telugudanam.com

      telugudanam.com

   

అందరమూ మానవులం

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిటి తండ్రీ, నీ పిల్లల మేమెల్ల || నారాయణ ||

మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బయితే

మతం వద్దు గతం వద్దు

మాయా మర్మం వద్దు || నారాయణ ||

ద్వేషాలూ, రోషాలూ తెచ్చేదే మతమైతే

కలహాలూ, కక్షలూ కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణహోమం వద్దు || నారాయణ ||

మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరమూ మానవులం

అందరమూ మానవులం || నారాయణ ||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: