telugudanam.com

      telugudanam.com

   

ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై

కనిపించదే నేడు కాకతీయ ప్రాజ్య

సామ్రాజ్య జాతీయ జయపతాక;

వినిపించదే నేడు విద్యానగర రాజ

సభలోని విజయ దుందుభుల మ్రోత;

వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై

తాండ్ర పాపయ తళతళల బాకు;

నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప

ల్నాటి యోధుల సింహనాదలక్ష్మి;

చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని,

అంధ్ర పౌరుషమిప్పు డధ్వాన్నమయె;

మరలనొక మాటు వెనుకకు మరలి

చూచి దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగు తల్లి!

కవులకు బంగారు కడియాలు తొడిగిన

రాయల గన్న వరాల కడుపు

సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ

నాధుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో

పన్నను గన్న పుత్తడి కడుపు

జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప

రాయని గన్న వజ్రాల కడుపు

పిసినిగొట్టు రాజులకును, పిలక జుట్టు

కుకవులకు, పిచ్చి పిచ్చి భక్తులకు, పిరికి

పందలకు తావు గాకుండ ముందు ముందు

దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగుతల్లి!

అభ్రకసంబగు హిమాలయంబే తల్లి

మౌళి జుట్టిన మల్లెపూల చెండు

గోదావరి కృష్ణ లేవేవి కటిసీమ

వ్రేలాడు ఆణిముత్యాల నదులు

ఆంధ్ర సముద్రమీ యమ్మ పాదాలపై

జీరాడు పట్టుకుచ్చెల చెరంగు

ఎనుబది కోట్లు దాటిన భారతీయు లే

కళ్యాణి చల్లని కడుపు పంట

ఆమె బ్రహ్మర్షి జాతి కళ్యాణ గీతి

ధర్మాసముసేత వీరమాత ప్రవూతి

విశ్వవిఖ్యాత సిశ్రీల వెలముగాతి

పరమ కరుణ సమేత మా భరతమాత

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: