telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 3 4 5 6 7 8 9 10 11 12 > >>  

 • గర్వంగా...
  నా తెలివితేటలన్నీ మన ఆఖరాడికి వచ్చాయి భర్త గర్వంగా చెప్పాడు.
  ఆ ముక్క నిజమే సుమండీ. ఎందుకంటే నా తెలివితేటలన్నీ నాబుర్రలోనే ఉన్నాయి ఒప్పుకుంది భార్య.


 • రెండున్నర
  మీ ఆవిడ కారు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది?
  రెండున్నర కార్లు జవాబు చెప్పాడు ఆమె భర్త.
  


 • పెట్రోల్‌ విలువ
  ఓ పెట్రోల్‌ బంక్‌లో బోర్డుమీద...
  ఇక్కడ సిగరెట్‌ తాగకండి. మీ జీవితం పెట్రోల్‌ అంత విలువైంది అని రాసి ఉంది.


 • లిఫ్ట్‌
  ఈ జంక్షన్‌లో లిఫ్ట్‌ అడిగేవారితో తెగ ఇబ్బంది చెప్పాడో కారు యజమాని మిత్రుడితో.
  మరి మనల్నెవరూ అడగరే? ప్రశ్నించాడు ఆ కారులో వెళుతున్న మిత్రుడు. 
  
  బయటికి కనపడేలా ఉంచిన బోర్డుని చూపించాడు కారు యజమాని. దానిమీద ట్యాక్సీ అని రాసి ఉంది.


 • వాళ్ళే కనుక...
  రమేష్‌ : ఏంటి... ఈరోజు నువ్విలా అప్పుల్లో కూరుకుపోవడానికి మీ తాత మీ నాన్న కారకులా? అంటే వాళ్ళ కోసమే నువ్వు అప్పులు చేశానంటావా?
  రాజేష్‌ : అదేం కాదు. వాళ్ళే కనక ఆస్తులు సంపాదించి ఉంటే నాకిలా అప్పులు చేసుకోవాల్సిన గతి పట్టేది కాదు కదా!


 • ఇంకానా...?
  ఇరవై అడుగుల ఎత్తు నిచ్చెన మీద నుండి పడినా ఒక్కదెబ్బ కూడా తగల్లేదా?
  అబ్బా! మీది భలే ఉక్కు శరీరమండీ! 
  నేను పడింది ఆ నిచ్చెన నేల మీద పడుకోబెట్టి ఉన్నప్పుడు


 • జ్వరం
  స్టూడెంట్‌ : (ఫోన్‌లో) మా అబ్బాయికి బాగా జ్వరంగా ఉంది. ఇవ్వాళ స్కూలుకి రాలేడు.
  టీచర్‌ : ఎవరు మాట్లాడేది? 
  స్టూడెంట్‌ : మా నాన్నని మాట్లాడుతున్నాను.


 • మలుపు
  ట్యూషన్‌ టీచర్‌ : ఇంటికి తిన్నగా వెళ్లు...
  స్టూడెంట్‌ : అలా ఎలా కుదురుతుంది టీచర్‌. మా ఇల్లు మలుపులో ఉంది!


 • నిన్నెవరు ప్రేమిస్తారు
  కమల: శ్రీను! నీకు నామీద నిజంగా ప్రేమే ఉంటే ఆ కొండమీద నుంచి దూకు చూద్దాం.
  శ్రీను: ఊహు! నేను చస్తే దూకను. 
  కమల: ఏం? 
  శ్రీను: నేను చస్తే నిన్నెవరు ప్రేమిస్తారు చెప్పు!? అంచేత - నీమీద ప్రేమతోనే నేను చావాలనుకోవటం లేదు.


 • చిన్న విషయానికి...
  ప్రకాష్‌ : నేను ప్రేమిస్తున్న అమ్మాయినే నువ్వు ప్రేమించడం ఏం బాగాలేదురా! మనిద్దరం మంచిఫ్రెండ్స్‌ కాబట్టి... ఆమెను ఎవరు పెళ్ళి చేసుకోవాలో టాస్‌ వేసి తేల్చుకుందాం. ఓకే!
  శ్రీను: ఇంత చిన్న విషయానికి టాస్‌ ఎందుకురా! పెళ్ళి నువ్వే చేసుకుందువుగాన్లే, నేను జస్ట్‌ ప్రేమిస్తున్నానంతే!
  


 • కళ్ళజోడు మార్చమను...
  పద్మిని: మొత్తం ప్రపంచంలో నా అంత అందగత్తె లేదంటాడు మా ఆయన.
  నళిని: కళ్ళజోడు మార్పించుకోమని చెప్పలేకపోయావా?


 • ఓ పిచ్చివాడు
  పిచ్చి ఆస్పత్రిలో ఒకడు నేను నెపోలియన్‌ని! నేను నెపోలియన్‌ని! నేను నెపోలియన్‌ని అని అరుస్తున్నాడు.
  అటువైపుగా వచ్చిన ఓ ఆసుపత్రి సందర్శకుడు నీవు నెపోలియన్‌వా? ఆ సంగతి నీకెలా తెలుసును? అన్నాడు. 
  భగవంతుడు స్వయంగా చెప్పాడు అన్నాడతడు. 
  చాల్లే కోతలు నేను నీకెప్పుడు చెప్పాను? నేను నీతో అసలు మాట్లాడితే గదా! అన్నాడు ఆ పక్కనున్న మరో పిచ్చాడు.


 • బిచ్చగాడి దగ్గర అప్పు
  గోపి: నీకేమైనా మతి ఉందా? ఆ బిచ్చగాడికి వంద రూపాయలు వేశావేంటి?
  రాము: నిన్న వాడి దగ్గర ఆ వంద అప్పు తీసుకున్నా.


 • మతిమరుపు భర్త
  ఛీఛీ... ఈ టైలర్‌కి అసలు బుద్ధిలేదు. ప్యాంటు జిప్‌ వెనక్కు పెట్టాడు అన్నాడు ప్రొఫెసర్‌.
  మీ మతిమరుపు మండినట్లే ఉంది. మీరు ప్యాంటు వెనక్కి వేసుకున్నారు గుర్తుచేసింది భార్య.


 • దేనికి బెంగ
  ఎందుకురా - అలా విచారంగా ఉన్నావ్‌?
  మా ఆవిడ జాబ్‌ కోసం తెగ ట్రై చేస్తుందిరా 
  దానికి బెంగ దేనికిరా - సంతోషించక 
  ఆ ట్రై చేస్తున్నది నా కోసమేరా బాబూ!


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 3 4 5 6 7 8 9 10 11 12 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: