telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

బిస్కెట్ నిధిని చేరుకోవడం

ఆడే స్థలం : స్తంభాలున్న చోట
ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది.
కావలసిన వస్తువులు : పుస్తకాలు, పెన్సిళ్లు, గ్లాసులు, గిన్నెలు, చిన్న చిన్న వస్తువులు.
ఆడే స్థలం : రెండు వైపుల తలుపులుండే గది.
ఆటగాళ్ల వయస్సు : 4 నుండి 6 సం|| రాల మధ్య .
పోటి సమయం : 5 సెకన్లు.

ముందు వెనుకా తలుపులున్న ఒక గదిలో ఈ ఆట ఆడాలి. గది నిండా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, గ్లాసులు, చిన్న చిన్న వస్తువులన్నీ సర్దాలి. అంటే కాలు పెట్టటానికి కూడా వీల్లేకుండా ఉండాలి. రెండవ తలుపు దగ్గర ఒక బిస్కెట్ పెట్టాలి. ఒక్కొక్క ఆటగాడిని ఇవతల తలుపు నుండి లోపలకు పంపాలి. అయితే ఆటగాడు కేవలం కాలి వేళ్ల మీద నడిచి బిస్కెట్ దగ్గరకు చేరుకొని దాన్ని తీసుకోవాలన్న మాట. అరికాలు మొత్తం నేల మీద ఆనితే ఏదో ఒక వస్తువు కాలికి తగులుతుంది. అప్పుడా బాలుడు/ బాలిక ఓడిపోయినట్టే. కనుక కాలివేళ్ళతో నడవాలన్న మాట. ఇందులో ఇంకో షరతు కూడా ఉంది. కేవలం అయిదు సెకన్లలో బిస్కెట్ నందుకోవాలి. ఎక్కువమంది ఓడిపోతే ఒకరిద్దరైన నడిచి బిస్కెట్లను తెచ్చుకోవచ్చు.[ వెనుకకు ]


డిటెక్టివ్ ఆట

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది.
కావలసిన వస్తువు : టవల్.
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయట గాని.
ఆటగాళ్ల వయస్సు : 5 నుండి 7 సం|| రాల మధ్య.
పోటి సమయం : ప్రతి ఆటగాడికి 5 సెకన్లు.

ఆటగాళ్లందరూ కూర్చోవాలి అందరూ పంటలు వేశాక దొంగ అయిన బాలుడు/బాలిక లీడర్ కళ్లు మూస్తాడు. ఈలోగా ఒక బాలుడు లేదా బాలిక మీద టవల్ను కప్పేయాలి. తరువాత దొంగయిన ఆటగాడు అక్కడ కూర్చుని మిగతా తొమ్మిది మందిని పరిశీలించి కేవలం 5 సెకన్లలో మిస్ అయిన ఆటగాడిని కనిపెట్టాలి. అంటే టవల్ కప్పిన ఆటగాడు ఎవరో తెలుసుకోవాలన్నమాట. సరైన సమాధానం చెబితే ఆ ఆటగాడు వచ్చి మిగతా ఆటగాళ్లలో కూర్చోవాలి. దొరికిపోయిన ఆటగాడి దొంగవుతాడు. ఇలా ఆట జరుగుతూ ఉంటుంది.


[ వెనుకకు ]

అక్షరాల గుర్తింపు

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు.
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
ఆడే స్థలం : గదిలోగాని, ప్రయాణంలో గాని, ఆరు బయట గాని.
ఆటగాళ్ల వయస్సు : : 10 సంII రాల నుండి 12 సంII రాల మధ్య.

ముందుగా ఇంగ్లీషు పేపర్లు ఒకే రోజువి సేకరించాలి. అందులోని పదాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని గుర్తించాలి. అంటే ఒకరు ఒక అక్షరాన్ని ఒక పేరాలో ఎన్ని సార్లు వచ్చిందో గమనించి బైటకు బిగ్గరుగా చెప్పాలి. ఆ విషయం చెప్పకపోతే అదే పేపరు పరిశీలిస్తున్న మిగతా అయిదుగురు దాన్ని పసిగట్టి చెబుతారు అప్పుడు అతనికి ఒక పాయింట్ పోతుంది. ఇలా ఆరుగురు ఆటగాళ్లు వరుసగా e, h, i, o, r, c అక్షరాలను పేరాలలో గుర్తుపెట్టి పైకి చెప్పాలి. అన్ని కరెక్టుగా చెప్పిన వారు వేజేతలు.


[ వెనుకకు ]

గెస్ ది లాస్ట్ నెంబర్

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు.
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
పోటి సమయం : అవసరాన్ని బట్టి.
ఆటగాళ్ల వయస్సు : 6 నుండి 8 సం|| రాల మధ్య .

పిల్లలు దూరం నుంచి వాహనాలను చూసి దాని రిజిస్ట్రేషన్ నంబర్ చివర అంకె సరి సంఖ్యో, బేసి సంఖ్యో చెప్పగలగాలి. సరిసంఖ్య అనగా 0, 2, 4, 6, 8; బేసి సంఖ్య అనగా 1,3, 5, 7,9 కరెక్టుగా అయిదు పాయింట్లు ఎవరు సొంతం చేసుకుంటే వారు గెలిచినట్లు.


[ వెనుకకు ]

డబుల్స్ గేం

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది.
ఆడే స్థలం : ఆరు బయట, పచ్చిక మీద.
పోటి సమయం : అరగంట.
ఆటగాళ్ల వయస్సు : 8 నుండి 10 సం|| రాల మధ్య .

ఈ ఆట ఇద్దరేసి పిల్లలు ఆడాలి. మిగతా పిల్లలు చూస్తూ కూర్చోవాలి. ముందుగా ఇద్దరు లేచి నిలుచున్నాక ఒక బాలుడు లేక బాలిక రకరకాల పనులు చేస్తున్నట్టు నటించాలి. ఆ ఆటగాడికి ఎదురుగా నిలుచున్న వాడు కూడ అలాగే చూస్తుండాలి. ఇద్దరూ నవ్వకూడదు. ఈ ఆటను చూస్తూ కూర్చున్నవారు బాగా నవ్విస్తుండాలి. అయినా వాళ్లు నవ్వకూడదు. ఇలా రెండు నిమిషాలపాటు చెయ్యాలి. తరువాత మిగతా నాలుగు జంటలు చేస్తారు. నవ్వినవారు ఓడిపోయినట్టే బాగా చేసిన వారు విజేతలు.


[ వెనుకకు ]

నాణాల విజేత

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు.
ఆడే స్థలం : ఆరు బయట, పచ్చిక మీద.
పోటి సమయం : 10 నిమిషాలు.
కావలసిన వస్తువులు : 16 రూపాయి నాణాలు.
ఆటగాళ్ల వయస్సు : 8 నుండి 10 సం|| రాల మధ్య .

ముందుగా ఆటగాళ్లు చేరి 8 నాణాలు తీసుకొని ఈ ఆట ఆడాలి. ఎదురెదురుగా కూర్చోవాలి. చేతులు వెనక్కి పెట్టుకొని తమ రెండు చేతులతో ఆ నాణేలను ఇష్టం వచ్చినట్టు ఉంచుకోవాలి. (అంటే ఒక చేతిలో 5, మరొక చేతిలో 3, లేక రెండు చేతులలో సమానంగా ఉంచుకోవాలి) ఎదుటి ఆటగాడు మొదటి ఆటగాడి చేతిలో ఎన్ని నాణాలున్నాయో సరిగ్గా చెప్పగలగాలి. సరిగ్గా చెబితే ఒక నాణాన్ని అతనికి ఓడిపోయినవాడు ఇవ్వాలి. ఈ సారి రెండవ ఆటగాడు నాణాలను చేతులలో దాచి చూపిస్తే మొదటి ఆటగాడు సరైన సమాధానం చెప్పాలి. ఇలా ఎక్కువ సమాధానాలు చెప్పగలిగినవారు ఎదుటి బాలుని వద్ద నాణాలు గెలుచుకోగలుగుతారు. లేదా 10 నిమిషాలలో ఎవరి వద్ద ఎక్కువ నాణాలు ఉంటే వారు గెలిచినట్లు.


[ వెనుకకు ]

ఒంటి కాలి గుర్రం

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది.
ఆడే స్థలం : పచ్చిక మీద.
పోటి సమయం : ఎంతసేపయినా.
కావలసిన వస్తువులు : 16 రూపాయి నాణాలు.
ఆటగాళ్ల వయస్సు : 10 నుండి 12 సం|| రాల మధ్య .

పచ్చిక మీద మధ్య గుండ్రటి సర్కిల్ గీయాలి. ఆ గీత చుట్టూ ఆటగాళ్లు ఒక కాలి మీద నిలబడాలి. పైకి లేపిన కాలిని అదే చేత్తో పట్టుకోవాలి. అంటే ఎడమకాలు పైకి లేపితే ఎడమ చేతితో ఆ కాలిని పట్టుకోవాలి. గీతకు అంటకుండా గీతకు అటూ, ఇటూ ఒంటి కాలి మీద గెంతుతుండాలి. పైకి లేపిన కాలు నేలకు దించినా, గీతను కాలు తాకినా, చేయి కిందకు వదిలేసిన వారు అవుటయినట్టే. ఇలా ఎక్కువ సేపు ఈ ఆట ఆడినవారు విజేత.


[ వెనుకకు ]

స్కిప్పింగ్

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది.
ఆడే స్థలం : ఆరు బయట.
పోటి సమయం : ఎంతసేపయినా.
కావలసిన వస్తువులు : స్కిప్పింగ్ రోప్ .
ఆటగాళ్ల వయస్సు : 8 నుండి 10 సం|| రాల మధ్య .

ఈ ఆటలో ఇద్దరిద్దరు ఒక్కొక్క బ్యాచ్ గా ఏర్పడాలి. ఒక బ్యాచ్ పిల్లలు తాడును అటు ఇటు పట్టుకొని తిప్పుతుంటే మధ్యన ఇంకొక బ్యాచ్‌కు చెందిన ఇద్దరు పిల్లలు నిలుచుని తాడు తగలకుండా గెంతుతుండాలి. ఇలా మార్చి మార్చి చేయాలి. తాడు తగిలిన వారి బ్యాచ్ ఓడిపోయినట్లు. అన్ని జట్లతోనూ గెలిచి చివరకు నిలిచినవారు విజేత. ఒక్కొక్కరు కూడా ఈ ఆటను ఆడవచ్చు.


[ వెనుకకు ]

పూసలు గుచ్చటం

ఎంతమంది ఆడవచ్చు : ఐదుగురు.
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు.
పోటి సమయం : 2 నిమిషాలు.
కావలసిన వస్తువులు : పూసలు, దారం.
ఆటగాళ్ల వయస్సు : 7 నుండి 8 సం||రాల మధ్య .

ఈ ఆట బాలికలకు ప్రత్యేకం. లీడర్ స్టార్ట్ అనగానే బాలికలంతా పరిగెత్తి దూరంగా ఉంచబడిన పూసలు, దారాన్ని తీసుకొని గుచ్చడం ప్రారంభించాలి. రెండు నిమిషాలలోపు అవి మొత్తం గుచ్చి, ఆ పూసల దండను మెడలో వేసుకుని, లీడర్ వద్దకు రావాలి. ముందుగా వచ్చిన వారు విజేత. పూసలను మొత్తం కూర్చకుండా వచ్చినవారు ఓడిపోయినట్టే.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: