telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

 • బెదిరింపు లెటర్
  ఆ సినిమా డైరెక్టర్‌కి వచ్చిన బెదిరింపు లెటర్ రాసిందెవరో ఎలా కనుక్కోగలిగారు?
  లెటర్లో చివర వివరాలకు ఈ క్రింది అడ్రసులో సంప్రదించండి అని రాసివుంది.


 • ఒక్క పెగ్గు మాత్రమే
  తాగుడు మానడానికి టానిక్ ఇచ్చాను కదా!
   రోజుకి ఎన్నిసార్లు తాగుతున్నావు? 
  ఒక్క పెగ్గు మాత్రమే డాక్టర్!


 • జీతం ఎంత
  ఈ ఇంట్లో బట్టలుఉతకడం అంట్లుతోమడం వంటపని అంతా నేనే చేస్తాను మరి!
   అలాగా జీతం ఎంతిస్తారేమిటి? 
   అయ్యో జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది కదా! 


 • పోలీసుని మోసం చేయడం
  ఒక పల్లెటూరి వాడు ఢిల్లీ వెళ్ళివచ్చి తన భార్యతో
   నేను ఢిల్లీలో పోలీసులని భలే మోసం చేశాను. 
  భార్య : ఏం చేశారు? 
  భర్త : నేను 20 అంతస్తుల బిల్డింగ్‌లోని 15వ అంతస్తు చూస్తున్నప్పుడు పోలీసు వచ్చి నువ్వు ఎన్నో అంతస్తు చూస్తున్నావు? అని అడిగాడు
  నేను 5వ అంతస్తు చూస్తున్నాను అన్నాను
  పోలీసు 5 రూపాయలు పెనాల్టీ వేశాడు. ఆ విధంగా నేను 5 రూపాయలకి పోలీసుని మోసం చేశాను


 • టమోటాలు ఏరుకోవడం
  ఒకతను కూరగాయల దుకాణంలో చిన్న చిన్న టమోటాలు ఏరుకోవడం చూసి దుకాణం వాడు
   ఏం సార్! ఈ రోజు ఎక్కడైనా కవి సమ్మేళనం వున్నదా? అని అడిగాడు.


 • నైట్ డ్యూటీ
  నైట్ డ్యూటీలో వున్న ఒక పోలీసు ఒక దొంగను చూసి పట్టుకోవడానికి అతనిని వెంటాడాడు.
  కొంత దూరం వెళ్ళగానే పోలీసు దొంగతో నా ఏరియా ఇక్కడితో అయిపోయింది. 
  ఇక నీవు నెమ్మదిగా నడిచి వెళ్ళొచ్చు అని అన్నాడు.


 • ప్రయాణం
  టీచర్: ఒక ప్రయాణికుడు రోజుకి 10 మైళ్ళు చొప్పున వారానికి ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తాడు?
  స్టూడెంట్: 60మైళ్ళు సార్ 
  టీచర్: ఎలా? 
  స్టూడెంట్: ఆదివారం సెలవు కదా సార్! 


 • డూప్లికేట్
  భర్త: డార్లింగ్ నీ కోసం. . . నీ పుట్టిన రోజు కానుకగా ఈ నెక్లెస్ తెచ్చాను.
  చూసావా? ఎలావుందో? 
  భార్య:  మరి! ఈసారి పుట్టిన రోజుకు కారును తెచ్చి ఇస్తానన్నారుగా 
  భర్త:  గోల్డ్ నెక్లెస్‌కు డూప్లికేట్‌గా రోల్డ్‌గోల్డ్ తెచ్చాను. కానీ కారుకు డూప్లికేట్ కారు మరి వుండదుగా


 • పనులు చేయడం
  అలిగి పుట్టింటీకొచ్చిన కూతురు తిరిగి కాపురాని కెళ్తుంటే తల్లి అడిగింది.
   ఏమ్మా నీ తప్పు తెల్సుకున్నావా? అని 
   అది కాదు ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. అక్కడయితే అన్ని పనులూ ఆయనే చేస్తారు ఈ నిజం తెల్సింది నాకు అంది.


 • సెల్‌ఫోన్‌ రిపేర్‌
  పెద్దమనిషి: ఏంటయ్యా సెల్‌ఫోన్‌ రిపేర్‌ చెయ్యమంటే చాలా టెన్షన్‌గా వున్నట్లుంది యోగాభ్యాసము నేర్చుకోమని నాకు సలహా ఇస్తున్నావు ఎందుకని?
  రిపేరర్‌ : సార్‌ మీ చేతిలో వున్నది టి.వి.రిమోట్‌ కంట్రోల్‌.


 • ఇంజెక్షన్లు
  విలేఖరి: డాక్టరీ చదివి రాజకీయ నాయకుడైన మీరు మీ విద్యానుభవం ఎలా ఉపయోగిస్తున్నారు?
  నాయకుడు:  తరచూ నా ప్రత్యర్ధులపై కోర్టు ఇంజెక్షన్లు వచ్చేలా చూస్తున్నానుగా .


 • నన్ను ఏమి చేయమంటారు?
  స్త్రీ: డాక్టరుగారు నన్ను ఏమి చేయమంటారు. నాచిన్న కొడుకు నాకిష్టమైన పెన్నును మింగాడు! డాక్టరు: ఏం పరవాలేదు. పెన్ను లేకపోతే ఏమి? మీరు పెన్నిల్‌తో రాసుకోవచ్చును.


 • తెలుసు
  టీచర్: పైనాపిల్‌ గురించి ఎవరికైనా తెలుసా?
  స్టూడెంట్: నాకు తెలుసు టీచర్. పైన్‌ అనే చెట్టుకు కాసిన యాపిల్‌ను పైనాపిల్ అంటారు.


 • క్యాన్సిల్
  గోపి : ఒరేయ్ రాజా, నీ దగ్గర రెండు సెల్‌ఫోన్సు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా
  రాజు : అదేంట్రా అలా అడుగుతావ్‌. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటి! 
  గోపి : నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా 
  రాజు : ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండటానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను 
  గోపి : నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా 
  రాజు : ఏరా నీకింకా నమ్మకం కలగలేదా, 
  గోపి : రెండు కలర్ టీవీలుంటే... 
  రాజు : నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావ్ కదూ. ఈ ప్రశ్న క్యాన్సిల్ 
  గోపి : ఆ ...!


 • ఇంగ్లీష్‌ రాదా!
  వాటీజ్‌ యువర్ నేమ్‌ అడిగాడు ఇంటర్వ్యూ చేసే అధికారి.
   మేరా నామ్‌ సూరజ్ ప్రకాశ్‌ హై 
   ఇంగ్లీష్‌లో అడిగితే హిందీలో చెప్తావే. ఇంగ్లీష్‌ రాదా 
   ఎందుకు రాదు. మై నేమ్‌ ఈజ్‌ సన్‌లైట్.


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 7 8 9 10 11 12 13 14 15 16 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: