటగాళ్ళ వయస్సు : 7సంవత్సరాల వయస్సు పై ఉండాలి.
ఆడేస్థలం : ఆరుబయట.

ముందుగా ఇద్దరు బాలురు / బాలికలు తమ పేర్లు ఏదైనా పండ్ల పేరు పెట్టుకోవాలి.

ఉదా: ఒకరు ఆపిల్ పండు, ఇంకొకరు దానిమ్మ పండు అని పేరు పెట్టుకోవాలి. తర్వాత ఇద్దరూ చేతులు పైకెత్తి పట్టుకొని ఇంటి టాప్ లా చేసి నిలబడి ఈ ఇద్దరి చేతుల కింద నుంచి నడుస్తారు. ఆపిల్ పండు బాలుడు, దానిమ్మ పండు బాలుడు ఇద్దరూ ఇలా పాట పాడుతారు. "ద్రాక్షా తియ్యనా? పుల్లనా ? నాకేం తెలుసు! నీకేం తెలుసు!! ఇద్దరికి తెలియదు. అందుకు ఆఖరున వచ్చే పిల్లను పట్టుకొని అడుగుదాం" అని చివర వచ్చే వారిని పట్టుకోవాలి. అతన్ని పక్కకు తీసుకెళ్ళి దానిమ్మ కావాలా? ఆపిల్ కావాలా? రెండిటిలో ఏమికావాలి? అని అడగాలి. ఆ పిల్లాడు తనకు ఇష్టమైన లేదా ఆపిల్ లేదా దానిమ్మపండ్లలో ఏదో ఒకటిని కోరుకుంటాడు. వెంటనే మిగతా పిల్లలంతా ఎవరికే పండ్లు కావాలో నిర్ణయించుకొని రెండు గ్రూపులుగా విడిపోతారు. తరువాత ఒక అడ్డగీత గీసి ఆ గీతకు అటు ఇటూ నిలబడి చేతులు కలిపి బలంగా లాగుతారు. ఎవరు బలాన్ని ఉపయోగిస్తే వారు గెలిచినట్టే.


[ వెనుకకు ]

నుంచోవడం - కూర్చోవడం

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు
ఆడే స్థలం : ఎక్కడైనా

ఈ ఆట ఎంతమందైనా ఆడవచ్చు. పిల్లలను ఒక గదిలో నించోబెట్టాలి లీడర్ వారి కెదురుగా కుర్చీలో కూర్చోని స్టాండ్, సిట్ లు చెబుతుండాలి. స్టాండ్, చెప్పినప్పుడు నించోవడం సిట్ చెప్పినప్పుడు కూర్చోవడం చేస్తూండాలి. స్టాండ్, సిట్ లు చెబుతూ ఒక్కోసారి స్టాండ్ ను రెండుసార్లు, మూడు సార్లు చెప్పాలి. పిల్లలు ఆటలో నిమగ్నమై స్టాండ్ తర్వాత సిట్ చెబుతారని కూర్చుంటారు. దాంతో దొరికిపోతారు. వారు ఓడిపోయినట్టే మరల అందరికి స్టాండ్, సిట్ చెప్పాలి. ఇలా చివరి దాకా మిగిలిన వారు విజేత. ఈ ఆట వలన పిల్లల్లో చురుకుదనం నడుము కాళ్ళు బలంగా తయారవుతాయి.


[ వెనుకకు ]

బొంగరాలు

కావలసిన వస్తువులు : ఒక బొంగరం, ఒక తాడు

ఒక సర్కిల్రెండు సర్కిల్స్ అనే రెండు రకాల విభాగాలుగా ఈ ఆటను ఆడవచ్చు. బొంగరాలు పచారి కొట్టులో దొరుకుతాయి. అయితే వాటికి సూదిగా ఉండే ఇనుప తీగ వుంటుంది. కాబట్టి ఆటగాళ్ళు అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ బొంగరాల ఆటలో ఎంతమందయినా పాల్గొనవచ్చు. ముందుగా పంటలు వేసి మిగిలిపోయిన ఆటగాడు దొంగవుతాడు. అతని బొంగరాన్ని సర్కిల్ లో వేసి మిగతా ఆటగాళ్ళు తమ బొంగరాలతో అతని బొంగరాన్ని కొడతారు ఇలా ఆట కొనసాగుతుంది.


[ వెనుకకు ]

బొమ్మా - ప్రాణం

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు
ఎక్కడ ఆడవచ్చు : ఖాళీ స్థలంలో

అందరూ పంటలు వేశాక దొంగ అయిన బాలుడు/ బాలిక మిగతా పిల్లల వెంట పడి పట్టుకోవాలి. ఆ పిల్లలు పరుగెత్తి దొంగ తమ దగ్గరకు రాగానే "బొమ్మ" అని చెప్పి బొమ్మలా నిలబడి పోవాలి. దొంగ అతన్ని అంటుకోకుండా మిగతా వారి వెంటపడతాడు. వాళ్ళు అలా పరిగెత్తి తప్పించుకుంటారు. వాళ్ళు పరుగెత్తుతూ ఇంత క్రితం బొమ్మలా నిలబడిపోయిన వారిని తట్టి ప్రాణం అనగానే అతను పరుగెత్తవచ్చు. దొంగ బాలుడు ఎవరిని పట్టుకుంటే అతను దొంగ అవుతాడు. ఇలా ఆట రొటేషన్ అవుతుంది. ఒక వేళ అందరూ బొమ్మలు అయిపోతే మొదట బొమ్మలా నిలబడిన వారు దొంగవుతారు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: