telugudanam.com

      telugudanam.com

   

 

హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

  • వ్యక్తిగతమైన టెలిఫోన్‌ కాల్స్‌
    ఒక హొటల్‌లో వినబడిన మాటలు: "ఏం చేయమంటావు. ఆఫీసులో నాబాస్‌ వ్యక్తిగతమైన టెలిఫోన్‌ కాల్స్‌ను చేయనివ్వడు. ఇంట్లో నా భార్య, కూతురు కలిసి నన్ను చేయనివ్వరు."


  • జైలు
    ఆ కోట్లాటల్లో నిన్ను పట్టుకుని జైల్లో పడేయడానికి 10 మంది పొలీసులు కావల్సొచ్చిందన్నమాట?
     ఔననుకోండి. . .కానీ ఒక్కడు చాలండి నన్ను జైల్లోంచి తప్పించడానికి


  • ఈగలు
    కుక్కని ఇంట్లోకి తీసుకురాకు అన్నీ ఈగలే
    గట్టిగా కేకలేసింది తల్లి బుజ్జి ఇంట్లోకి తీసుకొస్తున్న కుక్కను చూసి.
     టామీ. . .ఇంట్లోకెళ్ళొద్దేం ఈగలున్నాయట ఇంటి నిండా
    అంది బుజ్జి.


  • మతిమరుపు
    నాకు సహాయం చెయ్యాలండీ నాకు ఈమధ్య మతిమరుపు ఎక్కువైంది
    బ్రతిమాలుతూ చెప్పాడు హిప్నాటిస్ట్‌కి. 
    దాని గురించి నువ్వు బెంగపెట్టుకోవద్దయ్యా 
    శుభ్రంగా దాని గురించి మరచిపోయి హాయిగా నిద్రపో.


  • మానలేము
    ఒక కానిస్టేబుల్‌ సంకెళ్లు వేసి ఒకణ్ణి పోలీసుస్టేషన్‌కి తీసుకొచ్చాడు.
    ఎస్‌.ఐ. గారు వాణ్ణి ఒకసారి కోపంగా చూసి కానిస్టేబుల్‌ని అడిగాడు. 
     ఇదివరకటి రికార్డులేవైనా వున్నాయా? అని 
     ఉన్నాయండి నాలుగు ఘంటసాలవి ఎనిమిది ప్రైవేటు పాటల రికార్డులు ఇతని దగ్గర సంచీలో వున్నాయండి చెప్పాడు కానిస్టేబుల్‌.
    


  • దిగులు
    తిండైనా మానగలను కానీ పేకాట ఆడనిదే బతకలేను
     మీ ఆవిడ ఏమీ అనదా? 
     అనదు. వంటేనా మానేసుంది కానీ టీవీ సీరియల్స్ చూడ్డం మాత్రం మానలేదు.


  • స్కూలికి లేటుగా రావడం
    టీచర్‌ కోపంగా అంది.
    విజయ్‌ నువ్వు స్కూలుకి రోజూ లేట్‌గా వస్తున్నావు. 
    రోజూ నువ్వు లేట్‌గా వస్తున్నట్లు ఈ రిజస్టర్‌లో మార్క్‌చేసి ఉంది. 
    ఒక్క శుక్రవారం తప్ప అన్ని రోజులు లేటే. 
    కారణం ఏమిటీ? 
     శుక్రవారం నేను స్కూలుకి రాలేదు టీచర్‌.


  • స్వెట్టర్‌
    ఈ స్వెట్టర్‌ అంతా ఊలుదేనా?
    మీతో అబద్దాలాడి మోసం చేయాలని లేదు. 
    ఈ స్వెట్టర్‌ అంతా ఊలుదే. 
     కానీ బొత్తాలు మాత్రం ప్లాస్టిక్‌వండి .


  • వివాహం
    మా వివాహం నమ్మకం అర్థం చేసుకోవటం మీద ఆధారపడివుంది. . .
    ఓ భర్త గొప్పగా చెబుతున్నాడు. 
     ఎలా?  
    మా ఆవిడ నన్ను ఎప్పటికీ నమ్మనే నమ్మదు. . . 
     నేను ఎప్పటికీ ఆవిడను అర్థం చేసుకోలేను. . . 


  • ఏనుగు జ్ఞాపకశక్తి
    ఏనుగుకు జ్ఞాపకశక్తి ఎక్కువ. . .
    ఎందుకని? 
     అది గుర్తుపెట్టుకోవటానికి ఏం లేదు కాబట్టి. . . 


  • సోమరిపోతు
    బాగా సోమరిపోతు ఎవరు?
     గర్భవతిగా వున్న అమ్మాయిని పెళ్ళి చేసుకునేవాడు. . . 


  • విషం
    నీలాంటి భర్తకు విషం ఇచ్చి చంపినా తప్పులేదు. . .
     నిజమే. . . నీలాంటి పెళ్ళాం వున్నపుడు విషం త్రాగటమే సుఖం. . .


  • మగవాళ్ళు
    పెళ్ళి చేసుకున్న మగవాళ్ళు బ్రహ్మచారులకంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు తెలుసా?
     అవునా! నూరేళ్ళ ఆయిష్షు దినదిన గండం అన్నమాట. . .


  • అందంగా వున్నానా?
    ఈ స్వెట్టర్‌లో నేను అందంగా వున్నానా?
     ఫర్లేదులే. . . 
      అదేంట్రా అలాగంటావు?
     ఈ స్వెట్టర్‌ నీ వంటి మీద కంటే గొర్రె వంటి మీద ఊలు రూపంలో వుంటే ఇంకా అందంగా వుండేది. . .!


  • వెధవ
    నేను వెధవ అని అందరికీ చెబుతున్నావంట. . .
     సారీ. . .  
     ఎందుకు? 
     నువ్వు వెధవ అన్న విషయం రహస్యం అని నాకు తెలీదు. . . 


హాస్య సంపద - [717 జోకులు 48 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: