telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 4 5 6 7 8 9 10 11 12 13 > >>  

 • సరేనా?
  మాధవి కట్టెలు కొట్టేవాడ్ని కేకేసి పిలిచి,
  కాస్త ఈ కట్టెలు కొట్టిపెట్టు! మైసూర్‌పాక్‌ చెయ్యాలి! సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు ఇటురా! మైసూర్‌పాక్‌ తీసుకెళ్దువుగాని అంది. 
  అమ్మా! ఈ కట్టెలు చేత్తో చీల్చి అవతలపడేస్తాను. సాయంత్రం వచ్చి మైసూర్‌పాక్‌ గొడ్డలితో కొట్టిపెడతాను సరేనా? అన్నాడు గతంలో ఆవిడ చేసిన మైసూర్‌పాక్‌ తిన్న ఆ కట్టెలుకొట్టే వ్యక్తి.


 • రెండు సార్లు
  శ్రీను : నేను ఇవాళ చనిపోదామనుకున్నాను...
  రవి : ఎలా? 
  శ్రీను : పది అంతస్తుల బిల్డింగ్‌ మీద నుంచి దూకి... 
  రవి : అసలు మన ఊళ్లో పది అంతస్తుల బిల్డింగ్‌ లేనే లేదు. ఎలా దూకుదామనుకున్నావు? 
  శ్రీను : అయిదు అంతస్తుల బిల్డింగ్‌ నుంచి రెండు సార్లు దూకుదామనుకున్నాను.


 • కళ్ళు మూసుకుంటే...
  ఇద్దరు మిత్రులు స్కూటర్‌ మీద వెళ్తున్నారు…
  సుబ్బారావు అవున్రా అప్పారావు! మన ఫోటో రేపు పేపర్లో చూసుకోవాలంటే ఏం చేయాలి? 
  అప్పారావు ఏం చేయక్కర్లేదు. నేను హ్యాండిల్‌ వదిలి కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు!


 • దేని గురించి..?
  రామయ్య: ఏంట్రా.... అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. దేని గురించి?
  సుబ్బారావు: అదేరా! నాకు కూడా అర్థం కావడంలేదు. ఇంతకీ దేని గురుంచి ఆలోచిస్తున్నానబ్బా? అంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.


 • సుబ్బారావును తేలు కుట్టింది.
  బాధను ఓర్చుకోలేక అయ్యో! అమ్మో! అంటున్నాడు.
  ఏం జరిగింది? అని అందోళనగా వచ్చింది సుబ్బారావు భార్య శకుంతల . 
  సుబ్బారావు : తేలుకుట్టింది 
  శకుంతల : ఏ తేలు?, నల్లదా? 
  ఎర్రదా? 
  ఎక్కడ కుట్టింది? 
  ఎప్పుడు కుట్టింది? 
  బాగా నొప్పిగా ఉందా? 
  సుబ్బారావు : ఆపు తల్లీ. నీ ప్రశ్నల కంటే తేలు కుట్టిన బాధే నయం.
  


 • మృగాల పేర్లు
  టీచర్‌ : భయంకరమైన అడవి మృగాల పేర్లు పది చెప్పు?
  సుబ్బు: 5 సింహాలు 5 పులులు


 • అన్ని నెలల్లో...
  టీచర్‌ 28 రోజులు ఉండే నెల పేరు చెప్పు?
  రాజు: అదేమిటి టీచర్‌ అలా అడిగారు?... 
  అన్ని నెలల్లోనూ 28 రోజులు ఉంటాయి కదా!


 • ఉమ్‌...
  అమ్మ: ఏమిట్రా తమ్ముడిని గద్దిస్తున్నావ్‌?
  అమ్మ: ఆరు నెలల వయసు ఉన్న పిల్లాడికి మాటలెలా వస్తాయిరా? 
  బుడుగు: మరి ఆ విషయమే చెప్పచ్చుగా!. ఏం అడిగినా ఉమ్‌...ఉమ్‌... అంటున్నాడు.


 • మరోసారి
  రాజు: (ఏడుస్తూ) అమ్మా... నేను ఇవ్వాళ బస్సులో వస్తుంటే ఒక పెద్దాయన ఏ కారణం లేకుండా చెంప మీద కొట్టాడు..
  అమ్మ: అసలు ఏం జరిగిందో చెప్పు?... 
  రాజు: అనుకోకుండా ఆ పెద్దాయన కుడి కాలు తొక్కాను. సారీ తాతయ్య అన్నాను.ఫరవాలెదులే నాయనా అని జేబులో ఉన్న రూపాయి నాకు ఇచ్చాడు.
   అమ్మ : నువ్వు మర్యాద తెలిసిన పిల్లాడివని ఆ రూపాయి ఇచ్చి ఉంటాడు...మరి ఎందుకు కొట్టాడు?
  రాజు: కుడి కాలు తొక్కితే రూపాయి ఇచ్చాడు... మరి ఎడమ కాలు తొక్కితే ఎంత ఇస్తాడో చూద్దామని తొక్కాను. అంతే...


 • బుద్ధి ఉన్నవాడికి బుద్ధి లేనివాడికి ఉదాహరణ ఏమిటో చెప్పగలవా?
  రాము: ఒరేయ్‌ సోమూ! బుద్ధి ఉన్నవాడికి బుద్ధి లేనివాడికి ఉదాహరణ ఏమిటో చెప్పగలవా? సోము: ఏముంధీ? బుద్ధి ఉన్నవాడు నీకు ఏదురుగా ఉన్నాడు. బుద్ధిలేనివాడు నాకు ఎదురుగా ఉన్నాడు.


 • స్లో
  టీచర్‌ : స్కూలుకు ఎందుకు లేటయింది?
  స్టూడెంట్‌ : బోర్డ్‌ చూసి లేటయింది టీచర్‌ 
  టీచర్‌ : బోర్డ్‌ చూసి లేటు కావడమేమిటి? 
  స్టూడెంట్‌ : బోర్డ్‌ మీద ముందు స్కూలు ఉంది. మెల్లగా వెళ్లండి అని రాసి ఉంది టీచర్‌. అందుకే...


 • ప్లీజ్‌
  సోను పడుకోబోయే ముందు దేవుడిని ప్రార్థిస్తున్నాడు...
  పారిస్‌ను ఇటలీ రాజధానిగా చెయ్యి దేవుడా... ప్లీజ్‌...ప్లీజ్‌
  ఎందుకు అలా ప్రార్థిస్తున్నావు? అని అడిగింది తల్లి.
  నేను జాగ్రఫీ పరీక్షలో ఇటలీ రాజధాని పారిస్‌ అని రాశాను చెప్పాడు సోము.


 • గోడ గడియారం
  భర్త: ఇవాళ గోడ గడియారం కింద పడింది కొంచెం లేటైతే మా అమ్మ నెత్తిన పడేది.
  భార్య: ఛ!ఛ! ఆ గడియారం ఎప్పుడూ స్లోగానే నడుస్తోందని చెప్పానా! ఇవాళా అదే జరిగింది.


 • బార్‌లో మందు కొడుతూ
  బార్‌లో మందు కొడుతూ రవి తన మిత్రుడు భీమ్‌తో ఇలా అన్నాడు...
  మా ఆవిడకు నేనంటే అస్సలు ప్రేమలేదు. మీ ఆవిడ సంగతి ఏమిటి? 
  భీమ్‌ : ఏమోమరి! మా ఆవిడ నీగురించి ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు గ్లాసు కింద పెడుతూ.


 • బట్టలు ఉతకడం
  దుర్గ: బట్టలన్నీ మూటకట్టి తీసుకుపోతున్నావేమిటే? (కోపంగా అరిచింది)
  పనిమనిషి: (నిదానంగా) ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఉతుకుతారమ్మా? మా ఇంటికి తీసుకువెళ్ళి మా వాషింగ్‌ మెషిన్‌లో వేసి ఉతికి తెస్తాను.


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 4 5 6 7 8 9 10 11 12 13 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: