telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 6 7 8 9 10 11 12 13 14 15 > >>  

 • గిప్ట్‌...
  పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ నాన్న అందరూ ఇటు రండీ… అని పిలిచాడు.
  వాళ్ళు నాన్న దగ్గరికి వచ్చారు. 
  అమ్మ అల్లరి చేయద్ధని చెప్పింది. బుద్దిగా కూర్చోమని చెప్పింది. మీరేమో ఇలాఅల్లరి చేస్తున్నారు. ఎవరైతే అమ్మ మాట బుద్ధిగా వింటారో, చెప్పిందే చేస్తారో వాళ్ళకు గిప్ట్‌ ఇవ్వాలనుకుటున్నాను. 
  మీలో ఆ బుద్ధిమంతుడు ఎవరో చేతులెత్తండి. అని అడిగాడు నాన్న. 
  పిల్లలు ఎవరూ చేతులెత్తలేదు. 
  అదేమిటీ? గిప్ట్‌ గెలుచుకోవాలని లేదా? అడిగాడు నాన్న. 
  గిప్ట్‌ మీరు తీసుకోవడమే హండ్రెడ్‌ పర్సంట్‌ కరెక్ట్ అని చిన్నగా గొణిగారు పిల్లలందరూ.


 • ఫ్యూచర్‌లో…
  పిల్లలూ ఇవాళ మనం అందరం కలిసి గ్రూప్‌ ఫోటో దిగుతున్నా. ఒక్కసారి ఆలోచించి చూడండి… ఈ ఫోటోను మీరు పెద్దయ్యాక చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఫోటో ఎవరికైనా చూపిస్తూ ఇతను ఫలానా అబ్బాయి, ప్రస్తుతం డాక్టర్‌.
  ఈవిడ ఫలానా అమ్మాయి. ప్రస్తుతం లాయర్‌గా పనిచేస్తోంది …అని సంతోషంగా చెప్పచ్చు అన్నారు టీచర్‌. 
  ఈయన మా టీచర్‌ ఇప్పుడు లేరు అని కూడా చెప్పచ్చు కదా సార్‌! వెనుక నుంచి ఎవరో తుంటరి స్టూడెంట్‌ వినీవినిపించననట్లుగా అన్నాడు.


 • చీకట్లో…
  చింటూకు చీకటి అంటే చచ్చేంత భయం.ఒకరోజూ వాళ్ళ అమ్మ చింటూను పిలిచి వంటగది పక్కన ఉన్న గదిలోకి వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది.ఆ గదంతా చీకటి. నేను వెళ్లను అని మారాంచేశాడు చింటూ.
  చీకటి అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు. వెలుగు లోనే కాదు చీకట్లో కూడా దేవుడు ఉంటాడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు అని ధైర్యం చెప్పింది అమ్మ. 
  నిజమా? అని ఆశ్యర్యంగా అడిగాడు చింటూ. నిజంగానే అని గట్టిగా చెప్పింది అమ్మ. చింటూ వంటగది పక్కన ఉన్న గది దగ్గరకు వెళ్ళాడు. లోపలకి వెళ్ళకుండానే… 
  దేవుడా ప్లీజ్‌… ఈ గదిలో కుర్చీ ఉంది. నేను ఇక్కడే ఉంటాను తెచ్చి ఇవ్వవా అని అరిచాడు.


 • ఇక్కడే…
  మామిడితోటలో ఒక చెట్టు ఎక్కి దొంగతనంగా మామిడి కాయలు కోస్తున్న రాము తోటమాలికి దొరికిపోయాడు.
  తోటమాలి: ఒరేయ్‌... ఈ వయసులోనే దొంగతనాలు చేస్తున్నావా? మీ నాన్నతో చెప్పి ఎముకల్లో సున్నం లేకుండా తన్నిస్తాను. మీ నాన్న ఎక్కడ ఉంటాడో చెప్పు? 
  రాము : ఇక్కడే ఉన్నాడు 
  తోటమాలి : (ఆశ్చర్యంగా) ఎక్కడ? 
  రాము : అదిగో ఆ చెట్టు మీద...
  


 • మాయం
  టీచర్‌ : పాఠం విన్నారు కదా! ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను…
  పిల్లలు : అడగండి టీచర్‌…
  టీచర్‌ : ఇనుప వస్తువు ఒక రాత్రంతా వర్షంలో తడిస్తే ఏమవుతుంది? 
  పిల్లలు : తుప్పు పడుతుంది. 
  టీచర్‌ : అదే బంగారు వస్తువుని ఉంచితే… 
  పిల్లలు : మాయమవుతుంది.


 • వ్యాపారం
  రమేష్‌ : నువ్వు వ్యాపారం లో ఎలా దెబ్బతిన్నావ్‌!
  రాహుల్‌ : విపరీతంగా ప్రకటనలు ఇవ్వడంవల్ల.
  రమేష్‌ : నాకు తెలిసి నువ్వు ప్రకటనలకు పైసా ఖర్చు చేయలేదు! 
  రాహుల్‌ : కరెక్టే! కాని నాకు పోటీగా ఉన్నవాళ్ళు ఖర్చుపెట్టారు మరి!


 • పరిగెత్తి వెళ్ళిపోయాడు
  ఆ అందమైన పొడుగాటి అబ్బాయికి ఏమైందో నాకు అర్ధం కావడం లేదు.
  నిమిషం క్రితం వరకూ నాతో సరదాగా మాట్లాడిన వాడు హఠాత్తుగా తెల్లమెహం 
  వేసి బెరుకు బెరుకుగా లేచి – మళ్ళి చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు 
  అంది గిరిజ, వాణితో… 
  బహుశా నేను రావడం చూశాడేమో! అంది వాణి. 
  అతడు నీకు తెలుసా? ఆశ్చ్యర్యంగా అడిగింది గిరిజ, అతను నా భర్త కూల్‌గా చెప్పింది గిరిజ..


 • ఆఫీసరు
  రఘు: మా ఆఫీసరు పరమ కర్కోటకుడు. లంచాలు తీసుకుంటే ఊరుకోడు.
  వాసు: సస్పెండ్‌ చేస్తాడా? 
  రఘు: ఊహు! సగం వాటా ఇచ్చేదాకా ఒంటికాలు మీద నిలబడతాడు.


 • చివరి కోరిక
  మరో రెండు నిమిషాల్లో నీకు ఉరిశిక్ష అమలు జరుగుతుంది. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. తీరుస్తాం అన్నాడు జైలర్‌. నా మెడకేదైనా తగిలితే నాకు చచ్చే చక్కిలిగిలిగా ఉంటుంది. అందువల్ల ఉరితాడు నా నడుముకు వేసి ఉరి తియ్యండి చివరి ఆశగా అన్నాడు ఖైదీ.


 • చిక్కదనం
  ఏం రాజూ... ఈ మధ్య పాలు బాగా చిక్కగా ఉంటున్నాయి. ఎప్పుడూ ఇలాగే పొయ్యవచ్చుగా అంది మంగమ్మ పాలవాడితో. మా ఇంట్లో బోరింగ్‌ చెడిపోయిందమ్మా చెప్పాడు పాలవాడు.


 • ఏడుపు
  ఏమండీ... నేను చచ్చిపోతే ఏడుస్తారా? గారంగా అడిగింది భార్య. హు... ఇప్పుడు మాత్రం నవ్వుతున్నానా సరోజా!... అన్నాడు భర్త.


 • అందుకే తక్కువ చదివి
  తండ్రి: ఒరేయ్‌ బడుద్ధాయ్! నీ చదువు కోసం ఎంత డబ్బు తగలెయ్యాల్సి వస్తోందో నీకేమైనా ఒళ్ళూ పై తెలుస్తోందా?
  కొడుకు: తెలుస్తోంది డాడీ! అందుకే నేను చాలా తక్కువ చదివి నీకు ఖర్చు అవకుండా చూస్తున్నాను.


 • నేనెప్పుడన్నా ఏడ్చానా...
  యజమాని ఇంటికి రాగానే కారిడార్లో ఏడుస్తూ కనిపించాడు నౌకరు. కారణమడిగాడు యజమాని.
  అమ్మగారు కొట్టారండి. 
  ఛ.. ఊరుకో! ఇంతమాత్రానికే ఏడవాలా. నేనెప్పుడన్నా ఏడవటం చూశావా? పరధ్యానంగా అనేసి నాలుక్కరచుకున్నాడు యజమాని.


 • ఓస్‌ ఇంతేనా...
  పి.ఏ. పోస్టుకోసం ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. చూడమ్మా! మాకు నీలాంటి యంగ్‌లేడీ అక్కర్లేదు. కాస్త వయసు పైబడిన వారు కావాలి అన్నారు ఇంటర్వ్యూ బోర్డు అధికారి.
  ఓస్‌ ఇంతేనా... కాస్త ఉండండి. క్షణంలో నా మేకప్‌ తీసేసి వస్తా అంటూ పక్క గదిలోకి వెళ్ళిందామె.


 • తొలగించడం
  పార్టీ కార్యాలయంలో క్రేను రెడీగా పెట్టారెందుకు?
   బహుశా మంత్రిగారిని పార్టీనుంచి తొలగించబోతున్నారనుకుంటా 
   ఆ. . . ! 


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 6 7 8 9 10 11 12 13 14 15 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: