telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

 • అంతే!
  రవి: మీ నాన్నగారి వయసెంతరా?
  వాసు: నా వయసెంతో అంతే. 
  రవి: అదెలా 
  వాసు: నేను పుట్టినప్పుడే ఆయన నాన్నయ్యారు.


 • ఎక్కడ రాయాలి!
  టీచర్: రమేష్‌ బోర్డుమీద యాభై ఐదు వెయ్యి
  రమేష్‌: ఎలా రాయాలి టీచర్ 
  టీచర్: ఐదు వెయ్యి. దాని పక్కన మరో ఐదు వెయ్యి 
  రమేష్‌ ఒక ఐదు వేసి ఆగిపోయాడు. 
  టీచర్: ఏమైంది ఇంకో ఐదు వెయ్యవే్ 
  రమేష్‌: ఆ ఐదుని ఈ ఐదుకు ఏ పక్కన వేయాలా అని ఆలోచిస్తున్నాను టీచర్.


 • నిద్ర
  భగవాన్: ఒరేయ్ భజ గోవిందం! నీ ఆఫీస్‌లో పని చేసే వారంతా ఎంచక్కా నిద్రపోతున్నారు.
  
  భజ గోవిందం: ఆరేళ్ళుగా ఈ ఆఫీస్ మేనేజర్‌గా అఘోరిస్తున్నాను నాకు తెలియదట్రా? నన్ను నిద్ర లేపి మరీ చెప్పాలంట్రా!


 • చరిత్ర
  టీచర్: రామూ ... మొఘలాయిల పాలన ఎక్కడ్నుంచి మొదలై ఎక్కడ పూర్తయింది?
  రాము: 150వ పేజీలో మొదలై 200 లో ముగిసింది టీచర్.


 • తెలుసా?
  నాకు టెన్నిస్ గురించి అంతా తెలుసు కాస్త గొప్పగా చెప్పాడు చంటి వాళ్ల స్నేహితుడితో.
   ఓహో ... అయితే టెన్నిస్ బ్యాట్ నెట్‌లో ఎన్ని రంధ్రాలుంటాయో కాస్త చెప్పు? అడిగాడా స్నేహితుడు.


 • భారమే
  టీచర్: మూడో ప్రపంచ యుద్దం మొదలైతే ఏమౌతుంది?
  వెంకట్: అమ్మో ... నాకు చాలా భయంగా ఉంది. 
  టీచర్: ఎందుకు? 
  వెంకట్: మన చరిత్ర పుస్తకంలో మరో చాప్టర్ పెరుగుతుంది కదా టీచర్!


 • దూరం
  టీచర్: రామూ ... ఇంగ్లీష్‌లో అతి పెద్ద పదం ఏదైనా చెప్పు?
  రాము: SMILE 
  టీచర్: ఎలా? 
  రాము : ఈ పదంలో MILE దూరం ఉంది కదా టీచర్!


 • అవును, చిత్రమే
  టీచర్ చింటూ నీ సాక్సులు విచిత్రంగా ఉన్నాయే. ఒకటి తెలుపు మరోటి నలుపు?
  చింటూ అవును టీచర్ ఇలాంటిదే మరో జత కూడా ఉంది నాకు.


 • నాకొద్దులే
  భర్త ఆఫీసు నుంచి ఫోన్‌ చేశాడు.
   ఈ రోజు ఏం వండావ్ అడిగాడు. 
   విషం చెప్పింది గయ్యాళి భార్య. 
   నువ్వు తినేసి పడుకో. నేను రావటం ఆలస్యమవుతుంది .


 • తిండి
  అన్నీ తినాలిరా అలా వదిలేయకూడదు.
  ఆ తోటకూర తిను బలం కూడాను. 
  అంది బామ్మగారు. 
  మనమడు కంచంలో వదిలేసిన కూరని చూస్తూ. 
  నీకు తోటకూర కూర అంతిష్టమా బామ్మా? 
  చాలా ఇష్టం
  అయితే ఇది కూడా నువ్వే తిను


 • పరిగెత్తడం
  ఒకాయన పేపరు చదువుతూ భార్యకు వినిపించేలా ఇలా అన్నాడు. .
  ఒకావిడ బొంబాయిలో 100 యార్డ్‌ డేష్‌ 10 సెక్షన్ల పరిగెత్తిందట. . . 
  అంటూ భార్యకేసి చూసి 
  అంటే నువ్వు బ్యాంకులో డబ్బు తీసుకోడానికి వెళ్లేంత స్పీడు అంతన్నమాట. 
  ఆవిడ గొప్ప ఘనకార్యం చేసినట్టు రాస్తారేమిటో 
  అంటూ ఆశ్చర్యపోయాడు.


 • ఉద్యోగ బాద్యతలు
  ఈ ఉద్యోగంలో అన్ని బాధ్యతలు నువ్వే వహించాలి
  అన్నారు ఎం.డీ.గారు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న గురునాధాన్ని చూస్తూ. 
  అలాగే సార్‌ కిందటిసారి నేను చేసిన ఉద్యోగంలో కూడా ఏదైనా పనిపాడైపోతే నేనే బాధ్యుణ్ణి అనే వారండి అక్కడి వాళ్ళంతా.


 • అప్పులు
  వాడికొచ్చే డబ్బులని ఏం చేస్తాడో తెలీదు.
  ఎప్పుడూ డబ్బులు అయిపోయాయని అప్పులు అడుగుతుంటాడు. 
  ఏం నిన్ను అడిగాడా? 
  లేదు. నేనే వాణ్ణి అడగాలనుకుంటున్నాను


 • పళ్ళు పీకడం
  ఈ దవడ పళ్ళు పీకడానికెంత పుచ్చుకుంటారు?
  వెయ్యి రూపాయలు 
  అయ్యబాబోయ్‌ వెయ్యే?! దాని బదులు రోడ్డు మీద ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటానులెండి


 • పాపులారిటి
  సుబ్బారావుగాడికి ఇంత పాపులారిటీ వుందని నాకు నిన్నటివరకూ తెలీదు. . .
   ఏమయ్యింది? 
   నిన్న గుడికివెళితే చాలామంది వాడు చల్లగా వుండాలని వాడి పేరు మీద పూజలు చేయిస్తున్నారు. . . 
   నిజంగానా? 
   అవును. . . వాళ్ళంతా సుబ్బారావు అభిమానులా?
   కాదు. . .సుబ్బారావుకు అప్పులిచ్చినవాళ్ళు. . 


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 8 9 10 11 12 13 14 15 16 17 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: