telugudanam.com

      telugudanam.com

   

భక్తి గీతాలు (కొన్ని)

తెలిసిన వారికి దేవుండితడే

తెలిసిన వారికి దేవుండితడే

వలవని దుష్టుల వాదములేలపురుషులలోపల పురుషోత్తముడు

నరులలోన నరనారాయణుడు

పరదైవములకు పరమేశ్వరుడు

వరుసమూఢుల కెవ్వరోయితడుపలుబ్రహ్మలకును పరబ్రహ్మము

మలయునీశులకు మహేశుడితడు

ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు

ఖలులకెట్లుండునో కానము యితడువేదంబులలో వేదాంతవేద్యుడు

సోదించకరిగాచుచో నాదిమూలము

యీదెస శ్రీ వేంకటేశుడిందరికి

గాదిలి మతులను గైకొనడితడు


కొలిచిన వారల

కొలిచిన వారల కొంగుపైడితడు

బలిమి తారక బ్రహ్మమీతడుయినవంశాంబుధి నెగసిన తేజము

ఘన యజ్ఞంబుల గల ఫలము

మనుజరూపమున మనియెడి బ్రహ్మము

నినుపుల రఘుకుల నిథానమితడుపరమాన్నములోపలి సారపుజవి

పరగినదివిజుల భయహరము

మరిగినసీతా మంగళ సూత్రము

ధరలో రామావతారంబితడుచకితదానవుల సంహారచక్రము

సకలవన చరుల జయకరము

వికసితమగు శ్రీవేంకట నిలయము

ప్రకటిత దశరథ భాగ్యంబితడు


అంతరంగమెల్ల

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె

వింతవింత విధముల వీడునా బంధములుమనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా

తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా

ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా

పనిమాలి ముదిసితే పాసెనా భవముచదివియు ఫలమేది శాంతము కలుగుదాకా

పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా

మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా

యెదుట తాను రాజైతే ఏలేనాపరముపావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా

జీవించి ఫలమేది చింత దీరుదాకా

వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక

భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా


భక్తినీపై దొకటె పరమసుఖము

భక్తినీపై దొకటె పరమసుఖము

యుక్తిజూచిన నిజం బొక్కటేలేదుకులమెంత గలిగెనది కూడించు గర్వంబు

చలమెంత గలిగెనది జగడమే రేచు

తలపెంత పెంచినా తగిలించు కోరికలు

యెలమి విజ్ఞానంబు యేమిటాలేదుధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు

మొనయు చక్కదనంబు మోహములు రేచు

ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము

యెనయగ పరమ పద మించుకయులేదుతరుణులెందరు అయిన తాపములు సమకూడు

సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు

యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా

పెరిగె నానందంబు బెళకులికలేవు


విశ్వరూపమిదివో

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో

శాశ్వతులమైతిమింక జయము నాజన్మముకొండవంటి హరిరూపు గురుతైన తిరుమల

పండిన వృక్షములే కల్పతరువులు

నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు

మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మముమేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర

మాడనే వాలిన పక్షుల మరులు

వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము

యీడమాకు పొడచూపె ఇహమేపోపరముకోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి

యీటులేని శ్రీ వేంకటేశుడితడు

వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ

కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: