telugudanam.com

      telugudanam.com

   

పిల్లల ఆటలు (కొన్ని)

అంకెలతో సరదా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : స్కెచ్ పెన్, పేపరు అట్టలు
ఆడే స్థలం : ఆరు బయట
పోటీ సమయం : 15 నిమిషాలు

ముందు స్కెచ్ పెన్‌తో పేపరు అట్ట మీద 0 నుంచి 9 దాకా నంబర్లు వేయండి. వాటిని బ్యాడ్జిల్లా జేబుకు పెట్టుకోవాలి. సున్నా నుంచి తొమ్మిది వరకు మొత్తం 10 మంది వరుసగా నిలుచోవాలి. 1 అంకె ఉన్న బ్యాడ్జి పెట్టుకున్న వారి పేరు తాత్కాలికంగా 'ఒకటి ' అదే గుర్తుంచుకోవాలి. మిగతా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు లీడర్‌ ఓ నంబర్ పిలుస్తాడు. ఉదాహరణకు నలభై అయిదు అంటే 45 అంకెను గుర్తుకు తెచ్చేలా "నాలుగు" తర్వాత ఐదు నంబరు బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళూ వరుసగా నుంచీవాలి. అలాగే పది అనగానే ఓకటో నంబరు బ్యాడ్జి పెట్టుకున్నవళ్ళు వరుసగా నిలబడాలి. ఇదీ ఆట. లీడర్ 5642 అని పిలిస్తే ఇలా నుంచోవాలి. ఆటలో తికమక ఉండకూడదనుకుంటే లీడర్ ఒకే సంఖ్యలో రెండుసార్లు వచ్చే అంకెను పిలవకూడదు. ఎలాగంటే నాలుగు వందలా నాలుగు అన్నారనుకోండి, నాలుగు రెండు సార్లు చ్చింది. నాలుగు బ్యాడ్జి ఉన్నవాళ్ళు ఎక్కడ నిలుచోవాలో తెలియదు. ఈ ఆట రెండు టీమ్‌లుగా ఆడొచ్చు. ఒక్కో టీంలో పది మంది చొప్పున రెండు టీములకు కలిపి ఇరవై మంది ఆడవచ్చు. ప్రతి టీముకు పదిసార్లు అవకాశం ఇవ్వాలి. వరుసగా నించోవడంలో ఆలస్యం చేస్తే ఓ పాయింట్ పోయినట్లే.


[ వెనుకకు ]


అక్షరంతో ప్రయోగం

ఎంతమంది ఆడవచ్చు : ఐదుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు

లీడర్ ఏదో ఒక అక్షరం చెప్పి ఆ అక్షరంతో పదాలను కూర్చమని ఒక్కొక్క ఆటగాడిని కోరాలి. అంటే ఒక తెలుగు అక్షరంతో మనిషి పేరును, జంతువు పేరును, మొక్కల పేరును, వస్తువుల పేరును రాయాలి. అదికూడా 30 సెకండ్ల వ్యవధిలో.


ఉదా : క అక్షరంతో


మనిషి జంతువు మొక్క వస్తువు
కమల కంగారు కలువ కవరు

ఇలా ఆటగాళు సమాధానాలు రాయాలి. తప్పు రాసినవారు, రాయలేనివారు ఓడిపోయినట్లే. ఆటను అయిదు రౌండ్‌లుగా ఆడాలి. అయిదు రౌండ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చినవారు విజేత.


[ వెనుకకు ]


అక్షరంతో సృష్టి

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
పోటీ సమయం : 10 నిమిషాలు
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు

ఒకే అక్షరంతో ఏర్పడే పదాలు కనుగొనడం


'రం' అక్షరంతో

 1. అంగుళీయకం
 2. భూగర్భంలో రహస్య మార్గం
 3. వర్ణాలు
 4. వస్తు సామాగ్రి

'జం' అక్షరంతో:

 1. మూడడుగులు, ఏనుగు
 2. పెళ్ళిలో తెగ సందడి చేసేవి
 3. భయం

'దం' అక్షరంతో:

 1. శ్వేదం
 2. సంతోషం వంటిది

'శ్రే ' అక్షరంతో:

 1. ఇండస్ట్రీ
 2. కష్టం
 3. తలదాచుకోవడం

'టా' అక్షరంతో:

 1. బుల్లెట్
 2. అద్దెకారు
 3. అరవై నిమిషాల తర్వాత

'ది' అక్షరంతో:

 1. తెలుగు సంవత్సరాది
 2. ముసలితనం
 3. భద్రం

జవాబు :

 1. 'రం'తో: ఉంగరం, సొరంగం, రంగులు, సరంజామా
 2. 'జం'తో: గజం, భజంత్రీలు, జంకు
 3. 'దం'తో: చెమట, ఆనందం
 4. 'శ్రే 'తో: పరిశ్రమ, శ్రమ, ఆశ్రయం
 5. 'టా'తో: తూటా, టాక్సీ, గంటాగి
 6. 'ది'తో: ఉగాది, ముది, పదిలం

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: