telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

పిచ్చిబంతి

చాలా సరదా ఆట. ఐతే వీపులు పేలి పోతాయి.

ఎంతమంది : కొంతమంది పిల్లలు (కనీసం ఇద్దరు)
కావలసిన వస్తువులు : రబ్బరు బంతి

ఒక మంచి రబ్బరు బంతి, కొంతమంది పిల్లలు బంతి చేతిలోకి తీసుకొని కనిపించిన వారి మీద బంతిని విసిరికొట్టుకోవడం అంతే. అయితే జాగ్రత్తగా ఆడుకోవాలి. కంటిమీద చెవుల మీద కొట్టుకోవద్దు.


[ వెనుకకు ]

దొంగా పోలీసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంత ఎక్కువ మంది వుంటే అంత ఎక్కువ మజాగా వుంటుంది. (కనీసం ఇద్దరు)

పేరులోనే ఉంది పోలీసులు దొంగల్ని పట్టుకోవాలని. దొంగలు పోలీసులకు దొరకకుండా పరుగెత్తాలి. ఒకవేళ దొరికితే దొరికినట్టే దొరికి పారిపోవాలి. కొంచెం సినిమా రంగు కూడా పులుముకోవచ్చు. ఇంక, మజా యే మజా.


[ వెనుకకు ]

ఏకపాత్రాభినయం ఆట

ఎంతమంది : 10 మంది
ఆడే స్థలం : గదిలో గాని, ఆరు బయట గాని
ఆటగాళ్ళవయస్సు : 7 నుండి 10 సంవత్సరాలలోపు
పోటీ సమయం : ఒక్కొక్కరికి 5 నిమిషాలు

ఆటగాళ్ళు కూర్చున్నాక లీడర్ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో రకం ఏకపాత్రాభినయాన్ని చెయ్యమని చెప్పాలి. అంటే ఒకరిని డ్రిల్లు మాస్టారిలా, మరొకరిని క్రికెట్ కామెంటేటర్ లా, మరొకరిని ఇస్త్రీ చేసేవాడిలా, పోస్ట్‌మేన్‌లా, ఆటోడ్రయివర్ లా, స్కూల్ టీచర్ లా, చేపలు పట్టేవాడిలా, బస్ కండక్టర్ లా ఇలా అభినయించాలి. బాగా చేసిన వారికి మార్కులు వేయాలి. వారే విజేత.


[ వెనుకకు ]

సైగల అర్థం పోటీ

ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయటగాని
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు
ఆటగాళ్ళవయస్సు : 6 నుండి 10 సంవత్సరాల లోపు

లీడర్ ఆటగాళ్ళనందరినీ కూర్చోబెట్టి అందరికీ పేపరు, పెన్సిలు ఇవ్వాలి. తాను పది రకాలైన సైగలను చేసి చూపించాలి. ప్రతి సైగను చేసాక 20 సెకన్లు ఆగి రెండవ సైగను చేయాలి. ఇలా పది సైగలు చేసిన తర్వాత, మొత్తం సైగలకు సరైన అర్థం రాసిన ఆటగాళ్ళు విజేతలవుతారు.


[ వెనుకకు ]

పదాల స్కోరు

ఎంత మంది పాల్గొనవచ్చు : 5
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయట గాని
కావలసిన వస్తువులు : పేపరు, పెన్సిళ్ళు
ఆటగాళ్ళవయస్సు : 6 నుండి 10 సంవత్సరాలలోపు మధ్య

ప్రతి అక్షరాన్ని గడులలో చేర్చడం ద్వారా వచ్చే పదాల సంఖ్యను స్కోర్ చేయడం ఈ ఆట ప్రత్యేకత. ముందుగా ఆటగాళ్ళు పది నిలువు, పది అడ్డం గళ్ళు గల గడులను గీసి తమ దగ్గర ఉంచుకోవాలి. ఒక ఆటగాడు 'ఆ ' అని ఒక గడిలో రాస్తే రెండవ ఆటగాడు 'ఆ' పక్కన 'శ ' పెడితే ఆశ అవుతుంది. ఇప్పుడు రెండు పాయింట్లు ఆ ఆటగాడు తన ఖాతాలో రాసుకోవచ్చు. ఇలా ప్రతి అక్షరం చివర పేర్చే అక్షరాలను బట్టి రకరకాల అర్థాలు వస్తాయి. ఇలా అర్థాలను వచ్చే పదాల సంఖ్యను ఆ అక్షరాన్ని ఆటగాళ్ళు తమ స్కోర్‌లో వేసుకుంటూ వుండాలి. మొత్తం గడులన్నీ అయిపోయాక ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వారే విజేత.


[ వెనుకకు ]

వేగంగా చదవడం

ఎంత మంది పాల్గొనవచ్చు : 6
ఆడే స్థలం : ఆరుబయట
కావలసిన వస్తువులు : టెస్ట్ పుస్తకాలు గాని, న్యూస్ పేపర్లు
ఆటగాళ్ళ వయస్సు : 6 నుండి 8 సంవత్సరాలలోపు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఈ పోటీలో ఆటగాళ్ళ భాషా పరిజ్ఞానాన్ని గుర్తించవచ్చు. పెంపొదించుకోవచ్చు. ముందుగా న్యూస్ పేపర్లు గాని, టెస్ట్ పుస్తకాలు గాని ఆటగాళ్ళకు తలొకటి ఇవ్వాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు స్కెచ్ పెన్‌తో మార్కు చేసిన పేరాను తప్పుల్లేకుండా చదవాలి. ఎవరు రెండు నిమిషాలలో చదవగలిగితే వారు విజేత. ఇంగ్లీషు పేపరు, పుస్తకం, చదవడం కూడా పోటీగా నిర్వహించవచ్చు.


[ వెనుకకు ]

పేపరులోబొమ్మలు

ఎంత మంది పాల్గొనవచ్చు : 5
కావలసిన వస్తువులు : న్యూస్ పేపర్లు రకరకాలవి లేదా బొమ్మల పేపర్లు
ఆటగాళ్ళ వయస్సు : 5 నుండి 6 సంవత్సరాల లోపు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఈ ఆట ఆడేముందు అయిదు ఒకే రోజు న్యూస్ పేపర్లను తెచ్చి (ఎక్కువ బొమ్మలు ఉన్నవి వాటిని ఒక్కో పేజీని ఒక్కొక్క ఆటగాడికి ఇవ్వాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు పేజీలో ఉన్న బొమ్మలను గుర్తించాలి. అక్షరాలు తప్పించి ఫోటోలు, అవుట్ లైన్ బొమ్మలు సినిమా హీరోల ఫోటోలు అన్నీ గుర్తించి వరుసగా వాటిని రెండు నిమిషాల వ్యవధిలో టిక్ చేయాలి. ఎవరు సరైన ఫోటోలను తక్కువ సమయంలో గుర్తిస్తారో వారు గెలిచినట్లు.


[ వెనుకకు ]

వస్తువు ఉపయోగం

ఎంత మంది పాల్గొనవచ్చు : 10 మంది
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయటగాని
కావలసిన వస్తువులు : రకరకాల చిన్న వస్తువులు
ఆటగాళ్ళవయస్సు : 6 నుండి 8 సంవత్సరాలలోపు
పోటీ సమయం : అరగంట

ఈ ఆట పిల్లల బుద్ది కుశలతకు దోహందం చేస్తుంది. లీడర్ ఒక కుర్చీలో కూర్చొని ఒక్కొక్క వస్తువుని ఆటగాళ్ళకు చూపించాలి. దాని ఉపయోగం చెప్పమని అడగాలి. సరైన సమాధానం చెప్పిన వారికి ఒక మార్కు ఇస్తారు.

ఉదా: తాళం చెవి చూపితే, తాళం కప్పను వేయడానికి తీయడానికి అని చెప్పాలి.

దారం చూపిస్తే - బట్టలు కుట్టడానికి ఉపయోగిస్తాం అని చెప్పాలి.
పెన్సిల్ చూపిస్తే - పేపరు మీద రాయడానికి ఉపయోగిస్తారు అని చెప్పాలి.

ఇలా రకరకాల ప్రశ్నలు వేసి ఎక్కువ సమాధానాలతో ఎక్కువ మార్కులు పొందిన వారిని విజేతగా ప్రకటించాలి.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: