telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

నాలుగు స్తంభాలాట

ఆడే స్థలం : స్తంభాలున్న చోట
ఆటగాళ్ళ వయస్సు : 6 నుండి 8 సంవత్సరాల మధ్య
పోటీ సమయం : 10 నిమిషాలు

ఈ ఆటలో అయిదుగురు పిల్లలు ఆడాలి. ముందుగా పంటలేసుకుంటే ఒకరు దొంగగా మిగులుతారు. మిగతా పిల్లలంతా దగ్గరవున్న స్థంభాలను పట్టుకుంటారు. దొంగ స్థంభాల చుట్టూ తిరుగుతుంటాడు. పిల్లల స్తంభాలను మారుతూ ఉండాలి. స్తంభాలను పట్టుకున్నపుడు పిల్లలు అవుటయిపోరు. స్తంభాలను విడిచినప్పుడే అవుటవుతారు. కాబట్టి వేగంగా పరిగెట్టి స్తంభాలను అంటుకోవాలి. ఎవరిని మధ్యలోనే దొంగ అంటుకుంటాడో అతను దొంగవుతాడు. దొంగ స్తంభాలను చేరి ఆడుతుంటాడు. ఇది ఆట. ఇలా సాగుతూ ఉంటుంది. దాదాపు 30 నిమిషాలసేపు ఈ ఆట ఆడవచ్చు.


[ వెనుకకు ]

ఖాళీల పూరింపు

చిన్న పిల్లకు ఖాళీలను పూరించటమంటే చాలా ఇష్టం అందుకని చిన్న పిల్లల ఆటలో ఈ ఖాళీల పూరింపును కూడా చేర్చాము. ఈ ఆటలో కనీసం నలుగురు పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక అక్షరానికి సంబంధించిన పదాలు ఇవ్వాలి. ఆటగాళ్ళు ఎ, బి, సి, డి లనుకుంటే వాళ్ళకు ఇచ్చిన ఖాళీల పూరింపు ఇట్లా ఉంటుంది. ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత.

    బి   సి   డి
 

గ (అక్షరం)

- - ట

- డి - రం

- - ళం

- - నిక

- - భం

 

క (అక్షరం)

- - ద

- - హం

- - కం

కా - రి

- ను -

 

న (అక్షరం)

- - న

- - నం

- వ - తం

- ర్త - - ల

- వ - గ్

 

వ (అక్షరం)

- స్తు -

వం - ర

వం - య

వ - సు

వని -

 

సమాధానాలు

    బి   సి   డి
 

గంట

గడియారం

గరళం

గమనిక

గార్ధభం

 

కంద

కలహం

కనకం

కావేరి

కానుక

 

నవీన

నందనం

నవనీతం

నర్తనశాల

నవరంగ్

 

వస్తువు

వంకర

వంకాయ

వయసు

వనిత

 

[ వెనుకకు ]

ఢీ...ఢీ...ఢీ...

ఈ ఆట ఇద్దరు ఆడతారు. ఎదురుబొదురు నిలుచుని ఆడాలి. ఇద్దరు చేతులు రెండు జోడించాలి.

ఇలా పాట పాడాలి.

ఢీ... ఢీ...ఢీ అని ఇద్దరూ తమ జోడించిన చేతులను తాకించి, పైన, కింద తాకించాలి.

పైన కొట్టు, కింద కొట్టు

రైటు కొట్టు, లెఫ్ట్ కొట్టు

పండే కొట్టు, పచ్చే కొట్టు... అని

చివరిలో ఒకరికొకరు వెక్కిరించుకోవాలి.


[ వెనుకకు ]

చుక్కలాట

ఈ ఆట ఇద్దరు ఆడవచ్చు. ముందుగా అడ్డంగా నిలువుగా కలిపి పైన చూపినట్టు 100 చుక్కలు పెట్టుకోవాలి. తరువాత ఒక ఆటగాడు ఒక చుక్క నుండి ఇంకొక చుక్కకు ఒక గీతను గీయాలి. తరువాత మరొక ఆటగాడు తన ఇష్టమొచ్చిన దగ్గర గీత గీస్తాడు. ఇవి నిలువుగానైనా, అడ్డంగానైనా ఎలా అయినా గీయవచ్చు. అయితే ఏ ఆటగాడు వాటిని (స్క్వేర్) చతురస్త్రంలాగా గీస్తాడో, ఆ చతురస్త్రం (బాక్స్)లో అతని పేరు మొదటి అక్షరాన్ని వేయాలి. మొత్తం మీద ఎవరు ఎక్కువ చతురస్త్రంలను నింపి తమ పేర్లు రాస్తారో వారు విజేత. ఆట ఆడేవారు టి, బి లు అనుకుంటే వారి పూర్తి చేసిన బాక్స్‌లు పైన వివరించబడ్డాయ


ఉదా:
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .
. . . . . . . . . .


[ వెనుకకు ]

రైళ్ళ పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 15 మంది
ఆడే స్థలం : ఆరు బయట
ఆటగాళ్ళ వయస్సు : 5 నుండి 7 సంవత్సరాల మధ్య

ఈ ఆటలో పదిహేను మంది పిల్లలు కలిసి మూడు టీంలుగా ఏర్పడాలి. అంటే అయిదుగురు ఒక టీం గా ఏర్పడాలి. అందరూ ఒకరి వెనకాల ఒకరు నుంచొని ట్రైన్ లా ఉండాలన్నమాట. 100 మీటర్ల దూరంలో టార్గెట్ గీతను నిర్ణయించాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే మూడు ట్రైన్‌లు కదిలి టార్గెట్ గీతను చేరుకుని తిరిగి వెనక్కిరావాలి. అయిదుగురి టీం గల ఏ ట్రైన్ ముందుగా ప్రారంభ గీతను చేరుకుంటే వారు విజేత. మధ్యలో ఎవరైనా పిల్లల చొక్కాలు వదిలేస్తే అక్కడకు ఆ పెట్టెలను కట్ చేయాలి. అంటే వారు పోటీ నుంచి వైదొలగినట్లే. కాబట్టి ట్రైన్ ఆటలో పాల్గోనే ఆటగాళ్ళు ఒకరి చొక్కా వెనుకభాగం మరొకరు పట్టుకోవాలి.


[ వెనుకకు ]

డేంజర్ మ్యూజిక్

ఎంతమంది పాల్గొనవచ్చు : 10 మంది
కావలసిన వస్తువులు : టేప్ రికార్డర్, ఒక రబ్బరు రింగు
ఆటగాళ్ళ వయస్సు : 4 నుండి 7 సంవత్సరాల మధ్య
ఆడే స్థలం : గదిలో

ఆటగాళ్ళంతా ఒకగదిలో గుండ్రంగా కూర్చోవాలి. వాళ్ళ మధ్య రబ్బరు రింగును ఉంచుతారు. పక్కగదిలో లీడర్ కూర్చొని టేప్ రికార్డర్ ఆన్ చేయాలి. టేప్ రికార్డర్ లో నుంచి మ్యూజిక్ వస్తున్నంతసేపు ఆటగాళ్ళు తమ మధ్య ఉన్న రబ్బరు రింగు నందుకొని ఒకరిమీద ఒకరు విసురుకోవాలి. దాన్నివారు అందుకుని అవతలివారికి విసురుతుండాలి. మ్యూజిక్ ఆపినపుడు అది ఎవరివద్ద ఉంటే వారు అవుటయిపోయినట్టు. మ్యూజిక్ ఆగినప్పుడు రింగును కింద పడేయడానికి గాని ఎదుటి ఆటగాడి మీద పడేయడానికి గాని ప్రయత్నించ కూడదు. అలా చేసే వాళ్ళు అవుటవుతారు. చివరికి మిగిలిన వారు విజేత.


[ వెనుకకు ]

మెదడుకు మేత

ఈ ఆటలు పిల్లల బుద్దిబలాన్ని వికసింపచేస్తాయి. ఈ ఆటను ఎంతమంది పిల్లలైనా ఆడవచ్చు. ఎవరు ముందుగా పజిల్ పూరిస్తే వారు విజేతలు.రాజుకు సైన్స్‌లో కన్నా హిందీలో ఆరు మార్కులు అదనంగా వచ్చాయి. కృష్ణకు హిందీలో కన్నా సైన్స్‌లో ఆరు మార్కులు అదనంగా వచ్చాయి. సోముకు సైన్స్‌లో కన్నా హిందీలో పదహరు మార్కులు ఎక్కువ వచ్చాయి. సైన్స్‌లో సోము మార్కుల కన్నా రాజు మార్కులు 10 ఎక్కువ. రాజు మార్కులకన్నా కృష్ణ మార్కులు రెండు ఎక్కువ. హిందీలో కృష్ణ మార్కుల కన్నా సోముకు పది ఎక్కువ వచ్చాయి. సోము కన్నా రాజు మార్కులు రెండు తక్కువ ఆ రెండు సబ్జెక్ట్‌లలో సగటున రాజుకు 92, కృష్ణకు 89, సోముకు 88 శాతం మార్కులు వచ్చాయి.

  పేరు   సైన్స్   హిందీ
 

రాజు

కృష్ణ

సోము

 

90

92

80

 

94

86

96

 

ఇలా ఎవరు రాస్తే వారు విజేతలు.


[ వెనుకకు ]

పాటల అంత్యాక్షరి

ఎంతమంది పాల్గొనవచ్చు : ఎంతమందైనా
ఆటగాళ్ళ వయసు : 6 నుండి 10 సంవత్సరాల మధ్య వారు
ఆడే స్థలం : ఆరు బయటగాని, గదిలోగాని

ఈ ఆటను ఎంతమంది అయినా ఆడవచ్చు, ఒక్కరుగా ఆడవచ్చు లేదా గ్రూపులు గ్రూపులుగా ఆడవచ్చు. ఈ ఆట ఆడే వారికి సినిమా పాటలు తెలిసి ఉంటే చాలు. మొదట ఆట నిర్వహించే వారు ఒక అక్షరం చెబితే ఆ అక్షరం మీద మొదటి వారు లేదా మొదటి గ్రూపు వారు పాట మొదలు పెడతారు, తరువాత వారు ముందు వారు ఆపిన పాట చివర అక్షరంతో మొదలు పెట్టాలి, ఇలా ఆడుతూ ఉండాలి. అంటే ఎలా అంటే

ఉదా: ఆట నిర్వహించే వారు 'మ' అనే అక్షరం ఇస్తే, మొదటి వారు 'మ' అనే అక్షరం మీద పాట పాడాలి.

"మౌనం గానే ఎదగ మని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది."

ఇప్పుడు 'ద' అనే అక్షరం మీద రెండవ వారు పాట పాడాలి.

"దాయి దాయిదామ్మా కునికే కుందనాల బొమ్మ నీతో పనివుందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ"

ఇప్పుడు 'మ' అనే అక్షరం మీద తరువాత వారు ఇలా ఆడుతూ ఉండాలి.


మీకు అంత్యాక్షరి ఆడుకోవటానికి పల్లవులు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

[ వెనుకకు ]

క్విజ్

ఈ పోటీలో కనీసం అయిదుగురు పిల్లలు పాల్గొనవచ్చు. తేలికగా అర్ధం చేసుకోగలిగే తేలికపాటి ప్రశ్నలు వేయాలి. వాటి ఉపయోగం చెప్పాలి. లేదా కాగితం పై రాయాలి. అందరికి పలక బలపం లేదా పుస్తకం - పెన్సిల్ ఇవ్వాలి..

ఉదా :

ప్రశ్న సమాధానం
అన్నం తింటారు
రామ్మా చిలకమ్మ చూడాలని వుందిలో పాట
పాలు తాగుతాం
కొబ్బరి నూనె రాసుకుంటాం
టీ.వీ చూస్తాం
రేడియో పాటలు వింటాం
రోడ్డు మీద నడుస్తాం
దువ్వెన దువ్వుకుంటాం
రైల్లో ప్రయాణిస్తాం
స్కూల్లో చదువుకుంటాం

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: