telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

సబ్బు నురగ పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 5
ఆడే స్థలం : ఆరుబయటగాని, బాత్ రూం
కావలసిన వస్తువులు : నీరు, సబ్బులు
ఆటగాళ్ళవయస్సు : 5 నుండి 6 సంవత్సరాల లోపు

ఈ ఆట ఆడే పిల్లలు డ్రాయర్లు తప్ప అన్నీ విప్పేయాలి. ఎందుకంటే ఒంటికి సబ్బు రాసుకోవాలి కాబట్టి. నీరు కూడా కావాల్సి వుంటుంది. ఆటగాళ్ళందరూ సబ్బులు, నీరు తెచ్చుకోవాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు గబగబా నీరు కొద్దిగా ఒంటి మీద పోసుకొని సబ్బు రాసుకోవాలి. అయితే సబ్బు నురగ ఎక్కువ తెప్పించడం ఇక్కడ పోటీ కాబట్టి బాగా సబ్బు రుద్దుకోవాల్సి వుంటుంది. 5 నిమిషాల సమయంలో తమ ఒంటి మీద ఎవరు ఎక్కువ సబ్బు నురగ తెప్పిస్తారో వారు గెలిచినట్లు.


[ వెనుకకు ]


కాండిల్ లైట్ పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 4
ఆడే స్థలం : గదిలో
కావలసిన వస్తువులు : కొవ్వొత్తులు 4, అగ్గిపెట్టెలు 4
ఆటగాళ్ళవయస్సు : 6 సంవత్సరాలు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఆటగాళ్ళు గదిలో కూర్చోవాలి. అందరిముందు ఒక్కొక్క కొవ్వొత్తి అగ్గిపెట్టెని ఉంచాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు తమ ముందున్న కొవ్వొత్తులను అగ్గిపెట్టెతో వెలిగించాలి. అయితే ఎదుటి వ్యక్తి పక్కవాళ్ళ కొవ్వొత్తులను నోటితో ఆర్పేసే ప్రయత్నం చేస్తుండాలి. తన కొవ్వొత్తిని కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తి కొవ్వొత్తులను ఆర్పాలి. ఇదీ పోటీ. రెండు నిమిషాలలోపు ఎవరు తక్కువ సార్లు తన కొవ్వొత్తిని వెలిగిస్తారో వారు విజేత. రెండు నిమిషాల సేపు ఒక్కసారే వెలిగించి చివరిదాకా కాపాడినవారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.


[ వెనుకకు ]


ఇసుకలో పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 5
ఆడే స్థలం : నదీతీరాలలో, ఆరుబయట
కావలసిన వస్తువులు : ఇసుక
ఆటగాళ్ళవయస్సు : 4 నుండి 6 సంవత్సరాలు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఆటగాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న పనులు చేయిద్దాం. అందులోనూ వారికిష్టమైన ఆటలనే ఆడిద్దాం. అవేమిటంటే ఇసుకలో ఇళ్ళు కట్టడం. ఈ ఆటకు తప్పనిసరిగా ఇసుక కావాలి. ఇళ్ళు కట్టేటప్పుడు ఇళ్ళ ముందు ఇసుకను ఉంచుతారు. అక్కడ ఆడుకోవచ్చు లేదా నదీ తీరాలలో పెద్దవాళ్ళతో స్నానానికి వెళ్ళినప్పుడు ఆడుకోవచ్చు. లీడర్ విజిల్ వెయ్యగానే ఎవరు ఇసుకలో అందమైన ఇళ్ళను కడతారో వారే విజేత.


[ వెనుకకు ]


స్నేహితుల ఆట

ఎంతమంది పాల్గొనవచ్చు : 10
ఆడే స్థలం : గదిలోగాని, ఆరు బయటగాని

సమ్మర్ క్యాంప్ కో, మ్యూజిక్ క్లాస్ కో వెళ్ళినప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. అవి స్నేహంగానూ మారుతుంటాయి. కానీ కొత్తలో మాత్రం అంతా బెరుకే. ఎవరి పేరేమిటో తెలియదు. వాళ్ళ టేస్ట్ ఏమిటో అర్థం కాదు. ఏం మాట్లాడాలన్నా ఇబ్బందే. సరిగ్గా అటువంటి సమయంలోనే పరిచయాలు కాస్తా స్నేహంగా మారడానికి ఉపకరించే ఆట ఇది. ఒకరికొకరు అసలు పరిచయం లేనప్పుడు ఈ ఆట బాగా ఉపయోగపడుతుంది. అందరూ సర్కిల్ లాగా కూర్చోవాలి. ఆట ఎవరితోనైనా ప్రారంభించవచ్చు. ముందుగా కూర్చున్నవారు తమ పేరు, అభిరుచులు, ఇష్టమైన సూక్తి గట్టిగా అందరికి వినిపించేలా చెప్పాలి. రెండో వారు మొదటి వ్యక్తి చెప్పిన వాటిని చెప్పి తమ పేరు, అభిరుచులు, ఇష్టమైన సూక్తి కూడా చెప్పాలి. మూడోవారు మొదటి ఇద్దరు చెప్పిన వాటిని గడగడా చెప్పి తమ పేరు, అభిరుచులు, ఇష్టమైన సూక్తి కూడా చెప్పాలి. నాలుగోవాడు తన కన్నా ముందు పరిచయం చేసుకున్న వారి వివరాలు చెప్పి తరువాత తన వివరాలు చెప్పాలి. ఆటలో పది మంది ఉంటే ఏదో వ్యక్తి తొమ్మిది మంది వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది మీ జ్ఞాపక శక్తి పరీక్ష మాత్రమే కాదు. మిగతా వారి వివరాలు అభిరుచులు తెలుసుకొనే వీలు కలుగుతుంది.


[ వెనుకకు ]


గాడిద తోక

ఎంతమంది పాల్గొనవచ్చు : 10
ఆడే స్థలం : గదిలో
కావలసిన వస్తువులు : డ్రాయింగ్ షీట్ లు, స్కెచ్ పెన్నులు
ఆటగాళ్ళ వయస్సు : 6 నుండి 8 సంవత్సరాలు

ఈ ఆట లో ఎంత మందైనా ఉండవచ్చు. ఇద్దరు లేక ముగ్గురున్నా ఆడుకోవచ్చు. ముందుగా ఒక మంచి డ్రాయింగ్ షీట్ తీసుకొని దాని మీద గాడిద బొమ్మ వేయాలి. ఆ గాడిదకు తోక మాత్రం పెట్టవద్దు. తోక భాగంలో ఖాళీ ఉంచాలి. తర్వాత మరో డ్రాయింగ్ షీట్ తీసుకొని దాన్ని పొడవుగా కొన్ని భాగాలుగా కత్తిరించాలి. వాటి మీద గాడిద తోకల్ని గీయాలి. ఇప్పుడు డ్రాయింగ్ షీట్ మీద వేసిన గాడిద బొమ్మను హాల్లోని గోడకు తగిలించాలి. ఇప్పుడు లేదంటే సెల్లో టేప్ పెట్టి అతికించాలి. తర్వాత ఒక లీడర్ ను ఎన్నుకోవాలి. ఆ లీడర్ టీం లోని మెంబర్లలో ఎవరు ముందు ఆడాలో నిర్ణయించాలి. మొదట ఒక ఆటగాడు లేచి కళ్ళకు గంతలు కట్టుకోవాలి. లీడర్ అతడి చేతికి గాడిద తోక ఇస్తాడు. అతడు గాడిద బొమ్మ ఎక్కడుందో గుర్తుపెట్టుకొని వెళ్ళి దాని తోక భాగం ఎక్కడూందో అక్కడ తోకను అతికించాలన్నమాట. అలా తగిలించలేని వారు ఓడిపోయినట్టు, ఈ ఆటలోని మరో విచిత్రమేమిటంటే, ఇందులో గెలిచినవారికి కాకుండా ఓడిన వారికే బహుమతులుంటాయి. బహుమతి ఏమిటంటే గాడిద తోక భాగంలో దాన్ని అతికించలేని వారు ఆ తర్వాత ఆట పూర్తయ్యే వరకు తామే తోకను పెట్టుకొని తిరగాలి.


[ వెనుకకు ]


వన్, టు, త్రీ - బస్

ఎంతమంది పాల్గొనవచ్చు : 5
ఆడే స్థలం : ఆరుబయట
కావలసిన వస్తువులు : డ్రాయింగ్ షీట్ లు, స్కెచ్ పెన్నులు
ఆటగాళ్ళవయస్సు : 10 నుండి 12 సంవత్సరాలు
పోటీ సమయం : 10 నిమిషాలు

ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కాకుండా ఒక అంకెను ఎంపిక చేసుకొని దాని స్థానంలో బస్ అనే మాటను వాడాలి. ఆ అంకెను రెట్టింపు సంఖ్య ఎక్కడొచ్చినా అదే పద్దతి. ఉదాహరణకి 4 అంకెను తీసుకోండి. ఈ ఆటలో ఎలా చెప్పాలంటే వన్ టూ త్రీ బస్ ఫైవ్, సిక్స్, సెవన్ బస్ ఇంకా 12 తర్వాత 18 తర్వాత అలా బస్ వస్తూనే ఉంటుంది. అర్థమైదిగా, ముందు కాస్త సులభంగా అనిపించినా, అంకెలు చెబుతూ వెళ్ళిన కొలది బస్ కాస్త ఇబ్బంది పెడుతుంది. దాన్ని అధిగమించి చెబితేనే ఆట గెలిచినట్లు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: