telugudanam.com

      telugudanam.com

   

భక్తి గీతాలు (కొన్ని)

అలమేలుమంగనీ వభినవరూపము

అలమేలుమంగనీ వభినవరూపముజలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి

పరమానంద సంభిరతవై

నెరతనములు జూపి నిరంతరమునాథుని

హరుషింపగ జేసి తిగదమ్మ


శశికిరణములకు చలువలచూపులు

విశదముగా మీద వెదజల్లుచు

రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ

వశముజేసుకొంటి వల్లభునయమ్మ


రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు

పట్టపురాణివై పరగుచు

వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు

జట్టిగొని వురమునసతమైతివమ్మ


వలదననొరులకు

వలదననొరులకు వశమటవే

తలచినట్లనిది దైవమెచేసెతరుణికుచములను తామరమొగుడలు

విరిసేనోయని వెరపునను

సరగునపతినఖ చంద్రశకలములు

దరులుగలుగనిది దైవమెచేసెపొలతివదనమను పున్నమచంద్రుడు

బలిమినెగయునని భయమునను

మెలుతచికురధ మ్మిల్లపురాహువు

తలచెదరగనిది దైవమెచేసెవనితకువాడునొ వలపుతాపమున

తనులతికయనుచు తమకమున

ఘనవేంకటపతి కౌగిటచమటల

తనివి దీర్చనిది దైవమె చేసె


పురుషోత్తముడవీవు

పురుషోత్తముడవీవు పురుషాధముడనేను

ధరలోననాయందు మంచితనమేదిఅనంతాపరాధములు అటునేముసేసివి

అనంతమైనదయ అది నీది

నినునెఱగకుండేటి నీచ గుణము నాది

ననునెడయకుండేటి గుణము నీదిసకలయాచకమే సరుసనాకుపని

సకలరక్షకత్వము సరి నీపని

ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను

వెకలివైనను గాచేవిధమునీదినేరమింతయు నాది నేరుపింతయు నీది

సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు

యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి

ధారుణిలో నిండెను ప్రతాపమునీది


భక్తికొలది వాడే

భక్తికొలది వాడే పరమాత్ముడు

భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడుపట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు

బట్టబయటి ధనము పరమాత్ముడు

పట్టపగటి వెలుగు పరమాత్ముడు

యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడుపచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు

బచ్చనవాసినరూపు పరమాత్ముడు

బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు

యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడుపలుకులలోనితేట పరమాత్ముడు

ఫలియించునిందరికి పరమాత్ముడు

బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు

యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు


ఏమొకో చిగురుటధరమున

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను

భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదాకలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన

చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు

నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు

నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదాపడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల

కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు

వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు

వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదాముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల

వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు

గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల

అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: