telugudanam.com

      telugudanam.com

   

భక్తి గీతాలు (కొన్ని)

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ|

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ|

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ|

తస్మై మకారాయ నమశ్శివాయ|


మందాకీని సలిల చందన చర్చితాయ|

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ|

తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|


శివాయ గౌరీవదనారవిందాయ|

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ|

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ|

తస్మై శికారాయ నమశ్శివాయ|


వశిష్ఠ కుంభోద్బవ గౌతమార్య|

మునీంద్ర దేవార్చిత శేఖరాయ|

చంద్రార్క వైశ్వానరలోచనాయ|

తస్మై వకారాయ నమశ్శివాయ|


యక్ష స్వరూపాయ జటాధరాయ|

పినాక హస్తాయ సనాతనాయ|

సుదివ్య దేవాయ దిగంబరాయ|

తస్మై యకారాయ నమశ్శివాయ|

పంచాక్షర మిదం పుణ్యం - య:పఠే చ్ఛివ సన్నిధౌ

శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే.


        పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి ||పలుకే||

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి ||పలుకే||

ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి

కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి ||పలుకే||

రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి

జెందితివని ప్రీతితో నెరనమ్మితి తండ్రీ ||పలుకే||

ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు

పంతము చేయ నేనెంతవాడను తండ్రి ||పలుకే||

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాదా

కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే||


మంగళగౌరి మాహేశ్వరీ

మంగళగౌరి మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ

కరుణామయి నీ కంటిపాపలో

చల్లన పెరుగును ముల్లోకాలు ||క||

తల్లి నీపేరు తలచిన చాలును

కలిగెను శతకోటి కళ్యాణాలు ||మ||

అమ్మలగన్న అమ్మవునీవే

శుభములనోసగే శుభమూర్తి నీవే

వెండికొండపై వెలసింది నీవే

ఇంటింట నెలకొన్న ఇలవేల్పునీవే

మా ఇలవేల్పు నీవే ||మ||


        ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

దిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ

చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము

మితి గోవర్ధనపు గోమేధికము

సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము

గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే||

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము

యేలేటి శ్రీ వెంకటాద్రి యింద్రనీలము

పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము

బాలుని వలె దిరిగీ బద్మనాభుడు ||ముద్దుగారే||


రామకీర్తన

జగదభిరామా రఘుకులసోమా

శరణము నీయవయ్యా కరుణ జపవయ్యా

కాశికు యాగము కాచితివయ్యా

రాతిని నాతిగ జేసితివయ్యా

హరువిల్లు విరచి మురిపించి సీతను

వరిణయ మాడిన కళ్యాణరామా ||శరణము||

ఒకటే బాణం ఒకటే మాట

ఒకటే సతియని చాటితివయ్యా

కుజనుల నణచీ సుజనుల బ్రోచే

ఆదర్శమూర్తివి నీవయ్యా ||శరణము||

జయ జయ రామ జానకిరామ

పావననామ మేఘశ్యామా

కానలనేగి కాంతను బాసి

ఎంతో వేదన చెందితివయ్యా

అంతే కాని చింతల నెన్నో

ఎంతగ ఓర్చావు రామయ్యా ||శరణము||


        లలితగీతం

ఏడుకొండలస్వామీ ఎక్కడున్నావయ్యా

ఎన్ని మెట్లెక్కినా కాన రావేమయ్యా ||ఏడు||

ఆకాశామందూ ఈ కొండా శిఖరమ్ముపై

మనుజులకు దూరంగా మసలుతున్నావా ||ఏడు||

ఎచ్చోటగాంచినా నీవుందువందురూ

ఏమిటో నీమాయ తెలియకున్నామయ్య

ఈ యడవిదారిలో చేయూత నీయవా

వీ పాదసన్నిధికి మము జేరనీయవా ||ఏడు||


శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

సరోజాలతోనే పూజచేతు ఆ...

గులాబీలతోనే పూజసేతు "శి"

శంభుని రాణి చల్లని చూపు

భక్తావాళి భాధలు బాపు

ప్రార్ధింతుము రేపూ మాపు

గ్రహ బాధలు రూపు మాపు

స్తుతింతును రోజు రోజు

వెన్నెల కాంతులు మాపై నిలుపు

వికసించే నీ ముఖ బింబం

అరుణోదయ కాంతులచందం

పూజింతుము మరువకడెందం

తొలగింపుము హృదయబంధం

మరువక మా మానసంబున

బంగరు జ్యోతుల రంజిల్లవమ్మ


        శివుని మీద పాట

శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచిన దేవా

దేవి పిలుపులు ఆలకించేవా! శివనాగరాజా తల్లి పిలుపులు ఆలకించేవా ||శి||

అన్నపూర్ణా హైమావతి పంకజాక్షిపద్మావతి కాళికాంబ నిన్ను పిలచెనుగా!

శివనాగరాజా తల్లి పిలుపులు విన్నవించేవా ||శి||

కంచికామాక్షి నిన్ను పిలిచి ముధుర మీనాక్షిని పిలిచి కాళికాంబ నిన్ను పిలచెనుగా ||శి||

మల్లెపూల మాలలు కట్టి మణులమధ్య ఆరాధించి తులసి మాలలు తెచ్చినామయ్యా శివనాగరాజా

తల్లి పిలుపులు ఆలకించేవా!

బంగారపు గిన్నెలోనే పాలు తెచ్చిన పార్వతిదేవి పాలు ఆరగించి పోవయ్యా

శివనాగరాజా తల్లిపిలుపులు ఆలకించేవా ||శి||


సీతా కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే

రామ కళ్యాణ వైభోగమే ||సీ||

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర

రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ||సీ||

భక్త జన పరిపాల భరిత శరజాల

భుక్తి ముక్తిద లీల భూదేవ పాల

పామరా సురభీమ పరిపూర్ణ కామ

శ్యామ జగదభిరామ సాకేతధామ ||సీ||

సర్వలోకాధార సమరైకధీర

గర్వమానసదూర కనకాగధీర

నిగమాగమ విహార నిరుపమ శరీర

నగధ రాఘవిదార నతలో కాధార ||సీ||

పరమేశనుత గీత భవజలధిపోత

తరణికుల సంజాత త్యాగ రాజనుత ||సీ||

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: