telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

 • ఇన్సూరెన్స్
  సముద్రంలో ఈత కొట్టనా మమ్మీ!
   వద్దునాన్నా ప్రమాదం. . . 
   మరి నాన్న ఈత కొడుతున్నాడుగా! 
   ఆయనకు ఇన్సూరెన్స్ వుందిలే. . .


 • బట్టతల
  ఎంత భయంకరమైన విషయాన్ని చూసినా వెంకట్రావు వెంట్రుకలు నిక్కబొడుచుకోవు. . .
   ఎందుకనీ? 
   వాడిది బట్టతల కాబట్టి. . .


 • సందేహం తీరిపోయింది?
  నువ్వసలు మనిషివేనా? ఆవేశంగా ఓ వ్యక్తి అడిగాడు.
   కాదు అన్నాడు కూల్‌గా. 
   సర్లే అయితే. . . నా సందేహం తీరిపోయింది. . .


 • అడుగుజాడల్లో నడుస్తా
  నేను పెద్దయ్యాక పోలీసయ్యి మా నాన్న అడుగుజాడల్లో నడుస్తా. . .
   మీ నాన్న పోలీస్‌ కాదుగా! 
   అవును. . . మా నాన్న పెద్ద గజదొంగ. . .


 • సినిమాలకు డైలాగులు వ్రాయడం
  ఆ పిల్లవాడు వేలేడెంతలేడు ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు. . .
  ఓ పెద్దాయన ఆశ్చర్యంగా అన్నాడు. 
   దానికో రహస్యం వుంది . 
   ఏమిటి? 
   వాళ్ళనాన్న ఫ్యాక్షన్‌ సినిమాలకు డైలాగులు వ్రాస్తూ వుంటాడ్లే. . .


 • అనారోగ్యానికి కారణం
  డాక్టర్‌ గారూ. . . నా అనారోగ్యానికి కారణం ఏమిటండీ. . .
  పేషెంట్‌ డాక్టర్ని అడిగాడు. 
   నువ్వు పరమ బద్ధకస్థుడివి. . . శరీర శ్రమ చేయకపోవటమే నీ అనారోగ్యానికి కారణం 
   ఇది వినడనికి రాలేదండీ డాక్టరూ గారూ. . . 
  దీనికంటే నాకు హార్ట్‌ప్రాబ్లమ్‌ అని చెప్పుకోవడానికే గర్వపడతాను. . . 
  చెప్పాడు పేషెంట్‌ బద్ధకంగా.
  


 • హనీమూన్‌
  తల్లి కూతుర్ని అడుగుతుంది. . .
   మీ హనీమూన్‌ ఎలా జరిగిందమ్మ 
   ఫర్లేదు అంది కూతురు నీరసంగా. . . 
   అదేంటే. . . తల్లి కంగారుగా అడిగింది. . . 
   నేను టీవీ సీరియల్స్‌తో ఆయన తన మొబైల్‌ ఫోన్‌తో బిజీ. . . ఇదేం హనీమూన్‌ నా బొంద.


 • పెళ్ళండీ
  నిన్న స్కూల్‌కి ఎందుకు రాలేదురా?
   మా అన్నయ్య పెళ్ళండీ. . .
   ఎవర్నిరా మీ అన్నయ్య చేసుకున్నది? 
   ఒక అమ్మాయినండీ
   వెధవా. . . పెళ్ళి అమ్మాయిని కాక అబ్బాయిని చేసుకుంటారట్రా?
   టీచర్‌ మండిపడ్డాడు. 
   ఎందుకు చేసుకోకూడదండీ? మా అక్కయ్య ఓ అబ్బాయినే కదండీ పెళ్ళి చేసుకుంది?


 • జండుభాం
  నిన్ను చూస్తుంటే వళ్ళు మండుకొస్తుంది. . .
   అయితే జండుభాం తలకు రాసుకో. . . 
   వెధవా. . . తలనొప్పిగా వుంది జండుభాం తెమ్మని చెప్పినా మర్చిపోయి వస్తావురా అందుకే వళ్ళు మండుకొస్తుంది. . .


 • జోక్స్‌ పుస్తకం
  ఆయనేంటి అంత పగలబడి నవ్వుతున్నాడు
   జోక్స్‌ పుస్తకం చదువుతున్నాడు 
   జోక్స్‌ అంత బాగున్నాయా? 
   నా బొంద. . .ఆ పుస్తకం వ్రాసింది ఆయనే. . . 


 • బర్రెను కొనుక్కుందాం
  రైతు: నా దగ్గర డబ్బులుంటే బర్రెను కొనుక్కుంటానండీ. . .
  టీవీ అమ్ముదామని వచ్చిన సేల్స్‌మన్‌తో జాలిగా ముఖం పెట్టి అన్నాడు.
  సేల్స్‌మన్‌ : మీరు చెప్పేది బాగుంది అయినా బర్రె మీకు వినోదాన్ని ఇవ్వలేదుకదండీ. . . 
   అదే టీవీ అయితే అన్ని ఛానెల్స్‌ చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు. . . 
  అన్నాడు. 
  రైతు: నిజమేనండీ. . . కానీ టీవీని పిండితే పాలు రావు కదండీ అందుకే బర్రెను కొనుక్కుందామని అనుకుంటున్నానండీ. . 


 • గర్భిణీ స్త్రీ
  గర్భిణీ స్త్రీని పరీక్షించిన డాక్టర్‌ మందులు వ్రాసి ఇచ్చాడు.
   నాకీ పిల్స్‌ కాకుండా టానిక్స్‌ ఇవ్వండి డాక్టర్‌ .
   లేదమ్మా. . . ఈ పిల్స్‌ చాలా శక్తివంతమైనవి ఇవి వాడటమే మంచిది. . . 
   ఏమోనండి డాక్టరుగారూ పిల్స్‌ని నమ్మటం బట్టే నాకీ పరిస్థితి వచ్చింది. . .
  నిట్టూరిస్తూ అంది పెళ్ళికాకుండా గర్భవతి అయిన యువతి.


 • ఓ త్రాగుబోతు
  ఓ త్రాగుబోతు భయంకరంగా త్రాగేసి కారు డ్రైవ్‌ చేసేందుకు డోర్‌ తీస్తుంటే ఒక ముసలాయన ఇలా అన్నాడు.
   ఎందుకండి రిస్క్‌ తీసుకుంటారు. . . 
   ఈ పరిస్థితిలో మీరు కారు డ్రైవ్‌ చేయటం మంచిది కాదు . 
   నిజమే సార్‌. . . కానీ ఈ పరిస్థితిలో ఇంటిదాకా నడుచుకుంటూ వెళ్ళలేనుకదండీ. . . అన్నాడు త్రాగుబోతుగారు.


 • హోటల్‌కి పోదాం
  పెసరట్టు వేసావా?
   లేదు. . . 
   లేదా? భర్త మండిపడుతూ అన్నాడు నీకు బాధ్యత లేదు. . . నేను హోటల్‌కు పోయి తింటాను. . . 
   అయితే ఓ పదినిమిషాలు ఆగండీ. . . 
   పది నిమిషాల్లో పెసరట్టు రెడీ చేస్తావా? 
   లేదండీ. . . రెడీ అయి నేను కూడా మీతోపాటు హోటల్‌కు వద్దామని. . . 
  భార్య తాపీగా చెప్పింది.


 • సంపాదన దానం చేయడం
  సంపాదనలో పదిశాతం అయినా దానం చేస్తే పుణ్యం వస్తుందని స్వామిజీ చెప్పగనే నీవు సంపాదించే జీతం మొత్తం దానం చేస్తున్నట్లు తెలిపావే. . .
  ఎవరికి దానం చేస్తున్నావు? 
  మా ఆవిడకు. . . 


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: