telugudanam.com

      telugudanam.com

   

భక్తి గీతాలు (కొన్ని)

అదివో అల్లదివో

అదిగో అల్లదిగో శ్రీహరివాసము

పదివేల శేషుల పడగలమయము

అదె వేంకటాచల మఖిలోన్నతము

అదిగో బ్రహ్మాదుల కపురూపము

అదిగో నిత్యనివాస మఖిలమునులకు

అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము ||అదిగో||

చెంగట నల్లదిగో శేషాచలము

నింగినున్న దేవతల నిజనివాసము

ముంగిట నల్లదిగో మూలనున్న ధనము

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||అదిగో||

కైవల్య ప్రదము శ్రీ వేంకట నగమదిగో

శ్రీ వేంకటాపతికి సిరులైనదీ

భావింప సకలసంపదరూప మదిగో

పావనముల కెల్ల పావన మయము ||అదిగో||


        ఏడుకొండల స్వామి

ఏడుకొండలస్వామి - ఎక్కడున్నావయ్యా

ఎన్ని మెట్లెక్కినా - కానరావేమయ్యా

ఆకాశమందూ ఈ కొండ - శిఖరమ్ము పై

మనుజులకు దూరంగా - మసలుతున్నావా ||ఏడు||

ఎచ్చోటగాంచినా - నీవుందూవందురూ

ఏమిటో నీమాయా - తెలియకున్నామయ్య

ఈయడవి దారిలో - చేయూత నీయవా

నీపాదసన్నిధికి - మముజేరనీయవా ||ఏడు||


కొండలలో నెలకొన్న...

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మరదాసుడైన కురువరతి నంబి

ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు

దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న

చోటికి వచ్చి నమ్మినవాడు ||కొండ||

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి

ముచ్చిలివెట్టికి నన్ను యోచిననాడు

మచ్చికదొలక దిరుమలనంబి తోడుత

నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు ||కొండ||

కంచిలోననుండ దురుకచ్చినంబి మీద గరుణించి

తన యెడకు రప్పించిన వాడు

యెంచి నెరుడైన వేంకటేశుడు మనలకు

మంచివాడై కరుణ బాలించినవాడు


        కొలనిదోపరికి గొబ్బిళ్ళో

కొలనిదోపరికి గొబ్బిళ్ళో

యదుకులస్వామికి గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన

కొండొక శిశువుకు గొబ్బిళ్ళో

దుండగంపు దైత్యుల కెల్లను తల

గొండు గండనికి గొబ్బిళ్ళో ||కొలని||

పాప విధుల శిశుపాలుని దిట్టుల

కోపగానికిని గొబ్బిళ్ళో

ఏపుని గంసుని నిడముల పెట్టిన

గోపబాలునికి గొబ్బిళ్ళో ||కొలని||

దండి వైరులను దఱమి

దనుజుల గుండె గొబ్బిళ్ళో

వెండి పైడియిలు వెంకటగిరి పై

కొండలయ్యకును గొబ్బిళ్ళో ||కొలని||


గౌరమ్మ పాట

వరమివ్వు తల్లి అభయమివ్వు తల్లి

బాలాద్రి గౌరమ్మ భాగ్యమివ్వు తల్లి ||వ||

పసుపు కుంకుమ తెచ్చి పూజ చేసేను

పచ్చాని ఐదవతనము మాకివ్వవే ||వ||

పచ్చాని అక్షింతలు తెచ్చి పందిట్లో జలకమాడి

పచ్చాని అష్ట్యైశ్వర్యములు మాకివ్వ తల్లి ||వ||

పూట పుష్పాలు తెచ్చి పూజ చేసేదా

పుత్రసంతానము మా కివ్వు తల్లి ||వ||

జోడు జాట్టాలు కట్టి జోజోయని ఊపి

జోలలు పాడేటి భాగ్యమివ్వు తల్లి ||వ||

రాజరాజేశ్వరీ రాజమనోహరి

రాజ్యము లేలేటి భాగ్యమివ్వు తల్లి ||వ||


        చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా

చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా

కన్నుమూసి తెర్చులోపల కవిమిలేములు మారురా.

మాయసంసారంబురాయిది మనసునిలుకడ లేదురా

నాదినీదియనుచు నరుడా వాదులాడబోకురా

బంకమట్టియిల్లురా యిదిభగ్గుబుగ్గియౌనురా

ఆలుపిల్లలు ఆస్తిపాస్తులు అంతయుయేమౌనురా

రాజు రౌతుయనెడిభేదము బ్రతికియుండే వఱకురా

మట్టిమట్టికలసినాక యెట్టిభేధాలుండురా?

తత్త్వమర్మము తెలియలేకనే తప్పుదారినిపోకురా

ఆత్మయెపుడు చావులేకనె అంతట వెలుగొందురా!


జయ శ్రీరామా!

జయ శ్రీరామా!

రఘురామ శుభకర శ్రీరామా!

త్రిభువన జన నయనాభిరామా ||జయ||

తారకనామా...తారకనామా...

దశరధ రామా...థనుజవిరామా

పట్టాభిరామా... రామా రఘుకుల

జలనిధిసోమా భుమిసుతారామా

కామిత దాయకా కరుణాధామా

కోమలనీల సరోజా శ్యామ ||జయ||


        తిరుమల గిరువాస

తిరుమల గిరివాసా దివ్యమందహాస ||2||

వరదాభయ లీలావిలాసా నవ్యచిద్విలాసా ||తిరు||

మాకనుబొమ్మలే ఆలయమనుకోని మామనసే నీమందిరమనుకొని

మందార సుజన మందార నీదాసులందరిలో మమ్మధికులజేసేవా

సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా

ఆనంద పరమానంద మమ్మేల

సిగపాయచేనంది చిడిముడి చేసేవా "తిరుమలా''

కలలో పరదైవముపై తెలుగువారి ఇలవేలుపువై

సాకార నిగమాకార మాకైన దీవనలీవయ్య శ్రీవేంకటేశ ||తిరు||


దేవదేవ ధవళాచల మందిర

దేవదేవ ధవళాచల మందిర

గంగాథరా హర నమో నమో

దైవతలోక సుధాకర హిమకర

లోకశుభంకర నమో నమో ||దేవ||

పాలితశంకర భవనాశంకర

శంకర పురహర నమోనమో

హలహలధర శూలాయుధకర

శైలాసుతావర నమోనమో ||దేవ||

దురిత విమోచన పాలవిలోచన

వరమదయాకర నమో నమో ||దేవ||

కరిచర్మాంబర చంద్రకళాధర

సాంపి దిగంబర నమో నమో ||దేవ||


        నమో ఆంజనేయా నమో పవనపుత్ర

నమో ఆంజనేయా నమో పవనపుత్ర నమోనమో పవనపుత్ర ||న||

మహదివ్య తేజ నీ మహిమలెన్నతరమా "న"

సీతాన్వేషణకై శ్రీరాముడు నిను ఒంపా

దక్షిణదిశకేగి సీతమ్మను గాంచితివి ''సీ'' ||న||

ఘోరసంగ్రామములో లక్ష్మణుడు మూర్చిల్ల

సంజీవుని తెచ్చి సౌమిత్రిని గాంచితివి "సౌ" ||న||

భూతప్రేతములకు నీ నామమే మంత్రముగా

నిను ధ్యానించినదో భవబందము లోలగునుగా

భవ బంధము లోలుగునుగా ||న||

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: