telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

 • జాగ్రత్త
  పిల్ల దోమ: సినిమాకు వెళుతున్నాను మమ్మీ...
  తల్లి దోమ: వెళితే వెళ్లావుగానీ... ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటారు జాగ్రత్త సుమా!


 • మొక్కు
  నేను ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాన్రా తమ్ముడూ! కాని నిన్ను చూస్తుంటే జాలేస్తోంది.
  నువ్వు పాసైతే నామీద జాలెందుకే? 
  మరేమో... నేను ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే నీకు గుండుగీయిస్తానని మొక్కుకున్నానురా!


 • కస్సుబుస్సు
  అన్నపూర్ణ మగవాళ్లకు ఏది చెప్పినా కష్టమే. ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు…
  సుబ్బారావు మీ ఆడవాళ్లు మాత్రం ఏ చెవితోనూ వినరు. తాము చెప్పింది తప్ప మగాడు చెప్పింది అసలే వినరు...


 • దిస్‌ ఈజ్‌ పెరుగు...
  సుబ్బారావు ఇంటికి ఒక అమెరికన్‌ గెస్ట్‌గా వచ్చాడు
  సుబ్బారావు అతనికి భోజనం ఏర్పాట్లు చేశాడు. 
  గడ్డపెరుగుని చూసి అమెరికన్‌ వాట్‌ ఈజ్‌ దిస్‌? అన్నాడు. 
  ఇంగ్లీషు రాని సుబ్బారావు ఇలా చెప్పాడు. 
  మిల్క్‌ స్లీపింగ్‌ ఇన్‌ నైట్‌, మార్నింగ్‌ బికమ్స్‌ టైట్‌.


 • ఉతకడం
  మా అమ్మ రోజూ మా నాన్న బట్టలు ఉతుకుతుంది అన్నాడు హరి
  ఓసంతేనా? మా అమ్మయితే మా నాన్నను కూడా ఉతుకుతుంది రోజూ చెప్పాడు గిరి.


 • ఇలా
  టీచర్‌: ఆస్ట్రేలియా దూరమా? చంద్రుడు దూరమా?
  స్టూడెంట్‌: ఆస్ట్రేలియా 
  టీచర్‌: ఎలా? 
  స్టూడెంట్‌: చంద్రుడు కనిపిస్తాడు గానీ ఆస్ట్రేలియా కనిపించదు కదా మరి!


 • కింద పడిపోయాను
  తల్లి : ఎందుకు ఏడుస్తున్నావ్‌ బుజ్జీ!
  బుజ్జీ : ఇందాక కింద పడ్డాను. 
   తల్లి : ఎప్పుడు పడ్డావ్‌? 
   బుజ్జీ : అరగంట క్రితం 
   తల్లి : మరి ఇప్పటిదాకా ఏడవలేదుగా... 
   ఇప్పుడెందుకు ఏడుస్తున్నావ్‌? 
   బుజ్జీ : ఇంతసేపు నువ్వు బయటకెళ్ళావ్‌గా...
  
  


 • మంచి పనికి విరాళం
  ఒకతను పోలీసుశాఖలో చేరడానికొచ్చాడు. ఇంటర్వ్యూలో "మీ చుట్టూ జనం గుమికూడారు అని అనుకోండి, వారిని చెదరగొట్టడానికి మీరు ఏమిచేస్తారు?" అని ఆ వ్యక్తిని అడిగారు, "ఏముంది? నా తల టోపీని చేత్తో పట్టుకుని ఒక మంచి పనికి ధారాళంగా విరాళం ఇవ్వండి అని అందరిని అడుగుతాను" అని జవాబిచ్చాడు.


 • సిగ్గు...
  చిన్ను: ఆ రోజు అలా ఎందుకేడ్చానో తెలీదు గాని తల్చుకుంటే ఇప్పటికీ భలే సిగ్గేస్తూ ఉంటుంది.
  లల్లీ: ఎప్పుడు? 
  చిన్ను: అదే... నేను పుట్టినప్పుడు... 


 • డెడ్‌ సీ
  డెడ్‌ సీ... అనే సముద్రం గురించి నీకు తెల్సింది చెప్పరా బుజ్జీ!
  అరెరే... ఆ సముద్రానికి జబ్బు చేసిందన్న సంగతి కూడా నాకు తెలియదు టీచర్‌...


 • బతుకు తెరువు
  పోలిస్‌ ఇన్‌స్పెక్టర్‌ : పట్టుబడ్డ దొంగతో…
  దొంగతనాలు చేసి ఇలా జైళ్లలో పడకపోతే మీలాంటివాళ్లు ఇంకో బతుకు తెరువు చూసుకోవచ్చుగా! 
  దొంగ: అలా అయితే మరి మీకు పని ఎలా?


 • విశ్రాంతి
  నీరసంగా ఉంటోంది. పరీక్షించండి డాక్టర్‌! అంది ఒకావిడ డాక్టర్‌ దగ్గరకొచ్చి కూలబడుతూ. ఆయన పరీక్షించి మీకు విశ్రాంతి అవసరం అన్నాడు. కాస్త నాలుక కూడా చూడండి అందావిడ.
  నేను విశ్రాంతి అన్నది దానికే అన్నాడు డాక్టర్‌.


 • అర్జెంట్‌
  శ్రీను: వేగంగా పరిగెడుతున్నావు ఎందుకురా?
  రవి: ఈ లెటర్‌ను అర్జెంట్‌గా డెలివరీ చేయాలి
  శ్రీను: ఎక్కడ? 
  రవి: అబ్బ! అడ్రస్‌ చూసుకునేంత టైం లేదు రా అంటూ మళ్లీ పరుగెత్తడం ప్రారంభించాడు అయోమయం రవి.


 • హమ్మయ్య...
  బన్నీ: నీకు పళ్లు ఉన్నాయా?
  తాత: ముసలాడినయ్యాను కదా. ఒక్క పన్ను కూడా లేదు... 
  బన్నీ: అయితే ఈ బఠానీల పొట్లం నీ దగ్గర ఉంచు తాతయ్యా. ఆడుకుని వస్తాను.


 • తప్పు చేస్తే...
  కష్టమర్లతో దురుసుగా వ్యవహరించినందుకు రాజును షాపు యజమాని పనిలోంచి తీసేశాడు.
  నెలరోజుల తరువాత పోలీస్‌ యూనిఫాంలో కనబడ్డ రాజుని షాపు యజమాని పలకరించాడు. 
  పోలిస్‌గా చేరినట్టున్నావ్‌ ఎందుకు? 
  వెంటనే ఇక్కడైతే ఎప్పుడూ కష్టమరే తప్పు చేస్తాడు కదా" బదులిచ్చాడు రాజు.


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: