telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • నిద్రాభంగం
  నాన్నా! ఈ రోజు మా ఇంగ్లీషు సార్ క్లాసు తీసుకోకుండా ఆఫీసు రూం లో హాయిగా నిద్రపోయారు.
  మరి మీరంతా ఏం చేస్తున్నారు? మీక్లాసు లీడర్‌ని తీసుకుని వెళ్ళి హెడ్‌మాష్టారు గారికి రిపోర్టు చెయ్యలేకపోయారా?
  అదీ అయింది. ఆయన అందర్ని బాదేశాడు.
  చిత్రంగా ఉందే! ఎందుకని?
  ఆయనకు మేమంతా నిద్రాభంగం కలిగించినందుకు.


 • జీవిత భీమ
  కొడుకు: అమ్మ! నేను ఈదడానికి వెళ్ళనా?
  తల్లి: వద్దు నాన్నా! ఈతరాని వాళ్ళు వెళ్ళకూడదు. 
  కొడుకు: మరి... డాడీకి మాత్రం వచ్చా? ఆయన ఎలా వెళ్ళారు? ప్రమాదం కాదా?
  తల్లి: ఆయన అంటే... జీవిత భీమా చేసుకున్నారు.


 • మానాన్న పని
  రవి: మా నాన్న కింద కొన్ని వందల మంది పని చేస్తారు తెలుసా?
  కృష్ణ: అలాగా? ఇంతకీ మీ నాన్న ఎక్కడ పనిచేస్తాడు? 
  రవి: టాప్‌ ఫ్లోర్ లో...


 • మందు
  ఏరా? కిషోర్‌…నువ్వు రోజురోజుకీ మందెక్కువ కొడుతున్నావు? ఇంట్లో మి ఆవిడ నిన్ను తిట్టదా? అని అడిగాడు
  తిట్టడం ఏంటి? ఏకంగా కొడుతుంది. ఆ దెబ్బలకు తట్టుకోలేక మళ్ళీ మందు కొడుతున్నాను అన్నాడు కిషోర్‌ తన మిత్రునితో…


 • ద్యానం
  గురువు: నాయనా! అరగంట సేపు ధ్యానంచేశావుకదా! నీకేమనిపించింది?
  శిష్యుడు: ఆహా… పరుపు మంచం లేకుండానే కూర్చుని కూడా ఇంత బాగా నిద్రపోవచ్చని తెలిసింది గురువుగారూ…


 • సినిమా
  పనివాడు: బాబుగారు...ఈరోజు రాత్రి టీవీలో రాబోయే సినిమా నేను మీ ఇంట్లో చూడవచ్చా?
  యజమాని: ఇదేం కోరికయ్యా? 
  పనివాడు: ఇరవై సంవత్సరాల క్రితం ఆ సినిమా తీసింది నేనే బాబుగారూ...ఓసారి ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోదామని…


 • బడాయి బాబు
  నేను సూర్యుడి దగ్గరకి నడుచుకుంటూ వెళ్లగలను ' చెప్పాడో బడాయి బాబు. అలా ఎలా వెళ్లగలవు, సూర్యూడి వేడికి మాడిపోగలవూ హెచ్చరించడు తోటి బాబు. మరేం ఫర్వాలేదు! రాత్రిపూట వెళ్తానూ' భరోసా ఇచ్చాడు బడాయి బాబు. ఇంకోసారి బడాయి బాబు వీధి లైటు కింద తచ్చాడూతూ కనిపించాడు. కారణం 'అడిగితే అక్కడ చీకట్లో నా ఉంగరం పడిపోయింది, ఇక్కడ వెతుకుంటున్నానని జావాబిచ్చాడు.


 • కారు రిపేరు
  చిన్నారావు ఈ కారు కొన్నప్పటి నుంచి ఇంతవరకూ రిపేరుకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు తెలుసా?
  అప్పారావు నిన్న కారు మెకానిక్‌ ఇదే విషయం చెబుతూ నెత్తీనోరూ బాదుకుంటున్నాడు.


 • మంచి పని
  ప్రతిరోజూ ఒక మంచిపని చేయాలని నిన్న చెప్పారు కదా. అందుకే నేను ఈవేళ ఒక మంచిపని చేశా టీచర్‌ చేప్పాడు సంతోషంగా రవి.
  ఏంటిది..చెప్పు అడిగింది టీచర్.
  నేను మరో ముగ్గురం కలసి...ఒక వృద్ధుడ్ని రోడ్డు దాటించాం గర్వంగా చెప్పాడు రవి. 
  ఆ పనికి నలుగురెందుకు?
  దాటేందుకు ఆయన మొరాయించాడు టీచర్‌!
  


 • గుడి దగ్గర చెప్పులు
  శ్రీ వీర వేంకట సత్యనారాయణ లక్ష్మీ సాయి గణేష్‌ కనకదుర్గాంజనేయ శివన్నారాయణ షూమార్ట్‌ ...మన చెప్పుల షాపుకు ఇంత పెద్ద పేరెందుకు పెట్టారు డాడి?
  ఆ గుళ్ళలో కాజేసిన చెప్పులు షూస్‌తోనే కదరా నేనీషాపు పెట్టింది.


 • మాతృ భాష
  నాన్నా! మనం మాట్లాడే భాషను మాతృ భాష అని ఎందుకు అంటారు?
  మాట్లాడే అవకాశం నాన్నలకు రాదు కనుక.


 • ఇంగ్లిషు నుండి తెలుగు
  టీచర్‌: వన్‌ నాట్‌ ఫోర్(104)ని తెలుగులో ఏమంటారు?
  శ్రీను: ఒకటి కాదు నాలుగు సార్‌...


 • వెంటనే...
  టీచర్‌ : ఇంటికి వెళుతుంటే దారిలో వందరూపాయల నోటు దొరికింది అనుకుందాం. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గరే పెట్టుకుంటావా?
  రాజు: లేదు సార్‌! 
  
  టీచర్‌ : వెరిగుడ్‌! మరి ఏం చేస్తావు? 
  రాజు: వెంటనే ఖర్చు చేస్తానండీ…


 • స్పెషల్‌....
  చింటు: గుండు గీయడానికి ఎంత తీసుకుంటావు?
  అప్పారావు: స్పెషల్‌ గుండు అయితే ఇరవై రూపాయలు. సాదా గుండు అయితే పది రూపాయలు
  
  చింటు: స్పెషల్‌ ఏమిటి? సాదా ఏమిటి? 
  అప్పారావు: స్పెషల్‌ గుండు అయితే గాట్లేవి పడకుండా జాగ్రత్తగా నేనే చేస్తాను. సాదా గుండు అయితే తలంతా గాట్లు పడేట్లు నా అసిస్టెంట్‌ చేస్తాడు.


 • కోడి భోజనం
  ఓ హోటల్‌ ముందు కోడి భోజనం రూపాయి మాత్రమే అని బోర్డు ఉంది. అది చూసి టిక్కెట్టు కొని హోటల్లో కూర్చుని లొట్టలు వేయసాగాడు ఓ ఆసామి.
  
  
  కాసేపయ్యాక జొన్నలు ప్లేటులో తెచ్చి పెట్టాడు సర్వానందం. 
  ఇదేమిటి జొన్నలు తెచ్చావ్‌? కోపంగా అడిగాడ ఆసామి. 
  అవునండి కోడి తినేది ఇవేగా...నవ్వుతూ అన్నాడు సర్వానందం.
  


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: