telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

లెక్కల పోటీ ఆట

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిల్
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 12 సం|| నుండి 14 సం||లలోపు
పోటీ సమయం : 10 నిమిషాలు

1) మూడు నెంబర్లున్నాయి. వాటి మొత్తం విలువ 120. మొదటి రెండు అంకెల మధ్య తేడా తొమ్మిది. రెండో దానికన్నా మూడోది 99 ఎక్కువ ఆ అంకెలు ఏమిటి?

జ)మొత్తం విలువ 120 అయినపూడు 99 తగ్గిస్తే 21 మిగులుతుంది. దానిలో 9 తగ్గిస్తే 12 మిగులుతుంది.

కాబట్టి మొదటి అంకె = 12

రెండవ అంకె = 21

మూడవ అంకె = 120

2)నాలుగంకెల సంఖ్య ఎనిమిది చేత భాగిస్తే శేషం మూడు. పదిహేడు చేత భాగిస్తే పన్నెండు. ఇరవై ఆరు చేత భాగిస్తే శేషం ఇరవై ఒకటి ఆ అసలు సంఖ్య ఏది?

జ)1763 సంఖ్యను 8 చేత భాగిస్తే శేషం 3 మిగులుతుంది.

1763ను 17 చేత భాగిస్తే శేషం 12 వస్తుంది.

1763ను 26 చేత భాగిస్తే శేషం 21 వస్తుంది.

జవాబు: 1) 12, 21, 120 ; 2) 1763


[ వెనుకకు ]


ఫేస్ ప్రేమ్


ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు
కావలసిన వస్తువులు : ఖాళీ ఫోటోఫ్రేమ్‌లు లేదా కార్డ్‌బోర్డ్ అట్టముక్కలు
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 6 సం|| నుండి 8 సం||లలోపు
పోటీ సమయం : 1 నిమిషాలు

ముందుగా ఖాళి ఫోటోఫ్రేమ్‌ను సంపాదించాలి. లేకపోతే అట్టపెట్టెలను సేకరించి వాటిని నలుచదరంగా కట్‌చేసి ఫోటోఫ్రేమ్‌లా ఉపయోగించవచ్చు. లీడర్ ఒక్కొక్క ఆటగాడికి ఒక్కో నిమిషం సమయం ఇవ్వాలి. ఒక్కొక్క ఆటగాడు తలను ఫ్రేమ్‌కు వెనుక ఉంచాలి. అంటేఅ ఫోటోలా ఉంటుందా సీను. మిగతా ఆటగాళ్ళు రకరకాలుగా మాటలాడి, జోకులు వేసి నవ్వించడానికి ప్రయత్నిస్తుంటారు. కాని నిమిషంసేపు కేవలం కనుబొమ్మలు, కనుగుడ్లు కూడా కదలకుండా ఉండగలిగినవాడే విజేత.


[ వెనుకకు ]


దిక్కులను చూపించడం

ఎంతమంది ఆడవచ్చు : ఎనిమిది మంది
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 10 సం|| నుండి 14 సం||లలోపు
పోటీ సమయం : 10 నిమిషాలు

ఈ ఆట ఆడటం వల్ల పిల్లలలో బుద్ది కుశలత వికసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలను రెండు టీమ్‌లుగా విడదీయాలి. 'టీమ్' కు నలుగురు చొప్పున పిల్లలు ఆడాలి. నలుగురు ఒకరి వీపు ఒకరు ఆనించి నిలుచోవాలి. అంటే + ఆకారంలో నాలుగు దిక్కులను ముఖం చూస్తున్నట్టుగా వీరు నిలుచోవాలి. పక్కన ఇంకో టీమ్ కూడ అలానే నిలుచోవాలి. లీడర్ రెండు టీ్‌లలోని వారి పేర్లను విడివిడిగా పిలుస్తూ దిక్కులు చెబుతుంటే లీడర్ చెప్పినట్టు గ్రూప్‌లోని ఆటగాళ్ళు తిరుగుతుండాలి. తప్పుల్లేకుండా 10 నిమిషాలపాటు ఈ ఆట ఆడిన జట్టు బాలలు విజేతలు.


[ వెనుకకు ]


సరదా కబాడీ

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : బెలూన్లు ఒక పాకెట్
ఆడే స్థలం : బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 7 సం|| నుండి 10 సం||లలోపు
పోటీ సమయం : అరగంట

ఆటగాళ్ళు రెండు టీమ్‌లుగా ఏర్పడాలి. 20 అడుగుల చదరపు ఖాళీ స్థలంలో కబాడీ కోర్టు గీసి మధ్యన గీత గీయాలి. ఈ గీతకు అటు ఇటు రెండు 'టీమ్' లు నిలబడాలి. రిఫరీ విజిల్ వేసి ఆటమధ్య గాలిలో 10 బెలూన్స్ వేయాలి. బెలూన్స్ నేల మీద పడకుండా ఆటగాళ్ళు వాటిని తలతో తాకి అవతలి టీమ్ మీదకు పంపాలి. బెలూన్స్ ఏ టీమ్ కోర్టులో నేలను తాకితే ఆ టీమ్‌కు ఒక పాయింట్ పోయినట్టే. బెలూన్స్‌ను చేతులతో తాకరాదు. బెలూన్స్ ఏ టీమ్ కోర్టులో పగిలినా ఆ టీమ్ కు పాయింట్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆడాలి. ఎంతో సరదాగ గడిచిపోతుంది ఈ ఆట.


[ వెనుకకు ]


వేటగాళ్ళు - గడుసు జింకలు

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
ఆడే స్థలం : బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 7 సం|| నుండి 10 సం||లలోపు
పోటీ సమయం : అరగంట

ఈ ఆటలో ముగ్గురు వేటగాళ్ళు రూపంలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని జింకల కోసం పరిగెట్టాలి. మిగతా పిల్లలంతా జింకలలాగా వేటగాళ్లకు దొరక్కుండా పరిగెత్తాలి. మరికొందరు వేటగాళ్ళు వెనక్కి చేరుకొని వీపుమీద చిన్నగా తడుతుండాలి. వేటగాళ్ళు వెనక్కి తిరిగి పట్టుకుంటే పట్టుబడ్డ వాళ్ళు వేటగాళ్ళు అవుతారు. ఇలా ఆట అరగంటసేపు ఆహ్లాదకరంగా ఆడవచ్చు.


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: