telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 2 3 4 5 6 7 8 9 10 11 > >>  

 • పరీక్ష హాలు
  ఏం నాయనా... పరీక్ష హాల్లో అలాదిక్కులు చూస్తూ కూర్చుండి పోయావ్‌... జవాబులు రాయడం లేదేం? అడిగాడు ఇన్విజిలేటర్.
  ఈక్రింది ప్రశ్నలకు అయిదింటికి సమాధానాలు వ్రాయుము అని వుందండీ...ఇంకా టైమ్‌ అయిదు కాలేదు కదండీ... 
  అందుకే... చెప్పాడు పరీక్ష రాసే ఆ కుర్రాడు.


 • రోలేస్తే అంతే...
  రత్నం: విజయ్‌ మొన్న రిలీజైన కొత్త సినిమాలో ఒక రోలు వేశానన్నావ్‌ ఎక్కడాకనిపించలేదే.
  విజయ్‌ : ఎందుకు వేయలేదు సినిమా రెండో పాటలో హీరోయిన్‌ పేరంటాళ్లు దంచిన రుబ్బురోలు సెట్లో వేసింది ఎవరనుకున్నావ్‌? అది నేనే…


 • పాటంటే మజాకా?
  మా ఆయన చాలా బాగా పాడతారండీ... అంటూ తన భర్త గారి గొప్పతనాన్ని పొరుగింటి సాంబమూర్తికి తెలిపింది లక్ష్మి
  ఆ... అలాగా ఇంతకు ముందు ఏమేమి పాడారేంటి? 
   పోయిన వారమే చీటీపాట పాడారు.


 • గొయ్యి మీద గొయ్యి
  వెంకటేశం: ఆరడుగుల లోతు ఏడడుగుల వెడల్పులో ఒక గొయ్యి తీయాలి అన్నాడు మోతుబరి కమలనాధంతో.
  కమలనాధం: తీసిన మట్టిని ఎక్కడేయమంటారు? 
  వెంకటేశం: ఆ మాత్రం తెలియదటోయ్‌... అదే సైజులో మరోగోతి తీసి అందులో వేసేయ్‌!


 • పెళ్ళైన కొత్తలో...
  పెళ్ళైన కొత్తలో నేను ఇంటికెళితే ప్రేమతో నాకోసం ఎదురుచూస్తూ నాకు స్వాగతం చెప్పేది నా భార్య. ఆవిడ పెంచుకున్న
  కుక్క మాత్రం కొత్తవాడిగా భావించి మొరిగేది చెప్పాడు శేఖర్‌ శ్రీనుతో. 
  మరి ఇప్పుడు? అడిగాడు శ్రీను. 
  కుక్క పరిగెత్తుకొచ్చి ప్రేమగా తోకాడిస్తుంది, మా ఆవిడ అరవడం నేర్చుకుంది.


 • కాలెలా విరిగిందిరా?
  రవి:కాలెలా విరిగిందిరా? రాము: అరటి తొక్క మీద… రవి: ఓ..అరటి తొక్క మీద కాలేసి పడ్డావా? రాము: నేను కాదు . మా ఆవిడ అరటి తొక్క మీద కాలేసి పడింది నేను నవ్వానంతే!


 • లేనట్లయితే...
  ఎడిసన్‌ మహాశయుడు బల్బు కనిపెట్టకపోతే ఏమై ఉండేదిరా? అని శ్రీనును అడిగాడు టీచర్‌.
  కిరసనాయిల్‌ దీపం పెట్టుకొని టీవి చూడలేక ఇబ్బంది పడేవాళ్లం సార్‌ అన్నాదు శ్రీను అమాయకంగా.


 • దేనితో ఏది...?
  విపరీతంగా తాగేస్తున్న ఒక దేవదాసుని తాగుడు మాంపించాలని వాళ్లావిడ యోగా క్లాసులకి పంపించసాగింది.
  కొన్నిరోజుల తరువాత యోగా ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు- 
  మీ ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? అని ఆమెను అడిగారు. 
  మార్పు లేదు పాడు లేదు. ఇదివరికి నిలబడి తాగేవారు. ఇప్పుడు తలక్రిందులుగా నిలబడి తాగుతున్నారు అని బాధగా చెప్పిందావిడ.


 • వెలుగు
  నా నవల వెలుగులోకి రావడనికి 20 సంత్సరాలు పట్టింది చెప్పింది రచయత్రి కామాక్షి.
  అబ్బా... చాలా కష్టపడ్డారన్న మాట అన్నాడు రిపోర్టర్‌. 
  
  అవును.రాయడం వారం రోజుల్లో అయింది పబ్లిషర్‌ను వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది.


 • ఉత్తరాలు
  భాస్కర్‌ ఉత్తరాలు రాయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నావా? అదెలా?!
  శ్రీను డబ్బు పంపించండి అని మానాన్నకు ఉత్తరాలు రాస్తుంటాను!


 • అన్యాయం సార్‌...
  జడ్జి: నువ్వు ముద్దాయిగా నా ముందు నిలబడటం ఇది అయిదోసారి. అందుకని నీకు వంద రూపాయలు ఎక్స్‌ట్రా జరిమానాగా విధిస్తున్నాను.
  దొంగ: చాలా అన్యాయం సార్‌... రెగ్యులర్‌ కస్టమర్‌కి డిస్కౌంట్‌ ఇవ్వకపోగా ఎక్స్‌ట్రా పెనాల్టీ ఏమీ బాగాలేదు సార్‌.


 • కర్త, కర్మ
  భర్త: భార్యాభర్తలు ఈ సృష్టికి కర్తకర్మలవుతారా? అదెలాగా?
  భార్య: బిడ్డల సృష్టికి భర్త కర్తయితే ఆ పిల్లల్ని కనే కర్మ భార్యదే కదండీ…


 • అవకాశం
  ఇద్దరు తెరమరుగైన కళాకారులు ఒక ప్రసిద్ధ నటుణ్ణి కలిసి మళ్ళీ స్టేజ్‌ ఎక్కే అవకాశాలు ఇప్పించమని కోరారు.
  అలాగే రేపు సాయంత్రం నేను వచ్చి కొన్ని డైలాగ్స్‌ చెబుతాను. తెరపడుతుంది. తెరలేవగానే, నేను హీరోయిన్‌తో లవ్‌సీన్‌ నటిస్తాను...
  అది సరేసార్‌, మా పాత్రలేంటో కాస్త చెబుతారా?
  తెర దానంతట అది లేచి, దానంతట అది పడదుగా! అదే మీ పాత్ర... అటూ ఇటూ... తెరలాగుతూ చెరొకరు! అన్నాడా నటుడు కూల్‌గా...
  


 • నా పేరు మీదే...
  ఎక్స్యూజ్‌మీ, మా ఆయన సమాధి ఎక్కడుందో కనిపించట్లేదు. కాని ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అడిగింది లలితాప్రసాద్‌.
  మీ ఆయన పేరేమిటి? అడిగాడు మేనేజర్‌,. శివప్రసాద్‌ అని చెప్పింది. 
  ఊc... ఈ లిస్టులో శివప్రసాద్‌ అనిలేదు, కాని లలితాప్రసాద్‌ అని ఉంది.
  అయితే అది ఆయనదే. ఆయనవన్నీ నాపేరు మీదే ఉంటాయిగా
  ఆహా... ఈ మాటకోసమే ఎదురు చూస్తున్నా... వెంటనే ఓ పదివేలు తియ్యండి.


 • మసక మసక...
  అదేమిట్రా ఈ మధ్య మీ బామ్మగారు కళ్లజోడు పెట్టుకునే నిద్రపోతున్నారు?
  ఏంలేదురా! ఈ మధ్య ఆవిడకు కలలన్నీ మసకమసకగానే కనిపిస్తున్నాయట.


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 2 3 4 5 6 7 8 9 10 11 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: